BRS MLA Jeevan Reddy: రేవంత్ రెడ్డి, బండి సంజయ్‌లపై జీవన్ రెడ్డి సెటైర్లు

BRS MLA Jeevan Reddy: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కొత్తగా నిర్మించిన సెక్రటేరియట్ గుమ్మటాలు కూలుస్తా అని అంటున్నాడు. ప్రభుత్వం నిర్మించిన కట్టడాలను కూలిస్తే ప్రజలు ఆ పార్టీని భూమిలో పాతి పెడతారు అనే విషయం మర్చిపోవద్దు అని జీవన్ రెడ్డి హెచ్చరించారు. 

Written by - ZH Telugu Desk | Last Updated : Feb 11, 2023, 03:24 AM IST
BRS MLA Jeevan Reddy: రేవంత్ రెడ్డి, బండి సంజయ్‌లపై జీవన్ రెడ్డి సెటైర్లు

BRS MLA Jeevan Reddy: రాష్ట్రంలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మతి భ్రమించి మాట్లాడుతున్నారని పి.యూ.సీ చైర్మన్, ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి అన్నారు. శుక్రవారం అసెంబ్లీ ఆవరణలో మీడియా పాయింట్ వద్ద జీవన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. " దేశంలో ఎక్కడా లేని విధంగా ముఖ్యమంత్రి కేసిఆర్ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తోంటే.. మరోవైపు వీళ్ళేమో కూలుస్తాం, బద్ధలుకొడతాం అని టెర్రరిస్టుల్లా మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. కేసీఆర్ అద్భుతమైన కట్టడాలు నిర్మిస్తుంటే వాళ్లు చూసి తట్టుకోలేకపోతున్నారని.. ఆ కడుపు మంటతోనే ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు" అని మండిపడ్డారు. 

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కొత్తగా నిర్మించిన సెక్రటేరియట్ గుమ్మటాలు కూలుస్తా అని అంటున్నాడు. ప్రభుత్వం నిర్మించిన కట్టడాలను కూలిస్తే ప్రజలు ఆ పార్టీని భూమిలో పాతి పెడతారు అనే విషయం మర్చిపోవద్దు అని జీవన్ రెడ్డి హెచ్చరించారు. బీజేపి అధికారంలో ఉన్న కర్ణాటక, ఉత్తర్ ప్రదేశ్, గుజరాత్ రాష్ట్రాల అసెంబ్లీలకు కూడా గుమ్మటాలు ఉన్నాయి కదా.. బండి సంజయ్ వెళ్లి ముందు  వాటిని కూల్చి రావాలి అని సవాల్ విసిరారు. రేవంత్ రెడ్డి, బండి సంజయ్ మాట్లాడుతున్న టెర్రరిస్టుల భాషను తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు. వారి పార్టీలకు ప్రజలు ఎపుడు ఎన్నికలు వచ్చినా తగిన బుద్ది చెబుతారు అని హితవు పలికారు.

రేవంత్ రెడ్డి టీపీసీసీ చీఫ్ అయ్యాకా తెలంగాణ ప్రదేశ్ క్రిమినల్ సెంటర్ అయ్యింది. రేవంత్ రెడ్డికి పీసీసీ చీఫ్ పోస్ట్ ఇవ్వడంతో ఏఐసీసీ కాస్తా ఆల్ ఇండియా క్రిమినల్ సెంటర్ అయ్యింది అని రేవంత్ రెడ్డిని ఎద్దేవా చేశారు. రేవంత్ రెడ్డి, బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలను ఉద్దేశించి జీవన్ రెడ్డి మాట్లాడుతూ.. మీ పార్టీలు అధికారంలో ఉన్న చోటుకు వెళ్లి కూల్చిరండి అని అన్నారు. ప్రజలు ఇప్పటికే మిమ్మల్ని కూల్చివేశారు. రేవంత్ రెడ్డి టీపీసీసీ చీఫ్ అయ్యాకా కాంగ్రెస్ పార్టీని అహింసవాదం నుండి హింసా వాదానికి తీసుకువచ్చాడు అని రేవంత్ రెడ్డిపై సెటైర్లు వేసే ప్రయత్నం చేశారు.

అధికారంలోకి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి  ధరణి పోర్టల్ రద్దు చేస్తాం అని అంటున్నారు కానీ అసలు వారు అధికారంలోకి వస్తే కదా అని జీవన్ రెడ్డి వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీ, బిజెపి పార్టీలు చేస్తోన్న యాత్రలు పాదయాత్రలు కావని.. అవి ఆ పార్టీలకు అంతిమయాత్రలు అని సెటైర్లు వేశారు. జనం నుంచి ఆధరణ లేకపోవడంతో వారి పాదయాత్రలు విలవిల పోతున్నాయి. పాద యాత్రలు కాంగ్రెస్ పార్టీ, బీజేపీలకు పాడె యాత్రలు, అంతిమ యాత్రలుగా మారాయి అని ఎద్దేవా చేశారు. ఎర్రగడ్డ ఆసుపత్రిలో ఉండాల్సిన వాళ్లు పార్టీల అధ్యక్షులు అయితే ఇలాగే ఉంటుంది మరి అంటూ ప్రతిపక్షాల అధ్యక్షులపై జీవన్ రెడ్డి వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

ఇది కూడా చదవండి : Revanth Reddy Padayatra: బీఆర్ఎస్‌లో చేరిన ఆ 12 మంది ఎమ్మెల్యేలపై రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

ఇది కూడా చదవండి : Revanth Reddy Challenges KTR: నేను రెడి.. నువ్వు రెడినా ? కేటీఆర్‌కి రేవంత్ రెడ్డి సవాల్..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Trending News