Hyderabad Metro Rail: హైదరాబాద్: ఎల్బీ నగర్ నుంచి హయత్ నగర్ సమీపంలోని అబ్ధుల్లాపూర్ మెట్ వరకు మెట్రో రైలు మార్గాన్ని పొడిగించాలని కోరుతూ తెలంగాణ సీఎం కేసీఆర్‌కి భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి లేఖ రాశారు. ఎల్బీ నగర్ నుండి అబ్దుల్లాపూర్‌మెట్ వరకు మెట్రో లైన్ పొడిగింపు అవసరం ఉందనే విషయాన్ని సర్కారు దృష్టికి తీసుకొచ్చారు.
Food Processing Units In Telangana: తెలంగాణ రైతు సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని, వ్యవసాయ విధానాలను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తోందని సీఎం తెలిపారు. అందులో భాగంగానే ప్రస్థుతం ఉన్న రైస్ మిల్లులు యధా విధిగా కొనసాగుతూనే, అధునాతన మిల్లులు, ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలను స్థాపించే దిశగా కార్యాచరణ చేపడుతామని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు తెలిపారు.
Holidays in Telangana Due to Heavy Rains: హైదరాబాద్ లో ఎడతెరిపి లేకుండా బారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో పౌరులు, చిన్నారుల భద్రత దృష్ట్యా తెలంగాణ సీఎం కేసీఆర్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. హైదరాబాద్‌లో గత మూడు, నాలుగు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా నగరం నలుమూలల లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయమయ్యాయి.
YS Sharmila on CM KCR: సీఎం కేసీఆర్‌పై వైఎస్ షర్మిల ఘాటు వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్‌కు మాట మీద నిలబడే దమ్ముంటే.. ముందు రుణమాఫీ చేసి చూపించాలని డిమాండ్ చేశారు. రుణ మాఫీ పేరుతో రైతులకు బూటకపు హామీ ఇచ్చారని ఫైర్ అయ్యారు.
Revanth Reddy Letter To Telangana Farmers: బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనపై రైతులకు బహిరంగ లేఖ రాశారు రేవంత్ రెడ్డి. రైతులకు 24 గంటల కరెంట్ ఇవ్వడం లేదని.. ఇందుకు సబ్ స్టేషన్లలోని బుక్లే సాక్ష్యమని అన్నారు. ఈ విషయాన్ని కాంగ్రెస్ బయటపెట్టడంతో ప్రభుత్వం ఉలిక్కిపడుతోందన్నారు.
Revanth Reddy On Harish Rao: మంత్రి హరీష్ రావుపై రేవంత్ రెడ్డి విమర్శలు గుప్పించారు. వార్డు మెంబర్ కూడా కాలేని ఆయనను వైఎస్ఆర్ అప్పట్లో మంత్రిని చేశారని అన్నారు. కేసీఆర్ సత్య హరిశ్చంద్రుడు అని చెప్పడానికి హరీష్‌కు సిగ్గుండాలంటూ ఫైర్ అయ్యారు.
MBBS To Falaknuma Metro: పాత బస్తీలో మెట్రో నిర్మాణానికి సీఎం కేసీఆర్ ఒకే చెప్పారు. దీంతో ఎంజీబీఎస్ నుంచి ఫలక్‌నుమా మార్గంలో 5.5 కిలోమీటర్ల నిర్మాణానికి అడుగులు పడనున్నాయి. ఈ మేరకు మంత్రి కేటీఆర్ ట్వీట్ చేయగా.. ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ కూడా స్వాగతించారు.
CM KCR meeting with leaders from Solapur in Maharashtra: హైదరాబాద్ : మహారాష్ట్రతో తెలంగాణది ‘రోటీ బేటీ’ బంధమని, వెయ్యి కిలోమీటర్ల మేర సరిహద్దును పంచుకుంటున్న రెండు రాష్ట్రాల ప్రజల నడుమ మొదటి నుంచీ సామాజిక బాంధవ్యం, సాంస్కృతిక సారూప్యత వున్నదని, ఈ నేపథ్యంలో మహారాష్ట్ర అభివృద్ధికి తాము కట్టుబడి ఉన్నామని బిఆర్ఎస్ పార్టీ జాతీయ అధ్యక్షులు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు తెలిపారు.
