AP CM YS Jagan: వరద బాధితులకు ప్రభుత్వ సాయంపై సీఎం జగన్ కీలక నిర్ణయాలు

Ex gratia of Rs 5 lakhs to families of deceased in AP floods: అమరావతి : వరదల్లో చనిపోయిన వారి కుటుంబాలకు తక్షణమే రూ.5 లక్షల పరిహారం అందించాలని ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ( AP CM YS Jagan ) అధికారులను ఆదేశించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో బాధిత కుటుంబాలకు (ముంపునకు గురైన ఇళ్లు) 25 కేజీల బియ్యం, ఒక కిలో కందిపప్పు, లీటరు పామాయిల్, కిలో ఉల్లిపాయలు, కిలో ఆలుగడ్డలు తప్పనిసరిగా పంపిణీ చేయాలన్నారు.

Last Updated : Oct 20, 2020, 08:33 PM IST
AP CM YS Jagan: వరద బాధితులకు ప్రభుత్వ సాయంపై సీఎం జగన్ కీలక నిర్ణయాలు

Ex gratia of Rs 5 lakhs to families of deceased in AP floods: అమరావతి : వరదల్లో చనిపోయిన వారి కుటుంబాలకు తక్షణమే రూ.5 లక్షల పరిహారం అందించాలని ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ( AP CM YS Jaganmohan Reddy ) అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో భారీ వర్షాలు, వరదలు,  ( Heavy rains, floods ) సహాయ పునరావాస కార్యక్రమాలు, నష్టంపై అంచనాలు, కోవిడ్‌–19 నివారణ చర్యలు, సీజనల్‌ అంటువ్యాధుల నివారణ, ఉపాధి హామీ పనులు, లేబర్‌ బడ్జెట్, గ్రామ సచివాలయాల భవనాలు, ఆర్బీకేల నిర్మాణం, డాక్టర్‌ వైయస్సార్‌ హెల్త్‌ క్లినిక్‌ల నిర్మాణం, నాడు–నేడు, పాఠశాలలు, అంగన్‌వాడీలు, ఆస్పత్రులు, గ్రామ, వార్డు సచివాలయాలు, అధికారుల తనిఖీలు జగనన్న తోడు పథకం, వైయస్సార్‌ బీమా నమోదు వంటి అనేక అంశాలపై మంగళవారం జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, వివిధ శాఖల ఉన్నతాధికారులతో క్యాంప్ కార్యాలయం నుంచే సీఎం వైఎస్ జగన్ సమీక్ష సమావేశం నిర్వహించారు. Also read : AP: నవంబర్ 2 నుంచే స్కూళ్ల ప్రారంభం..ఏ రోజు ఏ తరగతులంటే..

Points to know from CM YS Jagan review meeting: సీఎం జగన్ సమీక్షలో ప్రస్తావించిన పలు ముఖ్యాంశాలు:
Ration kit for flood victims: వరద బాధితులను ఆదుకునే విషయంలో మానవతా దృక్పథంతో వ్యవహరించాలని సీఎం జగన్ అన్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో బాధిత కుటుంబాలకు (ముంపునకు గురైన ఇళ్లు) 25 కేజీల బియ్యం, ఒక కిలో కందిపప్పు, లీటరు పామాయిల్, కిలో ఉల్లిపాయలు, కిలో ఆలుగడ్డలు తప్పనిసరిగా పంపిణీ చేయాలన్నారు. 

సహాయ శిబిరాల్లో తలదాచుకుంటున్న వారిని తిరిగి వెనక్కి పంపించేటప్పుడు రూ.500 ఆర్థిక సహాయం అందించండి. వారు ఇంటికి వెళ్లగానే ఆ కుటుంబానికి ఆ మొత్తం ఏదో ఒక రూపంలో ఉపయోగపడుతుంది. 

ఏపీలో ఇప్పటివరకు వరదల బారినపడి 19 మంది చనిపోగా, 14 మందికి నష్టపరిహారం అందించారు. మరో ఐదుగురికి నష్టపరిహారం అందించాల్సి ఉంది. ఆ కుటుంబాలకు కూడా వెంటనే పరిహారం అందజేయాల్సిందిగా అధికారులకు ముఖ్యమంత్రి ఆదేశం. Also read : Heavy Rains: బంగాళాఖాతంలో అల్పపీడనం.. మరో 3 రోజులపాటు భారీ వర్షాలు

COVID-19 review; కోవిడ్‌–19: 

రాష్ట్రంలో రోజూ దాదాపు 70 వేల పరీక్షలు జరుగుతున్నాయి. మరోవైపు కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య కూడా గణనీయంగా తగ్గింది. 19వ తేదీ పాజిటివిటీ రేటు 4.76 శాతంగా మాత్రమే ఉంది. ప్రతి 10 లక్షల మందిలో 1,33,474 మందికి వైద్య పరీక్షలు ( COVID-19-tests ) చేస్తూ, దేశంలోనే అగ్ర స్థానంలో ఉన్నాం. రికవరీ రేటు విషయంలోనూ 94.5 శాతంతో మన రాష్ట్రమే తొలి స్థానంలో ఉంది అని ముఖ్యమంత్రి తెలిపారు.

