Actor Brahmaji quits from twitter account: హైదరాబాద్: భారీ వర్షాలు, వరదలతో హైదరాబాద్ నగరం (Hyderabad Rains) అతలాకుతలమైంది. దాదాపు వారం నుంచి నగర ప్రజలంతా నానా అవస్థలు పడుతున్నారు. టాలీవుడ్ నటుడు బ్రహ్మాజీ (Actor Brahmaji ) ఇంటిని సైతం వరదలు చుట్టుముట్టాయి. ఈ క్రమంలో ఆయన సోమవారం ట్విట్టర్‌లో సరదాగా చేసిన కామెంట్స్.. కాస్తా.. ఏకంగా ట్విట్టర్ హ్యాండిల్ నుంచి తప్పుకునేలా చేశాయి. ఈ కామెంట్స్‌పై నెటిజన్లు అభ్యంతరం తెలుపుతూ.. విరుచుకుపడుతుండటంతో.. బ్రహ్మాజీ ట్విట్టర్ అకౌంట్‌ను డియాక్టీవేట్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. అసలేం జరిగిందంటే.. తన ఇంటిని వరదలు చుట్టుముట్టడంతో.. ఆ ఫొటోలను తీసి సోమవారం ట్విటర్‌లో పోస్ట్ చేశారు.
ఈ ఫొటోలతోపాటు ఓ కామెంట్‌ను సైతం బ్రహ్మాజీ జతచేశారు. ‘‘ఇది మా ఇంటి పరిస్థితి.. ఓ మోటరు బోటు కొనాలనుకుంటున్నా.. దయచేసి ఏదైనా మంచి పడవ గురించి సలహా ఇవ్వండి’’ అంటూ.. సరదాగా ఓ కామెంట్ పెట్టారు. ఇంకేముంది బ్రహ్మాజీ కామెంట్‌పై కొంతమంది నెటిజన్లు ఫైర్ అయ్యారు. ఇలాంటి పరిస్థితుల్లో సాయం చేయకుండా.. సెటైర్లు వేస్తావా అంటూ ఆగ్రహంతో ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. చేసేందేం లేక బ్రహ్మాజీ ట్విట్టర్ అకౌంట్‌ను డీయాక్టివేట్ చేశారు. Also read: Pawan Kalyan Donation: వరద బాధితులకు పవన్ కల్యాణ్ భారీ విరాళం.. జనసైనికులకు పిలుపు
ఈ విషయంపై టాలీవుడ్ నటుడు బ్రహ్మాజీ మంగళవారం క్లారిటీ ఇచ్చారు. ఇలాంటి జోకులు అప్పుడప్పుడు వేస్తానని ఆయన పేర్కొన్నారు. వరదల సమయంలో తాను తన భార్య, కుమారుడు బయటి నుంచి ఇంటికి వచ్చామని.. వరద నీరు ఇంటిని చుట్టుముట్టడంతో.. వెళ్లలేకపోయామని కొంతమంది స్థానికులు వచ్చి తన ఇంటికి సురక్షితంగా వెళ్లేలా సాయం చేశారని ఆయన పేర్కొన్నాకరు. బేస్‌మెంట్ లో కూడా వరద ప్రవాహం ఎక్కువగా ఉందని.. అప్పుడు తాను బోటును కొనాలనుకుంటున్నానని సరదాగా ట్విట్టర్లో చిన్న జోకు వేశానని, ఇది ఇంత పెద్ద సమస్యను తెచ్చిపెడుతుందని అనుకోలేదని బ్రహ్మాజీ క్లారిటీ ఇచ్చారు. ఏదిఏమైనా చిన్న జోక్ బ్రహ్మాజీని రెండు రోజుల నుంచి ముప్పుతిప్పలు పెట్టిందని.. ఇలాంటి సమయంలో అలా మాట్లాడకూడదంటూ పలువురు కామెంట్ చేస్తున్నారు.
- Read Also: Hyderabad Floods: వరద బాధితుల కోసం టాలీవుడ్ ప్రముఖుల విరాళాలు.. సాయం చేయాలంటూ పిలుపు
- Also read: NEET 2020 Results: ‘నీట్’గా లేదు.. ఆలిండియా టాపర్ సైతం ఫెయిల్\
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe