AP CM YS Jaganmohan Reddy Helps Kidney Patient: ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మరోసారి తన మానవతా దృక్పథాన్ని చాటుకున్నారు. బుధవారం కాకినాడ జిల్లా జగ్గంపేట పర్యటనకు వెళ్లిన ఏపీ సీఎం వైఎస్ జగన్ని అనారోగ్యంతో పాటు ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్న ఝాన్సీ రాణి అనే యువతి కలిసి తన గోడు వెళ్లబోసుకున్నారు.
AP CM YS Jagan meets PM Modi : ఢిల్లీ పర్యటనలో ఉన్న ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రధాని నరేంద్ర మోదీని కలిసి ఆయనతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పలు కీలక అంశాలు, రాష్ట్రాభివృద్ధి కోసం నిధులు కేటాయింపు అంశాలు ప్రధానంగా చర్చకొచ్చినట్టు తెలుస్తోంది.
Ex gratia of Rs 5 lakhs to families of deceased in AP floods: అమరావతి : వరదల్లో చనిపోయిన వారి కుటుంబాలకు తక్షణమే రూ.5 లక్షల పరిహారం అందించాలని ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ( AP CM YS Jagan ) అధికారులను ఆదేశించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో బాధిత కుటుంబాలకు (ముంపునకు గురైన ఇళ్లు) 25 కేజీల బియ్యం, ఒక కిలో కందిపప్పు, లీటరు పామాయిల్, కిలో ఉల్లిపాయలు, కిలో ఆలుగడ్డలు తప్పనిసరిగా పంపిణీ చేయాలన్నారు.
కేంద్ర మంత్రి రామ్ విలాస్ పాశ్వాన్ మృతి ( Ram vilas Paswan's death ) పట్ల ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పాశ్వాన్ కుటుంబసభ్యులకు తన ప్రగాడ సానుభూతి ప్రకటించిన సీఎం జగన్ ( AP CM YS Jagan ).. రామ్ విలాస్ పాశ్వాన్ మృతి దేశ రాజకీయాలకు తీరని లోటుగా మిగిలిపోతుందని ఆవేదన వ్యక్తంచేశారు.
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ( KCR ), ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిలపై ( YS Jagan ) కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి ( Revanth Reddy ) పలు సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం కేసీఆర్ తెలంగాణకు పట్టిన చీడ అని దుమ్మెత్తిపోసిన రేవంత్ రెడ్డి.. కేసీఆర్ నైజం ఏంటనేది క్రమక్రమంగా తెలంగాణ ప్రజలు గ్రహిస్తున్నారని అన్నారు.
ఏపీ సీఎం వైఎస్ జగన్ ( AP CM YS Jagan ) విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో జాతీయ జెండాను ఆవిష్కరించి 74వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను ( 74th Independence Day ) ప్రారంభించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు సీఎం జగన్ 74వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
రాఖీ పండుగ ( Rakhi festival) సందర్భంగా మహిళలు, చిన్నారులకు ఏపీ సర్కార్ ప్రత్యేక కానుక అందించింది. ఇప్పటికే మహిళలపై దాడులను అరికట్టడం కోసం దిశ చట్టం ( Disha act), కేసుల నమోదు కోసం ప్రత్యేకంగా యాప్, మహిళలకు సత్వర న్యాయం అందించడం కోసం ప్రత్యేక పోలీస్ స్టేషన్లను అందుబాటులోకి తీసుకొచ్చిన ఏపీ సర్కార్.. తాజాగా మరో కార్యక్రమాన్ని రూపొందించింది.
Vizag tragedy: విశాఖపట్నం: వైజాగ్ హిందుస్థాన్ షిప్ యార్డులో భారీ క్రేన్ కుప్పకూలి 10 మంది మృతి చెందిన దుర్ఘటనపై ముఖ్యమంత్రి వైయస్.జగన్మోహన్ రెడ్డి ( AP CM YS Jagan) స్పందించారు.