Post-COVID-19 symptoms in COVID-19 patients; కరోనా సోకి తగ్గిన వారు మరో 6-8 వారాలపాటు జాగ్రత్త తప్పనిసరి:
కోవిడ్‌-19 వచ్చి తగ్గిన తర్వాత కూడా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని సీఎం వైఎస్ జగన్ స్పష్టం చేశారు. దేశానికి సంబంధించిన సర్వే చూస్తే, కోవిడ్‌ వచ్చి తగ్గిన తర్వాత కూడా 10 శాతం కేసుల్లో కొత్త అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. కొంతమందికి ఊపిరితిత్తుల్లో ఇబ్బందులు, కిడ్నీ, బ్రెయిన్, ఇంకొంతమందికి చెవుడు వంటి సమస్యలు వస్తున్నాయి. అందుకే కరోనా సోకిన వారికి తగు జాగ్రత్తలు తీసుకునే విషయంలో అధికారులే వారికి 

అవగాహన కల్పించాలి. కోవిడ్‌ తగ్గిన తర్వాత కూడా కనీసం 6 వారాల నుంచి 8 వారాల పాటు కరోనా రోగులు జాగ్రత్త పడాలన్న దానిపై ప్రజలకు అవగాహన కల్పించాలి. Also read : AP: వరద ప్రభావిత ప్రాంతాల్లో వైఎస్ జగన్ ఏరియల్ సర్వే

WATCH VIDEO: Post-COVID-19 issues: కొవిడ్-19 తగ్గిన వారిలో ఈ సమస్యలు: ఏపీ సీఎం వైఎస్ జగన్

Aarogyasri scheme; ఆరోగ్యశ్రీ పరిధిలోకి: 

కోవిడ్‌ వచ్చి తగ్గిన తర్వాత తలెత్తుతున్న అనారోగ్య సమస్యలు, జబ్బులను ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకురావాల్సిందిగా ఇప్పటికే వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శికి ఆదేశాలు జారీ చేశాము. ఆ ఆదేశాలు వెలువడితే కరోనా వచ్చి తగ్గిన వారు ఏమైనా ఆరోగ్య సమస్యలు ఉంటే ఆరోగ్యశ్రీ సేవలు అందించే ఆస్పత్రులకు వెళ్లి చికిత్స పొందవచ్చు. 

Crop compensation to farmers; రైతులకు పంట నష్టం: 
భారీ వర్షాలు, వరదల కారణంగా జరిగిన పంట నష్టాలపై వెంటనే నివేదికలు, అంచనాలు రూపొందించాలి. ఈ నెల 31వ తేదీలోగా కలెక్టర్లు నివేదికలు పంపాలి. వరద నష్టం అంచనాలతో పాటు, కావాల్సిన బడ్జెట్‌ ప్రతిపాదనలు కూడా ఈనెల 31లోగా పంపాలని సీఎం జగన్ జిల్లాల కలెక్టర్లు, జేసీలకు సూచించారు. ఈ మొత్తం ప్రక్రియలో అధికారులు పూర్తి పారదర్శకత పాటిస్తూ లబ్ధిదారుల పేర్లు ఆర్బీకేలలో ప్రదర్శించాలని తెలిపారు. రైతులు ఎవరైనా తమ పేర్లు అర్హుల జాబితాలో లేవని చెబితే సోషల్‌ ఆడిట్‌ చేయాలని అన్నారు. Also read : 
APPSC JL Results 2020: జేఎల్ ఫలితాలు విడుదల చేసిన ఏపీపీఎస్సీ

రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా ఒక సీజన్‌ ఇన్‌పుట్‌ సబ్సిడీని అదే సీజన్‌లో అందిస్తున్నాం. ఈ ఏడాది ఖరీఫ్‌ ఇన్‌పుట్‌ సబ్సిడీని వైయస్సార్‌ రైతు భరోసా రెండో  విడత చెల్లింపులతో పాటు ఇవ్వబోతున్నాం. జూన్, జూలై, ఆగస్టుతో పాటు, సెప్టెంబరు నెల ఇన్‌పుట్‌ సబ్సిడీని ఈనెల 27న ఇస్తున్నాం. ఖరీఫ్‌ పంటలకు సంబంధించి రూ.113 కోట్లు, ఉద్యాన పంటలకు సంబంధించి మరో రూ.32 కోట్లు. మొత్తం రూ.145 కోట్ల ఇన్‌పుట్‌ సబ్సిడీని రైతులకు చెల్లించబోతున్నాం.
అక్టోబరు నెలకు సంబంధించిన ఇన్‌పుట్‌ సబ్సిడీపై నవంబరు 15లోగా నివేదిక ఇవ్వాలని సీఎం జగన్ అధికారులకు స్పష్టంచేశారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

Trending News