క్రికెట్ అభిమానులు త్వరలో చేదువార్త వినబోతున్నారా.. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) ఈ ఏడాది నిరవధిక వాయిదా పడింది. కరోనా మహమ్మారి ట్వంటీ20 లీగ్ ఆశల్ని నాశనం చేసిందా అంటే.. సమాధానం అవుననే వినిపిస్తోంది. భారత్‌లో లాక్‌డౌన్ గడువును మే3కి పొడిగించడం తెలిసిందే. దీంతో ఏప్రిల్ 15న ప్రారంభం కావాల్సిన ఐపీఎల్ మరోసారి వాయిదా వేసినట్లు బీసీసీఐ ప్రకటించింది. మే 3 లోగా ఏదైనా నిర్ణయం తీసుకుంటామని బోర్డుకు చెందిన ఓ అధికారి చెప్పినట్లు సమాచారం.
తాజాగా మరో వాదన తెరమీదకి వచ్చింది. కరోనా కారణంగా నిర్వహణ సాధ్యం కాదని లీగ్‌ను రద్దు చేయాలని బీసీసీఐ యోచిస్తుందని ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతానికి నిరవధికంగా వాయిదా వేశామని, పరిస్థితులు అనుకూలించకపోతే లీగ్‌ను రద్దు చేయనున్నట్లు ఐపీఎల్ ఫ్రాంచైజీలకు సైతం తెలిపిందని పీటీఐ కథనం చెబుతోంది. పీటీఓ రిపోర్టు ప్రకారం.. ఇప్పటివరకూ ఐపీఎల్ వాయిదా అనే దిశగానే ఆలోచించిన బీసీసీఐ తాజాగా లాక్‌డౌన్ పొడిగింపు తర్వాత రద్దు అంశంపై చర్చించినట్లు సమాచారం. లాక్‌డౌన్ మార్గదర్శకాల పూర్తి జాబితా.. మందుబాబులకు మళ్లీ నిరాశే
పరిస్థితులు ప్రతికూలమైన నేపథ్యంలోనే తాము ఈ నిర్ణయం తీసుకున్నామని ఫ్రాంచైజీలకు సమాచారం అందించిందని కథనాలు వస్తున్నాయి. అయితే రద్దు విషయమై చర్చించారా లేదా అనేదానిపై అధికారికంగా బీసీసీఐ గానీ, లేక ఐపీఎల్ మేనేజ్‌మెంట్ స్పందించాల్సి ఉంది. ఫ్రాంచైజీలు మాత్రం ఇంకా ఐపీఎల్ జరుగుతుందనే నమ్మకంతో ఉన్నట్లు కనిపిస్తున్నాయి. ఐటమ్ గాళ్ నటాషా లేటెస్ట్ ఫొటోలు
ప్రేక్షకులు లేకుండా ఖాళీ మైదానాల్లో ఐపీఎల్ నిర్వహించడం సరైన నిర్ణయం కాదని బీసీసీఐ పెద్దలు చెబుతున్నారు. దేశంలో లాక్‌డౌన్‌తో స్థానికంగా రైళ్లు, విమానాలు రద్దు, విదేశాల నుంచి ఎవ్వరినీ అనుమించరు. దాంతో విదేశీ క్రికెటర్లు భారత్‌కు వచ్చే అవకాశాలు దాదాపు కనిపించడం లేదు. ఒకవేళ ఇది మొత్తం కొలిక్కి వచ్చినా ఆ వెంటనే ట్వంటీ20 వరల్డ్ కప్ నిర్వహణపై ప్రభావం చూపుతుంది. పొట్టి ప్రపంచ కప్ వాయిదా వేస్తేనే ఐపీఎల్ నిర్వహణ సాధ్యమవుతుంది. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..
ప్రపంచంలోనే హాట్ మోడల్ Bikini Photos
IPL నిరవధిక వాయిదా!