Revanth Reddy On Harish Rao: ఉచిత విద్యుత్‌పై తెలంగాణ ప్రభుత్వం పదే పదే అరుస్తోందని.. బీఆర్‌ఎస్ ప్రభుత్వ అరుపులు చనిపోయే ముందు గావుకేకల్లాంటివంటూ సెటైర్లు వేశారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. ఉచిత విద్యుత్‌కు పేటెంట్ కాంగ్రెస్ కాదని చెప్పే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. 1999లోనే వైఎస్ఆర్ పీసీసీ అధ్యక్షుడుగా ఉన్నపుడు ఎన్నికల మేనిఫెస్టోలో ఉచిత విద్యుత్ అంశాన్ని పెట్టారని గుర్తు చేశారు. తెలుగు మేనిఫెస్టోలో 8వపేజీలో.. ఇంగ్లీష్ మేనిఫెస్టోలో 9వ పేజీలో కాంగ్రెస్ స్పష్టంగా చెప్పిందన్నారు. 1999లో అధికారంలోకి రాలేదు కాబట్టి అప్పుడు కాంగ్రెస్ ఉచిత విద్యుత్ ఇవ్వలేకపోయిందని అన్నారు.
విద్యుత్ ఉద్యమంలో కాంగ్రెస్, కమ్యూనిస్టులు కలిసి పోరాడారని అని రేవంత్ రెడ్డి అన్నారు. బషీర్ బాగ్ కాల్పుల్లో ముగ్గురు రైతులు మరణించారని.. చాలా మంది రైతులు తీవ్రంగా గాయపడ్డారని పేర్కొన్నారు. "చంద్రబాబు హయాంలో కేసీఆర్ టీడీపీ హెచ్ఆర్డీ విభాగం ఛైర్మన్‌గా ఉన్నారు. అప్పుడు పోచారం మంత్రిగా ఉన్నారు.. గుత్తా కీలక పదవిలో ఉన్నారు.. వీళ్లంతా చంద్రబాబుతో కలిసి విద్యుత్ పాలసీని తయారు చేశారు. బషీర్ బాగ్ కాల్పులకు మీరు కారణం కాదా..? అని కాంగ్రెస్ తరపున ప్రశ్నిస్తున్నా.. ఆగస్టు 28, 2000లో బషీర్ బాగ్ కాల్పులు జరిగాయి. ఆనాడు మంత్రి పదవి కోసం కేసీఆర్ చంద్రబాబు చెప్పులు మోసేందుకు సిద్ధమైంది నిజం కాదా..?
తుమ్మల, మండవ, బొజ్జల, వేమూరి రాధాకృష్ణ, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఇందుకు ప్రత్యక్ష సాక్షులు. బొజ్జల ఇచ్చిన డబ్బులతో ఆనాడు కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీ పెట్టారు. ఆంధ్రోళ్ల సొమ్ముతో కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీ పెట్టారు. చరిత్రకు సాక్షులు ఇంకా చాలా మంది ఉన్నారు. నేను టీడీపీలో చేరింది 2007లో.. బషీర్ బాగ్ కాల్పులు జరిగింది 2000లో.. కాల్పులకు నేను కారణం అవుతానని హరీష్ ఎలా మాట్లాడతారు..? వార్డు మెంబర్ కూడా కాని హరీష్ రావును మంత్రిని చేశారు వైఎస్ఆర్. తెలంగాణ కోసమే రాజీనామా చేశానని చెప్పుకున్న కేసీఆర్.. 2009లో మళ్లీ చంద్రబాబుతో పొత్తు ఎందుకు పెట్టుకున్నాడు..?
మీరు పరాన్నజీవులు.. ఒకవైపు టీడీపీ.. మరో వైపు కాంగ్రెస్ దాయాదాక్షిణ్యాలతో బతికారు. ఆ పార్టీలతో బతికి ఆ పార్టీలనే తిట్టే నీచ సంస్కృతి మీది.. అత్యంత అవినీతికి పాల్పడిన వారే ఇప్పుడు కేసీఆర్ సలహాదారులుగా ఉన్నారు. తెలంగాణ మేధావులపై కేసులు పెట్టి వేధించిన చరిత్ర కేసీఆర్‌ది. కేసీఆర్ సత్య హరిశ్చంద్రుడు అని చెప్పడానికి హరీష్‌కు సిగ్గుండాలి. గౌరవంగా ఉండాల్సిన గుత్తా, పోచారం కేసీఆర్ బూట్లు నాకుతున్నారు. గుత్తా తన కొడుకు కోసం దిగజారి ప్రవర్తిస్తున్నారు. పోచారం, గుత్తాని రైతు కులం నుంచి బహిష్కరించాలి. బాధ్యతాయుతమైన పదవుల్లో ఉండి వారు రాజకీయాలు మాట్లాడుతున్నారు.." అంటూ రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు.
వారిని గవర్నర్ వెంటనే పదవుల నుంచి బర్తరఫ్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ వచ్చే గ్రామాల్లో తాము ఓట్లు అడగమని స్పష్టం చేశారు. ఏ సబ్ స్టేషన్ పరిధిలో 24 గంటల ఉచిత విద్యుత్ ఇవ్వలేదని తేలుతుందో ఆ గ్రామాల్లో మీరు ఓట్లు అడగొద్దన్నారు. రెఫరెండానికి తాము రెడీ అని.. గ్రామ సభలు పెట్టి రైతులను అడుగుదామన్నారు.
ఈ సవాలుకు మీరు సిద్ధమా..? అని ప్రశ్నించారు. దమ్ముంటే సవాల్‌ను స్వీకరించి రచ్చబండ పెట్టాలని.. లేకుంటే ప్రభుత్వాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో వెలుగులు నింపింది కేసీఆర్ అయితే.. వచ్చే ఎన్నికల్లో గజ్వేల్ నుంచి పోటీ చేస్తానని ప్రకటించాలన్నారు. తాను 20 ఏళ్లుగా ప్రతిపక్షంలో ఉండి ప్రజల కోసం కొట్లాడుతున్నానని.. ఆత్మగౌరవంతో ప్రజలకోసం కొట్లాడిన చరిత్ర తనద్నారు. విద్యుత్ కొనుగోళ్లలో అవినీతి, అక్రమాలపై త్వరలోనే విద్యుత్ ఫైల్స్ విడుదల చేస్తామని తెలిపారు.
Also Read: 7th Pay Commission DA Hike: ఈ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త.. డీఏ పెంచుతూ నిర్ణయం
Also Read: Gas Bill Offers 2023: గ్యాస్ బిల్లుల చెల్లింపులపై బంపర్ ఆఫర్స్.. ఈ ప్రోమో కోడ్‌లను వాడుకోండి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి