AP Local body elections 2021 Schedule: ఏపీ స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదల

AP Local body elections Schedule 2021: అమరావతి: ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు షెడ్యూల్ రానే వచ్చింది. ఏపీ రాష్ట్ర ఎన్నికల ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్‌ షెడ్యూల్ విడుదల చేశారు.

Last Updated : Jan 9, 2021, 12:49 AM IST
  • ఏపీ స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసిన ఎపీఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్.
  • మొత్తం 4 దశల్లో పూర్తి కానున్న స్థానిక సంస్థల ఎన్నికలు.
  • జనవరి 23న తొలి దశ ఎన్నిలకు నోటిఫికేషన్‌ విడుదల.
  • AP Local body elections 2021 schedule విడుదలైన నేపథ్యంలో శనివారం నుంచే రాష్ట్రంలో ఎన్నికల కోడ్.
AP Local body elections 2021 Schedule: ఏపీ స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదల

AP Local body elections Schedule 2021: అమరావతి: ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు షెడ్యూల్ రానే వచ్చింది. ఏపీ రాష్ట్ర ఎన్నికల ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్‌ షెడ్యూల్ విడుదల చేశారు. ఎపీ ఎన్నికల కమిషనర్ ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం జనవరి 23 నుంచి ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కానుండగా.. మొత్తం నాలుగు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. జనవరి 23న తొలి దశ ఎన్నిలకు నోటిఫికేషన్‌ విడుదల కానుండగా.. 27న రెండో దశ ఎన్నికలకు నోటిఫికేషన్ జారీ కానుంది. అలాగే 31న మూడో దశ ఎన్నికలకు, ఫిబ్రవరి 4న నాలుగో దశ ఎన్నికలకు నోటిఫికేషన్స్ విడుదల కానున్నాయి. 

పంచాయతీ ఎన్నికల తేదీల విషయానికొస్తే.. ఫిబ్రవరి 5న తొలి దశ పంచాయతీ ఎన్నికలు జరగనుండగా, ఫిబ్రవరి 9న రెండో దశ పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తారు. ఫిబ్రవరి 13న మూడవ దశ పంచాయతీ ఎన్నికలు, అలాగే ఫిబ్రవరి 17న నాలుగో దశ పంచాయతీ ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ ప్రణాళికలు సిద్దం చేసుకుంటోంది. స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ ( AP Local body elections 2021 schedule ) విడుదలైన నేపథ్యంలో రాష్ట్రంలో శనివారం నుంచే ఎన్నికల కోడ్ అమల్లోకి రానుంది.

Also read : AP Local Body Elections: కరోనా వైరస్ అడ్డంకి కాదు: అఫిడవిట్‌లో నిమ్మగడ్డ రమేష్ కుమార్ 

పోలింగ్ తేదీల్లో ఉదయం 6.30 గంటల నుంచే ఓటింగ్ ప్రారంభించి మధ్యాహ్నం 3.30 గంటలకు ముగించి ఆ తర్వాత సాయంత్రం 4 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ( AP Local body elections 2021 votes counting ) ప్రారంభించనున్నట్టు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ( Nimmagadda Ramesh Kumar ) ఎన్నికల షెడ్యూల్లో పేర్కొన్నారు.

Also read : KA Paul slams Pawan Kalyan: పవన్ కల్యాణ్‌ మతంపై కేఏ పాల్ వ్యక్తిగత విమర్శలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News