Coronavirus updates: ఏపీలో కరోనావైరస్ పాజిటివ్ కేసుల సమాచారం

ఏపీలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల నమోదు విషయంలో గత రెండు, మూడు రోజుల నుండి ఉన్న పరిస్థితితో పోల్చుకుని చూస్తే.. ఏప్రిల్ 7న మంగళవారం నాటి  పరిస్థితి కొంత అదుపులోకి వచ్చినట్టు కనిపించింది.

Last Updated : Apr 8, 2020, 02:22 AM IST
Coronavirus updates: ఏపీలో కరోనావైరస్ పాజిటివ్ కేసుల సమాచారం

అమరావతి: ఏపీలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల నమోదు విషయంలో గత రెండు, మూడు రోజుల నుండి ఉన్న పరిస్థితితో పోల్చుకుని చూస్తే.. ఏప్రిల్ 7న మంగళవారం నాటి  పరిస్థితి కొంత అదుపులోకి వచ్చినట్టు కనిపించింది. అంతకు ముందు కోవిడ్ కేసుల వ్యాప్తి వేగంగా కనిపించగా.. మంగళవారం ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు జరిగిన కోవిడ్ పరీక్షల ఆధారంగా రూపొందించిన నివేదిక ప్రకారం గుంటూరు జిల్లాలో 8 పాజిటివ్ కేసులు, కడప, నెల్లూరు జిల్లాల్లో ఒక్కో కేసు నమోదయ్యాయి. తాజాగా నమోదైన 10 కేసులు కలిపి రాష్ట్రంలో మొత్తం కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 314 కు పెరిగింది.

Also read : ఏపీలో మరో కరోనా మరణం.. 300 దాటిన కేసులు

ఇక జిల్లాల వారీగా చూసుకుంటే ఏపీలో నమోదైన కరోనా పాజిటివ్ కేసుల వివరాలిలా ఉన్నాయి.

క్ర. సంఖ్య  జిల్లాల పేర్లు కరోనా పాజిటివ్ కేసులు వ్యాధి నయమై డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య
1 అనంతపురం  6  
2 చిత్తూరు               17  
3 తూర్పు గోదావరి                11                            1
4 గుంటూరు               41  
5 కడప               28  
6 కృష్ణా               29                            2
7 కర్నూలు               74  
8 నెల్లూరు               43                             1
9 ప్రకాశం                24                              1
10 శ్రీకాకుళం                 0  
11 విశాఖపట్నం               20                             1
12 విజయనగరం                 0  
13 పశ్చిమ గోదావరి                21  
                  314                             6

  జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here.. 

 

Trending News