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్ ( Former cm ysr ) సతీమణి విజయమ్మ ( ys vijayamma ) రాసిన పుస్తకం ఇప్పుడు సంచలనమౌతోంది. నాలో..నాతో YSR పుస్తకం హాట్ కేకుల్లా అమ్ముడవుతోంది. ఆలోచనల ప్రవాహంగా..భావోద్వేగాల సమాహారంగా సాగిన ఆ పుస్తకం అప్పుడే రెండో ఎడిషన్ కు సిద్ధమవుతోంది.
Fathers day 2020: నేడు పితృ దినోత్సవం... ఫాదర్స్ డే సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ( AP CM YS Jagan) తన తండ్రి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డిని ( YSR) గుర్తు చేసుకున్నారు. తన తండ్రితో ఉన్న ఓ ఫోటోనూ ఈ సందర్భంగా ట్విట్టర్లో షేర్ చేశారు. ఫోటోతో పాటు చేసిన పోస్ట్ ఇప్పుడందర్నీ కదిలిస్తోంది. ఆకట్టుకుంటోంది.
AP SSC Exams 2020 | అమరావతి: ఆంధ్రప్రదేశ్లో పదో తరగతి పరీక్షలు రద్దు చేయాలని జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఓవైపు కరోనావైరస్ విజృంభిస్తున్న ప్రస్తుత తరుణంలో ప్రభుత్వం పరీక్షల నిర్వహించడానికి మొగ్గు చూపుతుండటం విద్యార్థుల తల్లిదండ్రులను ఆందోళనకు గురిచేస్తోందని ఆయన గుర్తుచేశారు.
ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పట్టిన కరోనా వైరస్ ( Coronavirus ) అని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే కొలుసు పార్థసారధి అన్నారు. ఏపీలో మద్యం ధరల పెంపుపై (Liquor price hike in AP) టీడీపీ చేస్తోన్న విమర్శలపై స్పందించే క్రమంలో పార్ధసారథి ( MLA Parthasarathy ) బుధవారం మీడియాతో మాట్లాడుతూ టీడీపీపై, ఆ పార్టీ నేతలపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
ఏపీలో శనివారం నాడు 24 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య మొత్తం 405కు చేరుకుంది. శుక్రవారం రాత్రి నుంచి శనివారం సాయంత్రం వరకు నమోదైన 24 కరోనా పాజిటివ్ కేసుల్లో అధిక భాగం గుంటూరు జిల్లాలోనే వెలుగుచూడటం గమనార్హం.
ఏపీలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల తీవ్రతలో కొంత మార్పు కనిపిస్తోంది. ఏపీలో బుధవారం 19 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా గురువారం 15 పాజిటివ్ కేసులు రావడం కొంత ఉపశమనాన్నిస్తోంది. మొదట్లో భారీగా నమోదైన పాజిటివ్ కేసులు గత రెండు రోజుల నుంచి స్వల్పంగా తగ్గుతుండటాన్ని పరిశీలిస్తే.. పరిస్థితిలో మార్పు కనిపిస్తున్నట్టే అనిపిస్తోంది అని సంబంధిత అధికారులు చెబుతున్నారు.
ఏపీలో జిల్లాల వారీగా బుధవారం వరకు నమోదైన కరోనా వైరస్ పాజిటివ్ కేసుల వివరాల విషయానికొస్తే... అనంతపురంలో -13, చిత్తూరులో 20, తూర్పు గోదావరి జిల్లాలో 11, గుంటూరు జిల్లాలో -49, కడప జిల్లో 28, కృష్ణా జిల్లాలో -35, కర్నూలు జిల్లాలో 75, నెల్లూరులో 48, ప్రకాశం జిల్లాలో 27, విశాఖపట్నంలో 20, పశ్చిమ గోదావరి -22 కేసులు నమోదు కాగా శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో ఇప్పటివరకు ఒక్క కేసు కూడా నమోదు కాకపోవడం విశేషం.
ఏపీలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల నమోదు విషయంలో గత రెండు, మూడు రోజుల నుండి ఉన్న పరిస్థితితో పోల్చుకుని చూస్తే.. ఏప్రిల్ 7న మంగళవారం నాటి పరిస్థితి కొంత అదుపులోకి వచ్చినట్టు కనిపించింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.