Hyderabad Metro Rail: హైదరాబాద్, 22 సెప్టెంబర్ 2023: హైదరాబాద్ మెట్రో రైలు ప్రయాణికులకు హైదరాబాద్ మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ మరో గుడ్ న్యూస్ అందించింది. హైదరాబాద్ మెట్రో రైలు తమ ప్రయాణీకులకు మెరుగైన ప్రయాణ అనుభవాన్ని అందించడం కోసం సూపర్ సేవర్ - 59 ఆఫర్ (SSO-59)ని తిరిగి మెట్రో ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకువచ్చింది.
Hyderabad Metro Rail: హైదరాబాద్: ఎల్బీ నగర్ నుంచి హయత్ నగర్ సమీపంలోని అబ్ధుల్లాపూర్ మెట్ వరకు మెట్రో రైలు మార్గాన్ని పొడిగించాలని కోరుతూ తెలంగాణ సీఎం కేసీఆర్‌కి భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి లేఖ రాశారు. ఎల్బీ నగర్ నుండి అబ్దుల్లాపూర్‌మెట్ వరకు మెట్రో లైన్ పొడిగింపు అవసరం ఉందనే విషయాన్ని సర్కారు దృష్టికి తీసుకొచ్చారు.
HMRL Staff Protests: హైదరాబాద్ మెట్రోకి ప్రధానమైంది రెడ్ లైన్ మెట్రో లైన్. మియాపూర్ టూ ఎల్బినగర్ వరకు నడిచే సర్వీస్‌లు నిలిచిపోవడంతో హైదరాబాద్‌లో నేడు ట్రాఫిక్ రద్దీ పెరిగిపోయింది. తమకు ఏళ్లుగా ఉన్న వేతన సమస్యలను వెంటనే పరిష్కరించాలని అమీర్‌పేట్ మెట్రో స్టేషన్ వద్ద బైఠాయించి నిరసనకు దిగారు.
Hyderabad Metro Second Phase DPR: కేంద్ర మంత్రికి రాసిన లేఖలో హైదరాబాద్ మెట్రోరైల్ కారిడార్ -2 ఆవశ్యకత గురించి మంత్రి కేటీఆర్ వివరించారు. శరవేగంగా పెరుగుతున్న నగర జనాభా అవసరాలకు అనుగుణంగా కారిడార్ -2 కింద మెట్రో రైల్ విస్తరణ జరగాల్సిన అవసరం ఉందని మంత్రి కేటీఆర్ కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు.
Hyderabad Metro Last Train Services: సెప్టెంబర్ 25, ఆదివారం నాడు ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో ఇండియా vs ఆస్ట్రేలియా జట్ల మధ్య జరగనున్న మూడవ టీ20 క్రికెట్ మ్యాచ్‌ను ప్రత్యక్షంగా వీక్షించేందుకు వచ్చిపోయే క్రికెట్ ప్రియులకు హైదరాబాద్ మెట్రో గుడ్ న్యూస్ చెప్పింది.
Hyderabad Metro rail Timings: హైదరాబాద్: తెలంగాణలో లాక్ డౌన్ ఎత్తివేసిన నేపథ్యంలో ప్రయాణికుల సౌకర్యార్థం జూన్ 20, ఆదివారం నుంచి హైదరాబాద్ మెట్రో రైలుతో పాటు టిఎస్ఆర్టీసీ బస్సు సేవల సమయాల్లో మార్పులు చోటుచేసుకున్నాయి. ప్రయాణికుల (Passengers సౌకర్యార్థం ఉదయం నుంచి రాత్రి వరకు రవాణా సదుపాయాలు అందుబాటులో ఉండేలా హెచ్ఎంఆర్ఎల్, టిఎస్ఆర్టీసీ (HMRL, TSRTC) నిర్ణయం తీసుకున్నాయి.
Telangana lockdown timings latest updates: హైదరాబాద్: తెలంగాణలో జూన్ 10 నుంచి మరో 10 రోజుల పాటు లాక్డౌన్ పొడిగిస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం రెండు రోజుల క్రితం ప్రకటించిన సంగతి తెలిసిందే. మంగళవారం జరిగిన రాష్ట్ర కేబినెట్ భేటీలో సర్కారు తీసుకున్న నిర్ణయం ప్రకారం నేటి నుంచి లాక్డౌన్ వేళల్లో మార్పులు చోటుచేసుకోనున్నాయి.
TSRTC timings, Hyderabad metro timings changed: హైదరాబాద్: తెలంగాణలో గురువారం జూన్ 10 నుంచి లాక్డౌన్ పొడిగింపుతో పాటు లాక్డౌన్ వేళల్లో మార్పులు చోటుచేసుకున్న నేపథ్యంలో హైదరాబాద్ మెట్రో రైళ్ల వేళల్లోనూ మార్పులు చేసినట్టు హైదరాబాద్ మెట్రో రైలు (HMRL timings) అధికారులు తెలిపారు. అలాగే టిఎస్ఆర్టీసీ టైమింగ్స్‌లోనూ (TSRTC timings) మార్పులు చోటుచేసుకున్నాయి.
Hyderabad Metro Cash back | హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు శుభవార్త. మెట్రో జర్నీ చేసే వారికి 50 శాతం రాయితీ ( రూ.600 వరకు) కల్పించనున్నారు. మెట్రో కార్డుపై రీచార్జ్ చేసే వారు ఆదివారం నుంచే ఈ రాయితీని పొందవచ్చు అని హైదరాబాద్ మెట్రో ( Hyderabad Metro ) రైల్ డైరక్టర్ ఎన్వీఎస్ రెడ్డి శనివారం ప్రకటించారు.
Unlock 4 Guidelines details: హైదరాబాద్: అన్‌లాక్-4 మార్గదర్శకాలు విడుదల చేసిన కేంద్రం.. ఈ నెల 7 నుంచి మెట్రో రైలు సేవల ( Metro rail ) పునరుద్ధరణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. పట్టణాభివృద్ధి, రైల్వే, కేంద్ర హోంశాఖలను సంప్రదించిన అనంతరం దశలవారీగా మెట్రో కార్యకలాపాలు పునరుద్ధరించుకోవచ్చునని కేంద్రం స్పష్టంచేసింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.