Podu Bhoomulu Patta Distribution to Tribals by KCR: గిరిజనుల చిరకాల కోరిక నెరవేరనుంది. పోడు భూముల పట్టాల పంపిణీకి ముహూర్తం ఫిక్స్ అయింది. జూన్ 30న ఆసిఫాబాద్ జిల్లా కేంద్రం నుంచి సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ప్రారంభంకానుంది.
Bandi Sanjay Key Comments on BJP Alliance with Janasena: వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పొత్తుపై బండి సంజయ్ స్పందించారు. తాము ఒంటరిగానే పోటీ చేస్తామని తెలిపారు. కాంగ్రెస్-బీఆర్ఎస్ పార్టీలు కలిసి పోటీ చేస్తాయని జోస్యం చెప్పారు. కాంగ్రెస్‌లో చేరే నాయకులు ఆలోచించుకోని చేరాలని సూచించారు.
Telangana CM KCR for Farmers :వరి ధాన్యాన్ని బియ్యం, నూనె వంటి పలు రకాల ఉత్పత్తులుగా మార్చే ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలను జిల్లాల వారీగా ఏర్పాటు చేస్తామని, వరి ధాన్యం ఉత్పత్తిలో దేశంలో నెంబర్ వన్ స్థానానికి చేరుకున్న తెలంగాణ రైతాంగాన్ని తమ ఉత్పత్తులను విశ్వ విఫణిలో విక్రయించి మరిన్ని లాభాలు ఆర్జించే స్థాయికి చేరుస్తామని, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ప్రకటించారు.
Rythu Bandhu Scheme 2023 June: రైతు బంధు పథకం కింద ప్రభుత్వం అందించే ఆర్థిక సహాయం విడుదలకు తేదీ ఖరారైంది. రైతు బంధు నిధుల విడుదలపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతా కుమారితో పాటు వ్యవసాయ శాఖకు సంబంధించిన సంబంధిత అధికారులకు తెలంగాణ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు నుంచి స్పష్టమైన ఆదేశాలు జారీ అయ్యాయి. పూర్తి వివరాలు...
Bandi Sanjay Letter To CM KCR: రాష్ట్రంలో రిటైర్ట్ ఉద్యోగుల్లో చాలా మందికి పెన్షన్ అందక ఇబ్బంది పడుతున్నారని బండి సంజయ్ అన్నారు. వెంటనే పింఛన్ డబ్బులు రిలీజ్ చేయాలని.. ఉద్యోగులకు పీఆర్సీ ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్‌కు లేఖ రాశారు. లేఖలో పూర్తి అంశాలు ఇలా..
Bandi Sanjay About Journalists Plots: జర్నలిస్టులు డబ్బులు కట్టి కొనుక్కున్న స్థలాన్నే వారికి ఇవ్వడం లేదంటే ఏమనాలి ? ప్రజాస్వామ్యంలో నాలుగో స్థంభమైన జర్నలిస్టులకే న్యాయం జరగడం లేదు. వీళ్లకు స్థలం ఇవ్వాల్సిందేనని.. ప్రజాస్వామ్య మూల స్థంభమైన సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చినా అమలు చేయడం లేదంటే ఇగ సామాన్యుడిని పరిస్థితి ఏట్లుందో ఒక్కసారి అర్ధం చేసుకోవాలి అని బండి సంజయ్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
Revanth Reddy About Pro. Haragopal: ప్రొ. హరగోపాల్‌తో పాటు మరో 152 మందిపైన తాడ్వాయి పోలీస్ స్టేషన్లో ఉపా కేసులు నమోదు చేయడం అత్యంత దుర్మార్గమైన చర్య అని తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. ఈ పాలకులు ప్రజాస్వామ్య వాదులను భయపెట్టాలని చూస్తున్నారని మండిపడిన రేవంత్ రెడ్డి... ప్రో. హరగోపాల్ తెలంగాణ సమాజం గర్వించదగ్గ గొప్ప మేధావి అని కొనియాడారు.
