మత వివక్ష చూపలేదు..!!

గుజరాత్ లో కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తోంది. ఈ క్రమంలో రాష్ట్రంలోని పలు ఆస్పత్రుల్లో కరోనా పాజిటివ్ రోగులకు చికిత్స అందిస్తున్నారు. ఐతే సోషల్ మీడియాలో ఓ వార్త విపరీతంగా వైరల్ అవుతోంది. 

Last Updated : Apr 15, 2020, 04:17 PM IST
మత వివక్ష చూపలేదు..!!

గుజరాత్ లో కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తోంది. ఈ క్రమంలో రాష్ట్రంలోని పలు ఆస్పత్రుల్లో కరోనా పాజిటివ్ రోగులకు చికిత్స అందిస్తున్నారు. ఐతే సోషల్ మీడియాలో ఓ వార్త విపరీతంగా వైరల్ అవుతోంది. 

గుజరాత్ లోని అహ్మదాబాద్  ప్రభుత్వ ఆస్పత్రిలో రోగులపై వైద్యులు మతపరమైన  వివక్ష చూపిస్తున్నారనే వార్త దావనంలా వ్యాపిస్తోంది. ఓ మతానికి చెందిన వారికి ప్రత్యేక వార్డులు కేటాయించి.. మరో మతానికి చెందిన వారిపై వివక్ష  చూపిస్తున్నారనే వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. 

ఐతే ఈ వార్తపై గుజరాత్ ప్రభుత్వం స్పందించింది. తాము మతపరంగా వివక్ష చూపించడం  లేదని స్పష్టం చేసింది. మీడియాలో వస్తున్న వార్తలను తీవ్రంగా ఖండిస్తున్నామని పేర్కొంది. ఆ వార్తలన్నీ నిరాధారమని గుజరాత్ వైద్య ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది. అంతే కాదు కొందరు రోగులకు ప్రత్యేక వార్డులు కేటాయించడంపైనా క్లారిటీ ఇచ్చింది. రోగుల ఆరోగ్య పరిస్థితి ఆధారంగా వైద్యులు ఈ నిర్ణయం తీసుకుంటారని తెలిపింది. ఇది అన్ని ప్రాంతాల్లో జరిగేదేనని వివరించింది. రోగి లక్షణాలు, వయసు, ఆరోగ్య  పరిస్థితి దృష్ట్యా వైద్యుల సలహా మేరకు మాత్రమే ప్రత్యేక వార్డులు కేటాయించడం జరుగుతుందని వెల్లడించింది. కానీ మత ప్రాతిపదికన ప్రత్యేక వార్డులు  కేటాయిస్తున్నారనే వార్తలు నిరాధారమని కొట్టిపారేసింది.  

గుజరాత్ లో ప్రస్తుతం కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తోంది. ఇప్పటికే పాజిటివ్ కేసుల సంఖ్య 695కు చేరుకుంది. అహ్మదాబాద్ లోనే అత్యధిక కేసులు నమోదయ్యాయి. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..  

Trending News