విజయవాడ: ఏపీ సీఎం వైఎస్ జగన్ ( AP CM YS Jagan ) విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో జాతీయ జెండాను ఆవిష్కరించి 74వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను ( 74th Independence Day ) ప్రారంభించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు సీఎం జగన్ 74వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. పరేడ్‌లో సాయుధ దళాల నుండి సీఎం జగన్ గౌరవ వందనం స్వీకరించిన అనంతరం ప్రత్యేకంగా అలంకరించిన వాహనంపై ప్రభుత్వ సంక్షేమ పథకాల శకటాలను సందర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల ప్రత్యేకతలను ప్రతిబింభించేలా ఏర్పాటు చేసిన శకటాలతో పాటు కరోనావైరస్ ( Coronavirus ) వ్యాపిస్తున్న ప్రస్తుత తరుణంలో వైద్య, ఆరోగ్య శాఖ సిబ్బంది అందించిన సేవలకు గుర్తింపుగా ఏర్పాటు చేసిన శకటాలు ఈ వేడుకల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా సీఎం వైఎస్ జగన్ మాట్లాడుతూ.. ''స్వాతంత్ర్య సమరయోధులకు పాదాభివందనాలు తెలియజేశారు. స్వాతంత్ర్యం ప్రాణవాయువు లాంటిదని గాంధీజీ చెప్పిన మాటలను సీఎం జగన్ గుర్తుచేశారు. Also read: Aatmanirbhar Bharat: ఆత్మనిర్భర్ భారత్ ప్రయోజనాలపై ప్రధాని మోదీ కీలక ప్రసంగం
CM YS Jagan speech highlights సీఎం జగన్ ప్రసంగంలోని ముఖ్యాంశాలు :
74th Independence Day: ఏపీ సీఎం వైఎస్ జగన్ ప్రసంగం హైలైట్స్
విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో జాతీయ జెండాను ఆవిష్కరించిన ఏపీ సీఎం వైఎస్ జగన్ ( AP CM YS Jagan ).
రాష్ట్ర ప్రజలకు సీఎం జగన్ 74వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన సీఎం వైఎస్ జగన్.
సాయుధ దళాల నుండి గౌరవ వందనం స్వీకరించిన సీఎం జగన్
అనంతరం ఏర్పాటు చేసిన సభలో రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ పలు కీలక వ్యాఖ్యలు.
ఆర్ధిక పరిస్థితులు సహకరించకున్నా సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి అమలు చేయడంలో రాజీపడటం లేదని స్పష్టంచేసిన సీఎం జగన్