Siddipet IT towers Inauguration: మంత్రి కేటీఆర్ గురించి మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ, కేటీఆర్ గురించి ఎంత చెప్పినా తక్కువే అని కొనియాడారు. కేటీఆర్ లాంటి ఐటీ మినిస్టర్ ఇతర రాష్ట్రాల్లో కావాలని యువత కోరుకుంటోంది అని చెబుతూ మంత్రి కేటీఆర్ పని తీరుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
Srinivasa Rao Political Entry: సీఎం కేసీఆర్ ఆదేశిస్తే.. తాను బీఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తానని చెప్పారు తెలంగాణ హెల్త్ డైరెక్టర్ గడల శ్రీనివాస రావు. కొత్తగూడెం నుంచి బీఆర్ఎస్ పార్టీ బీ ఫామ్ ఇస్తే బరిలో నిలబడతానని స్పష్టం చేశారు.
Minister Harish Rao: కాళేశ్వరం ప్రాజెక్టులో ఈఎన్సీ హరేరాం పాత్ర చాలా గొప్పది. అన్నీ సమయాల్లో, సందర్భాల్లో అండగా ఉన్నారు అని మంత్రి హరీశ్ రావు అన్నారు. దశాబ్ది ఉత్సవాలలో భాగంగా రంగనాయక జలాశయం నడి మధ్య సాగునీటి పండుగ జరగడం సంతోషంగా ఉందన్నారు.
సీఎం కేసీఆర్ నేడు నాగర్ కర్నూల్ జిల్లాలో పర్యటించనున్నారు. ఈ సందర్బంగా కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయం, బీఆర్ఎస్ కార్యాలయం, మెడికల్ కాలేజీలను ముఖ్యమంత్రి ప్రారంభిస్తారు. అనంతరం కొల్లాపూర్ చౌరస్తాలో భారీ బహిరంగ సభలో పాల్గొంటారు.
YS Sharmila On CM KCR: తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సీఎం కేసీఆర్ ఇచ్చి స్పీచ్‌పై కామెంట్స్ చేశారు వైఎస్ షర్మిల. ఆయన ప్రసంగం అంతా అబద్దాలమయం అని అన్నారు. మిగులు బడ్జెట్లో ఉన్న రాష్ట్రాన్ని అప్పల పాలుజేశారని ఫైర్ అయ్యారు.
MP Raghu Rama : ఢిల్లీ లిక్కర్ స్కామ్ మీద ఎంపీ రఘురామ సంచలన వ్యాఖ్యలు చేశాడు. కొందరు కీలక వ్యక్తుల విషయాలు చెప్పేందుకు శరత్ చంద్ర అప్రూవర్‌గా మారారనిపిస్తోందని అన్నాడు. బీజేపీ కోసం తెలంగాణ సీఎం కేసీఆర్‌ను జగన్ మోసం చేశాడని అన్నారు.
CM KCR Speech Telangana Formation Day Celebrations: తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. నూతన సచివాలయంలో వేడుకలను ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రజలను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు.
CM KCR Inaugurates Brahmin Sadan: గోపన్‌పల్లిలో 9 ఎకరాల్లో రూ. 12 కోట్లతో నిర్మించిన ‘విప్రహిత’ బ్రాహ్మణ సంక్షేమ సదనాన్ని సీఎం కేసీఆర్ బుధవారం ప్రారంభించారు. అంతేకాకుండా వారి సంక్షేమం కోసం అనేక పథకాలను ప్రకటించారు.
ప్రజల అభ్యంతరాల మేరకే ప్రభుత్వ నిర్ణయం ఉంటుందని ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అన్నారు. జగిత్యాల మాస్టర్ ప్లాన్ జీవో 238 రద్దు చేసినట్లు తెలిపారు. కొందరు కావాలని రైతులను రెచ్చగొట్టారని మండిపడ్డారు.
Minister Harish Rao Speech in Achhampeta BRS meeting: తెలంగాణ గొప్పతనం నిలిపే విధంగా కేసిఆర్ సెక్రటేరియట్ కడితే.. బిజెపి నాయకుడు కూలగొడతా అన్నాడు. కాంగ్రెస్ వారు పేల్చేస్తాం అన్నాడు. కూల్చేటోడో లేక పేల్చేటోడో కావాలా.. లేదంటే తెలంగాణ నిర్మించేటోడు కావాలా అనేది జనమే నిర్ణయించుకోవాలి అని మంత్రి హరీష్ రావు సూచించారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.