Revanth Reddy On Dharani Portal: ధరణి పోర్టల్‌లో భారీగా అక్రమాలు జరిగాయని.. జూలై 15వ తేదీ తరువాత అన్ని బయటపెడతామని రేవంత్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ధరణి పోర్టల్‌ను రద్దు చేస్తామన్నారు. ఈ సందర్భంగా భూమి డిక్లరేషన్‌ను విడుదల చేశారు.
President Draupadi Murmu Hyderabad Tour: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హైదరాబాద్‌కు చేరుకున్నారు. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు 125వ జయంతి వేడుకల ముగింపు ఉత్సవాల్లో పాల్గొనేందుకు రాష్ట్రపతి భాగ్యనగరానికి విచ్చేశారు. గవర్నర్ తమిళసై, సీఎం కేసీఆర్ స్వాగతం పలికారు.
YSRTP chief YS Sharmila About Corruption in Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో భారీ ఎత్తున అవినీతి జరిగింది అని ఏఐసిసి అగ్రనేత రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలపై తెలంగాణ మంత్రులు ఎదురుదాడికి దిగడాన్ని వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్రంగా తప్పుపట్టారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంతో వచ్చిన కమీషన్లతో కేసీఆర్ జాతీయ రాజకీయాలు చేస్తున్నారని వైఎస్ షర్మిల మండిపడ్డారు.
Revanth Reddy Challenge To CM KCR: జూలై 2న ఖమ్మంలో కాంగ్రెస్ పార్టీ భారీ బహిరంగ సభ తలపెట్టిన నేపథ్యంలో అక్కడ జరుగుతున్న ఏర్పాట్లను తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పరిశీలించి ఏర్పాట్లను సమీక్షించారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకి సవాల్ విసిరారు.
YS Sharmila Slams KCR: అన్నివర్గాల ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చిన మీది ప్రజల పక్షం కాదు... ప్రజలను దోచుకు తినే దొంగల పక్షం.. ఇంకా చెప్పాలంటే జనాలను పట్టి పీడించే బీఆర్ఎస్ పార్టీది దొంగల పక్షమే అవుతుంది అని తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుపై వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మండిపడ్డారు.
మహారాష్ట్రలో బీఆర్ఎస్ బలోపేతం సీఎం కేసీఆర్ దృష్టిపెట్టారు. రెండు రోజులు మహారాష్ట్రంలో పర్యటించనున్నారు. ఈ మేరకు హైదరాబాద్ నుంచి భారీ కాన్వాయ్‌లతో ర్యాలీగా వెళ్లారు.
Rythu Bandhu Scheme June installment Will be Credited by Today: రైతులకు ఈ నెల 26వ తేదీ నుంచి రైతుల బ్యాంకు ఖాతాల్లో రైతు బంధు సహాయం జమ చేయాల్సిందిగా స్పష్టంచేస్తూ తెలంగాణ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారితో పాటు అన్ని జిల్లాల కలెక్టర్లు, వ్యవసాయ శాఖకు సంబంధించిన సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీచేసిన సంగతి తెలిసిందే.
Dalit Bandhu Second Phase funds Released: తెలంగాణలో దళితు బంధు రెండో విడత కింద దాదాపు 1.30 లక్షల మంది కుటుంబాలకు లబ్ధి చేకూరనుంది. ప్రతి నియోజకవర్గం నుంచి 1115 లబ్ధిదారులను ఎంపిక చేయనున్నారు. ఒక్కొక్కరి ఖాతాలో రూ.10 లక్షలు జమ చేయనుంది రాష్ట్ర ప్రభుత్వం.
New Update on Dalitha Bandhu 2nd Phase: దళిత బంధు పథకం రెండో ఫేజ్ వచ్చేసింది. తెలంగాణ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ముందుగానే చెప్పిన విధంగా ఒక్కో నియోజకవర్గంలో దళిత బంధు పథకం కింద 1115 మంది లబ్ధిదారులను ఎంపిక చేసి వారికి రూ. 10 లక్షల ఆర్థిక సహాయం అందించనున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.