Revanth Reddy on CM KCR: ఓటమి భయంతోనే సీఎం కేసీఆర్ రెండు చోట్ల పోటీ చేస్తున్నాడని అన్నారు రేవంత్ రెడ్డి. రెండు నియోజకవర్గాల్లోనూ ప్రజలు ఓడిస్తారని జోస్యం చెప్పారు. కేసీఆర్ గొంతులో భయం కనిపిస్తోందన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమని అన్నారు.
BRS MLA Candidates First List: అసెంబ్లీ ఎన్నికలకు తొలి లిస్టును సీఎం కేసీఆర్ ప్రకటించారు. 115 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించగా.. 7 స్థానాల్లో సిట్టింగ్‌లను మార్చారు. మరో నాలుగు స్థానాలకు ఇంకా అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. అయితే వామపక్షాలు అడుగుతున్న సీట్లలోనూ అభ్యర్థులను ప్రకటించారు.
YS Sharmila About Dalita Bandhu Scheme: తీగల్ గ్రామస్థులు తమకు జరిగిన అన్యాయంపై లేఖ రాశారని.. అందుకే అక్కడి దళితులకు దళిత బంధు పథకం అమలు అవుతుందో లేదోననే వివరాలు తెలుసుకోవడం గురించి వెళ్ళడానికి ప్రయత్నించాం. కానీపోలీసులు మేము అక్కడికి వెళ్లేందుకు అనుమతి ఇవ్వలేదు అని వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు.
Etela Rajender Comments On CM KCR: సీఎం కేసీఆర్‌పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు ఎమ్మెల్యే ఈటల రాజేందర్. రైతుల భూములు లాక్కుంటున్న బీఆర్ఎస్ ప్రభుత్వానికి రోజులు దగ్గరపడ్డాయని అన్నారు. రైతుల మీద జలగల్లాగా బతకవద్దన్నారు.
TSPSC Group-2 exam: టీఎస్పీఎస్సీ గ్రూప్-2 పరీక్షలు నవంబరుకు వాయిదా పడ్డాయి. ఈ మేరకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. తెలంగాణ వ్యాప్తంగా గ్రూప్-2కు 5.51 లక్షల మంది దరఖాస్తు చేసుకున్న సంగతి తెలిసిందే.
Telangana Assembly Elections: ప్రతిపక్షాలకు షాకిస్తూ.. అసెంబ్లీ ఎన్నికలకు బీఆర్ఎస్ పార్టీ సిద్ధమవుతోంది. ఇప్పటికే అభ్యర్థుల జాబితాపై కసరత్తు పూర్తి చేసిన గులాబీ బాస్ కేసీఆర్.. త్వరలోనే ఫస్ట్ లిస్ట్‌ను రిలీజ్ చేస్తారని ప్రచారం జరుగుతోంది. 80 శాతం సిట్టింగ్‌లకే టికెట్లు ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.
Minister Harish Rao News: వచ్చే ఎన్నికల్లో గజ్వేల్‌లో కాంగ్రెస్ డిపాజిట్ గల్లంతవుతుందని అన్నారు మంత్రి హరీశ్ రావు. సీఎం కేసీఆర్‌కు లక్ష మెజారిటీ అందివ్వాలని కోరారు. గజ్వేల్‌లో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలను మంత్రి వివరించారు.
KTR Review Meeting on Hyderabad Metro Rail Master Plan: హైదరాబాద్ మెట్రో రైల్ విస్తరణ మాస్టర్ ప్లాన్‌పై మంత్రి కేటీఆర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. నగరంలో రద్దీ, కాలుష్యం తగ్గేలా మెట్రో విస్తరిస్తున్నట్లు చెప్పారు. విశ్వ నగరంగా మారాలంటే ప్రజా రవాణా వ్యవస్థ బలోపేతం కావాలన్నారు.
Harish Rao Review On Minority Welfare Schemes: రాష్ట్రంలో మైనారిటీలకు తెలంగాణ సర్కారు గుడ్‌న్యూస్ చెప్పింది. ఈ నెల 16వ తేదీ నుంచి రూ.లక్ష చెక్కులను అందజేయాలని మంత్రి హరీశ్ రావు అధికారులను ఆదేశించారు. మొదటి దశలో 10 వేల మందికి అందజేస్తున్నట్లు తెలిపారు.
BRS Working President KTR: ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో క్లీన్‌స్వీప్ దిశగా బీఆర్ఎస్ అడుగులు వేస్తోంది. కేటీఆర్ నేతృత్వంలో వ్యూహాలకు పదునుపెడుతున్నారు. ఇప్పటి నుంచే యాక్షన్ ప్లాన్ సిద్ధం చేస్తున్నారు. మరో మూడు నెలలు గ్రౌండ్ లెవల్లోనే ఉండాలని నేతలకు సూచించారు కేటీఆర్.
