Nara Lokesh slams AP CM YS Jagan: అమరావతి: వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణం రాజు అరెస్టుపై స్పందిస్తూ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఏపీ సీఎం వైఎస్ జగన్‌పై ట్విటర్ వేదికగా తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో పరిస్థితులు దారుణంగా ఉన్నాయని, సీఎం జగన్ రెడ్డి నియంత కంటే ఘోరంగా కక్షపూరిత రాజకీయాలు చేస్తున్నారని నారా లోకేష్ మండిపడ్డారు.
MP Raghuramakrishnam Raju arrested on charges of sedition: హైదరాబాద్: వైసీపీ తిరుగుబాటు నేత, నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణం రాజును ఏపీ సీఐడీ పోలీసులు హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో అరెస్ట్ చేశారు. శుక్రవారం సాయంత్రం ఈ అరెస్ట్ జరిగింది. గత కొంతకాలంగా ఏపీ సీఎం వైఎస్ జగన్‌పై (AP CM YS Jagan) రఘురామ కృష్ణం రాజు పలు అంశాలపై ప్రభుత్వ వైఖరిని ఎండగడుతూ తీవ్ర విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే.
Nara Lokesh booked in Criminal case: అనంతపురం: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌పై అనంతపురం జిల్లా రాయదుర్గ్ నియోజకవర్గం పరిధిలోని డి హిరేహాల్ పోలీసు స్టేషన్లో ఓ క్రిమినల్ కేసు నమోదైంది. వైసీపీ ఎస్టీ సెల్ నాయకుడు భోజరాజు నాయక్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు నారా లోకేష్‌పై (FIR filed on Nara Lokesh) కేసు నమోదు చేశారు.
COVID-19 cases in Andhra Pradesh: అమరావతి: ఏపీలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు సంఖ్య భారీగా పెరుగుతోంది. గురువారం వరకు వరుసగా ఐదు రోజులపాటు 20 వేలకుపైగా నమోదైన కరోనా పాజిటివ్ కేసులు.. శుక్రవారం కాస్త తగ్గుముఖం పట్టించినట్టే కనిపించాయి. కానీ ఇంతలోనే శనివారం కొత్తగా గుర్తించిన కరోనా పాజిటివ్ కేసులు మరోసారి 20 వేల మార్కు దాటడం ఆందోళనకు గురిచేస్తోంది.
Vakeel Saab benefit shows: వకీల్ సాబ్ మూవీ విడుదలకు పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ నుంచి కౌంట్‌డౌన్ షురూ అయింది. పవన్ కల్యాణ్ అభిమానులకు ఉగాది కానుకగా అంతకంటే నాలుగు రోజులు ముందుగానే, అంటే ఏప్రిల్ 9నే వకీల్ సాబ్ మూవీ వరల్డ్ వైడ్‌గా ఆడియెన్స్ ముందుకు రానుంది. అజ్ఞాతవాసి మూవీ తర్వాత మూడేళ్ల గ్యాప్ తీసుకున్న పవన్ కల్యాణ్ మళ్లీ ఈ సినిమాతోనే హీరోగా ఆడియెన్స్ ముందుకొస్తుండటంతో పవర్ స్టార్ ఫ్యాన్స్ ఆనందానికి అవదుల్లేవు.
AP Local body elections Schedule 2021: అమరావతి: ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు షెడ్యూల్ రానే వచ్చింది. ఏపీ రాష్ట్ర ఎన్నికల ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్ షెడ్యూల్ విడుదల చేశారు.
AP govt to conduct 10th class exams in May 2021 | అమరావతి: కరోనావైరస్ మహమ్మారి కారణంగా ఈ ఏడాదిలో జరిగిన 10వ తరగతి బోర్డు పరీక్షల షెడ్యూల్ తీవ్ర అయోమయానికి గురిచేసిన నేపథ్యంలో రానున్న పదో తరగతి పరీక్షలు నిర్వహణపై ఏపీ సర్కార్ స్పష్టమైన వైఖరితో ముందుకు వెళ్తోంది.
AP Local Body Elections 2021: స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు కరోనా వైరస్ ఎట్టి పరిస్థితుల్లోనూ అడ్డంకి కాదని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్ పేర్కొన్నారు. ఫిబ్రవరి 2021లో ఏపీలో స్థానిక ఎన్నికలు నిర్వహించడం సాధ్యమేనని రాష్ట్ర ప్రభుత్వ వాదనపై హైకోర్టు ఆదేశాల మేరకు నిమ్మగడ్డ రమేష్ కుమార్ గురువారం కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేశారు.
CM Jagan On Corona Vaccine | ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్ కోవిడ్-19 వ్యాక్సిన్ పంపిణీపై ఒక క్లారిటీని ఇచ్చారు. ఏపీ ప్రజలకు కరోనా టీకా ఇవ్వడానికి ప్రభుత్వం ఎలాంటి ప్రణాళిక వేస్తోందో వివరించారు జగన్.
