Revanth Reddy Fires on PM Modi And CM KCR: ప్రధాని మోదీ, సీఎం కేసీఆర్‌పై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు రేవంత్ రెడ్డి. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు ఒక్కటేనని.. వచ్చే ఎన్నికల్లో పొత్తు కుదిరిందన్నారు. గల్లీలో కుస్తీ.. ఢిల్లీలో దోస్తీ అంటూ ఎద్దేవా చేశారు.
Revanth Reddy On Minister Srinivas Goud: మంత్రి శ్రీనివాస్ గౌడ్ తమ వాళ్లపై కేసులు పెట్టించారని.. తాము మహబూబ్ నగర్‌కు వస్తే వీపు చింతపండు అవుతుందని రేవంత్ రెడ్డి హెచ్చరించారు. అభివృద్ధి ముసుగులో పేదల భూములను బీఆర్ఎస్ గుంజుకుంటోందని మండిపడ్డారు.
బీజేపీ సీనియర్ నేత డీకే అరుణపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. గద్వాల జిల్లా అమ్మగారి బంగ్లాలో బందీ అయిందన్నారు. గద్వాల ప్రజలను బంగ్లాలో బానిసలుగా మార్చారని అన్నారు. పాలమూరులోని అన్ని స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని కోరారు.
Revanth Reddy On Harish Rao: మంత్రి హరీష్ రావుపై రేవంత్ రెడ్డి విమర్శలు గుప్పించారు. వార్డు మెంబర్ కూడా కాలేని ఆయనను వైఎస్ఆర్ అప్పట్లో మంత్రిని చేశారని అన్నారు. కేసీఆర్ సత్య హరిశ్చంద్రుడు అని చెప్పడానికి హరీష్‌కు సిగ్గుండాలంటూ ఫైర్ అయ్యారు.
Revanth Reddy Counter to Ministers: రాహుల్ గాంధీపై విమర్శలు గుప్పించిన మంత్రులు, బీఆర్ఎస్ నాయకులకు రేవంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. రాహుల్ గాంధీకే తెలంగాణలో పర్యటించే అర్హత ఉందన్నారు. రాష్ట్రంలో అధికారంలోకి వస్తే.. రూ.4 వేల పెన్షన్ ఇచ్చి తీరుతామని స్పష్టంచేశారు.
Komatireddy Raj Gopal Reddy on Revanth Reddy: ఎమ్మెల్సీ కవితతో కలిసి రేవంత్ రెడ్డి వ్యాపార లావాదేవీలు చేస్తున్నారని బీజేపీ నాయకుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆరోపించారు. రేవంత్ రాజకీయ వ్యభిచారి అంటూ తీవ్రస్థాయంలో మండిపడ్డారు. నోట్ల కట్టలతో రెడ్ హాండెడ్‌గా దొరికి జైలుకు వెళ్లిన చరిత్ర రేవంత్ రెడ్డిదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకురావటమే తన లక్ష్యమని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. మేడారంలో వేసిన ఈ అడుగు కేసీఆర్ ప్రభుత్వాన్ని పాతాళానికి తొక్కడానికే అని అన్నారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో పాదయాత్రకు కొనసాగింపుగా టీపీసీసీ చేపడుతున్న హాథ్ సే హాథ్ జోడో పాదయాత్రలో భాగంగా సోమవారం ములుగు నియోజకవర్గం పరిధిలోని పస్రా గ్రామంలో నిర్వహించిన కార్నర్ మీటింగ్‌లో రేవంత్ రెడ్డి ప్రసంగించారు.
TPCC Chief Revanth Reddy : ఇటీవల తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా నియమితులైన రేవంత్ రెడ్డి బుధవారం నాడు హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో ఉత్తమ్ కుమార్ నుంచి బాధ్యతలు స్వీకరించారు. కాంగ్రెస్ శ్రేణుల్లో నూతనోత్సాహం కనిపిస్తోంది.
TPCC Chief Revanth Reddy: గత ఏడాది నుంచి నెలకొన్న టీపీసీసీ పీఠంపై ఉత్కంఠ వీడిపోయింది. ఏఐసీసీ తెలంగాణ ఇంఛార్జి మాణిక్యం ఠాగూర్ ఆరు నెలల కిందటే రాష్ట్రంలో పర్యటించారు. కానీ టీపీసీసీ అధ్యక్షుడి పదవిపై మీనమేషాలు లెక్కిచారు. రేవంత్ రెడ్డిని టీపీసీసీ ప్రెసిడెంట్‌గా ఖరారు చేస్తూ ప్రకటన చేసింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.