Group-2 Exam: గ్రూప్-2 పరీక్షను షెడ్యూల్ ప్రకారమే నిర్వహించనున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఈ పరీక్షకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను పకడ్భందీగా చేయాలని ముఖ్యమంత్రి అధికారలను ఆదేశించారు.
Pay Revision Commission Telangana: సీఎం కేసీఆర్ ఈ అసెంబ్లీ సమావేశాల్లో ఉద్యోగులకు సంబంధించి కీలక ప్రకటన చేయబోతున్నారు. పీఆర్సీతోపాటు ఐఆర్‌కు సంబంధించిన నేడు లేదా రేపు ప్రకటన చేయనున్నారని ఉద్యోగ సంఘాల నాయకులు తెలిపారు. గురువారం వారు ముఖ్యమంత్రిని కలిశారు.
CM KCR Speech in Maharashtra: అన్నాభావ్ సాఠే 103వ జయంతి కార్యక్రమంలో సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. మహారాష్ట్రలోని వాటేగావ్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో అన్నాభావ్ సాఠే గొప్పతనాన్ని వివరించారు. ఆయనకు భారతరత్న ప్రకటించాలన్నారు.
BRS Working President KTR: ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయాలను ప్రజల్లో మరింత తీసుకువెళ్లాలని మంత్రి కేటీఆర్ సూచించారు. దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం తీసుకోని నిర్ణయాలను బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకుందని.. ప్రజలకు వివరించాలని పిలుపునిచ్చారు.
CM KCR Maharashtra Tour : సీఎం కేసీఆర్ ఈరోజు మహారాష్ట్ర వెళ్లనున్నారు. పర్యటనలో భాగంగా.. తొలుత కొల్హాపూర్ అమ్మవారి దర్శనం చేసుకుంటారు. అనంతరం అన్నాభావూ సాఠే 103వ జయంతి వేడుకల్లో పాల్గొంటారు.
Revanth Reddy Visits Uppal and LB Nagar: ప్రగతి భవన్ చిల్లర రాజకీయాలకు వేదికగా మారిందంటూ ఘాటు విమర్శలు చేశారు రేవంత్ రెడ్డి. వరదలపై ముందస్తుగా సీఎం సమీక్షలు చేయలేదని.. మంత్రి కేటీఆర్‌కు ప్రజల ప్రాణాలపై శ్రద్ధలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
YS Sharmila Slams CM KCR: వర్షాలు, వరదలతో రాష్ట్రంలో ప్రజలు ఇబ్బందులు పడుతున్నా.. సీఎం కేసీఆర్ పట్టించుకోవట్లేదని వైఎస్ షర్మిల అన్నారు. వర్షాలు తగ్గిపోయిన తరువాత వచ్చి హెలికాఫ్టర్‌లో చక్కర్లు కొట్టి.. ఇంటికి పది వేలు, పంటకు పదివేలు అనే ప్రకటనలు ఇస్తాడని జోస్యం చెప్పారు.
Good news to VRAs, VRAs are now Govt Employees: ప్రభుత్వ ఉద్యోగుల కోసం రాష్ట్ర ప్రభుత్వం మానవీయ కోణంలో పనిచేస్తున్నదని సీఎం కేసీఆర్ అన్నారు. ఇటీవలే కాలం చెల్లిన వీఆర్వో వ్యవస్థను రద్దు చేసుకున్నామని, రైతుల కల్లాల కాడ ఇచ్చింది తీసుకుంటూ.. గ్రామ సేవ చేసిన నాటి భూస్వామ్య కాలపు అవశేషమైన వీఆర్ఏ వృత్తి విధానాన్ని రద్దు చేసుకొన్నామన్నారు. వారికి పే స్కేలు కల్పించి వారిని ప్రభుత్వ ఉద్యోగులుగా పర్మినెంట్ చేశామని సీఎం అన్నారు.
Double Bedroom Flats Distribution: ఎన్నికలు వచ్చిన ప్రతీసారి తియ్యటి మాటలతో ప్రజలను మభ్య పెడుతూ ప్రజలని ముఖ్యమంత్రి కేసీఆర్ మోసం చేస్తున్నారని ఎమ్మెల్యే రఘునందన్ రావు మండిపడ్డారు. ఓట్ల కోసం మాత్రమే కేసిఆర్ కొత్త కొత్త పథకాలని ప్రవేశపెట్టడం జరుగుతుందని.. ఆ తరువాత ఇచ్చిన హామీలను, ప్రవేశపెట్టిన పథకాలను మర్చిపోవడం జరుగుతోంది అని ఆగ్రహం వ్యక్తంచేశారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.