Vakeel Saab benefit shows: వకీల్ సాబ్ మూవీ బెనిఫిట్ షోలు ఉన్నట్టా లేనట్టా ?

Vakeel Saab benefit shows: వకీల్ సాబ్ మూవీ విడుదలకు పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ నుంచి కౌంట్‌డౌన్ షురూ అయింది. పవన్ కల్యాణ్ అభిమానులకు ఉగాది కానుకగా అంతకంటే నాలుగు రోజులు ముందుగానే, అంటే ఏప్రిల్ 9నే వకీల్ సాబ్ మూవీ వరల్డ్ వైడ్‌గా ఆడియెన్స్ ముందుకు రానుంది. అజ్ఞాతవాసి మూవీ తర్వాత మూడేళ్ల గ్యాప్ తీసుకున్న పవన్ కల్యాణ్ మళ్లీ ఈ సినిమాతోనే హీరోగా ఆడియెన్స్ ముందుకొస్తుండటంతో పవర్ స్టార్ ఫ్యాన్స్ ఆనందానికి అవదుల్లేవు. 

Written by - ZH Telugu Desk | Last Updated : Apr 1, 2021, 11:49 PM IST
  • వకీల్ సాబ్ మూవీ విడుదల కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోన్న పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఫ్యాన్స్.
  • మూడేళ్ల గ్యాప్ తర్వాత Vakeel Saab movie తో ఆడియెన్స్ ముందుకొస్తున్న పవర్ స్టార్ పవన్ కల్యాణ్ .
  • Vakeel Saab pre-release event కి నో చెప్పిన పోలీసులు బెనిఫిట్ షోలకు ఓకే చెబుతారా ? రెండు రాష్ట్ర ప్రభుత్వాల వైఖరి ఎలా ఉండనుంది ?
Vakeel Saab benefit shows: వకీల్ సాబ్ మూవీ బెనిఫిట్ షోలు ఉన్నట్టా లేనట్టా ?

Vakeel Saab benefit shows: వకీల్ సాబ్ మూవీ విడుదలకు పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ నుంచి కౌంట్‌డౌన్ షురూ అయింది. పవన్ కల్యాణ్ అభిమానులకు ఉగాది కానుకగా అంతకంటే నాలుగు రోజులు ముందుగానే, అంటే ఏప్రిల్ 9నే వకీల్ సాబ్ మూవీ వరల్డ్ వైడ్‌గా ఆడియెన్స్ ముందుకు రానుంది. అజ్ఞాతవాసి మూవీ తర్వాత మూడేళ్ల గ్యాప్ తీసుకున్న పవన్ కల్యాణ్ మళ్లీ ఈ సినిమాతోనే హీరోగా ఆడియెన్స్ ముందుకొస్తుండటంతో పవర్ స్టార్ ఫ్యాన్స్ ఆనందానికి అవదుల్లేవు. 

పవర్ స్టార్ ఫ్యాన్స్ (Pawan Kalyan fans) ఆనందం సంగతి ఎలా ఉన్నా.. వారి ఆశలపై కరోనా నీళ్లు చల్లుతోంది. ఇప్పటికే కరోనా కేసులు పెరిగిన కారణంగా కఠిన మార్గదర్శకాలు అమలులో ఉన్న నేపథ్యంలో వకీల్ సాబ్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి పోలీసులు నో చెప్పారు. అదే కరోనా ఇప్పుడు వకీల్ సాబ్ మూవీ నిర్మాత దిల్ రాజు ఆశలపై నీళ్లు చల్లే ప్రమాదం లేకపోలేదనే టాక్ వినిపిస్తోంది. 

Also read : Vakeel Saab pre-release event: వకీల్ సాబ్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి నో చెప్పిన పోలీసులు

ఇంకా వివరంగా చెప్పుకోవాలంటే.. వకీల్ సాబ్ మూవీకి ఉన్న క్రేజీని క్యాష్ చేసుకునేందుకు రెండు తెలుగు రాష్ట్రాల్లో బెనిఫిట్ షోలు ఉపయోగపడతాయని మూవీ యూనిట్ భావిస్తోంది. అందులో భాగంగానే తెలంగాణ సర్కార్, ఏపీ సర్కార్‌ల వద్ద అనుమతి తీసుకుని బెనిఫిట్ షోలు రన్ చేయాలని నిర్మాత దిల్ రాజు (Dil Raju) భావిస్తున్నాడట. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో బెనిఫిట్ షోలకు రెండు రాష్ట్ర ప్రభుత్వాలు అనుమతి ఇస్తాయా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. 

ఇటీవల తెలంగాణ సర్కార్ ఎక్స్‌ట్రా షోలకు అనుమతి ఇచ్చింది. పైగా ఇప్పటికే పెద్ద పెద్ద సినిమాలన్నీ మల్టీప్లెక్సులలో రూ. 200 టికెట్స్ అమ్ముడుపోతున్నాయి. కానీ బెనిఫిట్ షోల కోసం మాత్రం లోకల్ పోలీసులు అనుమతి ఇవ్వాల్సి ఉంటుంది. ఇటీవల వకీల్ సాబ్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి (Vakeel Saab pre-release event) హైదరాబాద్ పోలీసులు నో చెప్పిన సంగతి తెలిసిందే. అలాగే వకీల్ సాబ్ మూవీ బెనిఫిట్ షోల విషయంలోనూ పోలీసులు వైఖరి ఇలాగే ఉంటుందేమోననేది ఫిలిం నగర్ టాక్. వకీల్ సాబ్ మూవీ ట్రైలర్ (Vakeel Saab Trailer) మాత్రం సినిమాపై ఉన్న అంచనాలను భారీ స్థాయిలో పెంచింది. 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News