Coronavirus in AP: ఏపీలో కరోనా పాజిటివ్ కేసులు లేటెస్ట్ అప్‌డేట్

ఏపీలో జిల్లాల వారీగా బుధవారం వరకు నమోదైన కరోనా వైరస్ పాజిటివ్ కేసుల వివరాల విషయానికొస్తే... అనంతపురంలో -13, చిత్తూరులో 20, తూర్పు గోదావరి జిల్లాలో 11, గుంటూరు జిల్లాలో -49, కడప జిల్లో 28, కృష్ణా జిల్లాలో -35, కర్నూలు జిల్లాలో 75, నెల్లూరులో 48, ప్రకాశం జిల్లాలో 27, విశాఖపట్నంలో 20, పశ్చిమ గోదావరి -22 కేసులు నమోదు కాగా శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో ఇప్పటివరకు ఒక్క కేసు కూడా నమోదు కాకపోవడం విశేషం.

Last Updated : Apr 9, 2020, 01:36 AM IST
Coronavirus in AP: ఏపీలో కరోనా పాజిటివ్ కేసులు లేటెస్ట్ అప్‌డేట్

అమరావతి : ఏపీలో ఏప్రిల్ 8న బుధవారం కొత్తగా 19 కరోనావైరస్ పాజిటివ్‌ కేసులను గుర్తించినట్టు ఏపీ సర్కార్ ప్రకటించింది. ఈ 19 కేసులతో కలిపి ఏపీలో కరోనా వైరస్ సోకినవారి మొత్తం సంఖ్య 348కి చేరింది. బుధవారం ముగ్గురు కరోనా సోకి, వ్యాధి నయమైన వ్యక్తులు డిశ్చార్జ్‌ అయ్యారని.. దీంతో ఏపీలో ఇప్పటివరకు డిశ్చార్జ్‌ అయినవారి సంఖ్య మొత్తం 9కి చేరింది. ఈ మేరకు బుధవారం రాత్రి తాజా హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేసిన వైద్య, ఆరోగ్య శాఖ... అందులో ఈ వివరాలను వెల్లడించింది. బుధవారం ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు అనుమానితులకు కరోనావైరస్ నిర్ధారణ పరీక్షలు జరపగా.. గుంటూరులో 8, అనంతపురంలో 7, ప్రకాశంలో 3, పశ్చిమ గోదావ జిల్లాలో ఒక కేసు నమోదైనట్టు వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్ స్పష్టంచేసింది. 

Also read : PM Modi about lockdown: లాక్ డౌన్ ఎత్తివేయడంపై ప్రధాని కీలక వ్యాఖ్యలు

ఏపీలో జిల్లాల వారీగా బుధవారం వరకు నమోదైన కరోనా వైరస్ పాజిటివ్ కేసుల వివరాల విషయానికొస్తే... అనంతపురంలో -13, చిత్తూరులో 20, తూర్పు గోదావరి జిల్లాలో 11, గుంటూరు జిల్లాలో -49, కడప జిల్లో 28, కృష్ణా జిల్లాలో -35, కర్నూలు జిల్లాలో 75, నెల్లూరులో 48, ప్రకాశం జిల్లాలో 27, విశాఖపట్నంలో 20, పశ్చిమ గోదావరి -22 కేసులు నమోదు కాగా శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో ఇప్పటివరకు ఒక్క కేసు కూడా నమోదు కాకపోవడం విశేషం. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here.. 

Trending News