AP ECET 2020 Counselling | ఏపీ ఈసెట్ 2020 కౌన్సెలింగ్ తేదీని పొడగిస్తున్నట్టు కన్వీనర్ ఎమ్ ఎమ్ నాయక్ తెలిపారు. ఈ మేరకు ఆయన ఆర్డర్స్ జారీ చేశారు. ప్రాసెసింగ్ ఫీజు, ఫీజు చెల్లించే తేదీ, ఎడ్యుకేషన్ సర్టిఫికెట్ల వెరిఫికేషన్, కాలీజీల ( Colleges ) ఎంపిక, కోర్సుల గడువును నవంబర్ 11 వరకు పొడగిస్తున్నట్టు ఆయన తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ ( Andhra Pradesh ) లో మద్యం ధరలు అధికంగా ఉండటంతో.. మద్యం ప్రియులు సరిహద్దుకు దగ్గరగా ఉన్న వేరే రాష్ట్రాలను ఆశ్రయిస్తున్నారు. దీంతోపాటు దళారి వ్యాపారులు సైతం వేరే రాష్ట్రాల నుంచి భారీగా మద్యం బాటిళ్ల ( Illicit Liquor ) ను అక్రమంగా ఏపీకి తరలిస్తూ లక్షలు దండుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే మరోసారి మందుబాబులకు షాక్ ఇస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల (AP Local Body Elections) నిర్వహణపై రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి (Mekapati Goutham Reddy)గౌతమ్‌రెడ్డి క్లారిటీ ఇచ్చారు. మరోసారి కరోనావైరస్ (Coronavirus) వ్యాప్తి పెరిగే అవకాశం ఉందని నిపుణుల నుంచి హెచ్చరికలు ఉన్నాయని.. ఈ నేపథ్యంలో నవంబరులో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ కష్టమేనని మేకపాటి గౌతమ్ రెడ్డి పేర్కొన్నారు.
భారీ వర్షాలు, వరదలతో హైదరాబాద్ నగరం (Hyderabad Rains) అతలాకుతలమైంది. దాదాపు వారం నుంచి నగర ప్రజలంతా నానా అవస్థలు పడుతున్నారు. టాలీవుడ్ నటుడు బ్రహ్మాజీ (Actor Brahmaji ) ఇంటిని సైతం వరదలు చుట్టుముట్టాయి. ఈ క్రమంలో ఆయన సోమవారం ట్విట్టర్లో సరదాగా చేసిన కామెంట్స్.. కాస్తా.. ఏకంగా ట్విట్టర్ హ్యాండిల్ నుంచి తప్పుకునేలా చేశాయి.
తెలంగాణ (Telangana), ఆంధ్రప్రదేశ్‌లో గత వారం నుంచి కురుస్తున్న భారీ వర్షాలతో (Heavy rains) జన జీవనం అస్తవ్యస్తంగా మారింది. ఇప్పటికీ చాలా ప్రాంతాలు ఇంకా వరద నీటిలోనే మునిగి ఉన్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా కురిసిన వర్షాలు, పోటెత్తిన వరదలతో హైదరాబాద్ (Hyderabad) నగరం సైతం అతలాకుతలమై భారీగా నష్టపోయిన సంగతి తెలిసిందే.
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాష్ట్రంలో ఈ ఏడాది ఇంజనీరింగ్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించి ఏపీ ఎంసెట్ – 2020 (AP EAMCET 2020) కౌన్సెలింగ్ ప్రక్రియకు నోటిఫికేషన్ విడుదలైంది. ఈనెల 23వ తేదీ నుంచి 27వ తేదీ వరకు కౌన్సెలింగ్ (Counseling Notification) ప్రక్రియ జరగనుంది.
ఆంధ్రప్రదేశ్‌లో కరోనావైరస్ ( Coronavirus ) మహమ్మారి కేసులు నిరంతరం పెరుగుతూనే ఉన్నాయి. ఉపశమనం కలిగించే విషయం ఎమిటంటే.. మూడు వారాల క్రితం నిత్యం పదివేలకు చేరువలో నమోదైన కేసులు కాస్త.. ఇటీవల కాలంలో భారీగా తగ్గుముఖం పడుతున్నాయి.
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని విజయవాడ వాసులు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న చిరకాల కోరిక మరికొన్ని గంటల్లో నెరవేరనుంది. కొన్ని నెలలుగా వాయిదా పడుతూ వస్తున్న విజయవాడ కనకదుర్గ ఫ్లై ఓవర్ ( Vijayawada Kanakadurga flyover) ప్రారంభోత్సవానికి ముహూర్తం ఎట్టకేలకు ఖరారైంది.
ఆంధ్రప్రదేశ్‌లో గత 24 గంటల్లో 72,082 కరోనా శాంపిల్స్ పరీక్షించగా అందులో 4,622 మందికి కరోనావైరస్ ( Coronavirus ) సోకినట్టు నిర్ధారణ అయింది. దీంతో ఏపీలో ఇప్పటి వరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 7,63,573 కి చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం 42,855 యాక్టివ్ కేసులు ఉండగా మరో 7,14,427 మంది కరోనా నుంచి కోలుకున్నారు. గత 24 గంటల్లో ఏపీలో 35 మంది కరోనాతో మృతి చెందారు.
అమరావతి: ఏపీలో శనివారం ఉదయం 9 గంటల వరకు గత 24 గంటల్లో 73,625 కరోనా శాంపిల్స్‌ని పరీక్షించగా అందులో 5,653 మందికి కరోనావైరస్ ( Coronavirus ) సోకినట్టు గుర్తించారు. దీంతో ఏపీలో ఇప్పటి వరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 7,50,517 కి చేరింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.