'కిల్' వైరస్ అంటూ సైకిల్‌పై ప్రచారం

'కరోనా వైరస్'.. వేగంగా విస్తరిస్తూ ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లోనూ వైరస్ వ్యాప్తి వేగంగా జరుగుతోంది. నిన్న ఒక్కరోజే తెలంగాణలో 52 కొత్త పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో తెలంగాణలో పాజిటివ్ కేసుల సంఖ్య మొత్తంగా 644కు చేరింది. అటు ఆంధ్రప్రదేశ్‌‌లోనూ మొత్తం కేసుల సంఖ్య 473గా ఉంది. ఈ క్రమంలో తెలుగు రాష్ట్రాల్లో ప్రజలు భయాందోళన చెందుతున్నారు.

Last Updated : Apr 15, 2020, 10:38 AM IST
'కిల్' వైరస్ అంటూ సైకిల్‌పై ప్రచారం

'కరోనా వైరస్'.. వేగంగా విస్తరిస్తూ ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లోనూ వైరస్ వ్యాప్తి వేగంగా జరుగుతోంది. నిన్న ఒక్కరోజే తెలంగాణలో 52 కొత్త పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో తెలంగాణలో పాజిటివ్ కేసుల సంఖ్య మొత్తంగా 644కు చేరింది. అటు ఆంధ్రప్రదేశ్‌‌లోనూ మొత్తం కేసుల సంఖ్య 473గా ఉంది. ఈ క్రమంలో తెలుగు రాష్ట్రాల్లో ప్రజలు భయాందోళన చెందుతున్నారు. 

కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు తెలుగు రాష్ట్రాల్లో లాక్ డౌన్ పకడ్బందీగా అమలు జరుగుతోంది. జనం ఇళ్ల నుంచి బయటకు రాకుండా ఇంట్లోనే ఉంటున్నారు. రాజకీయ, సినీ ప్రముఖులు కూడా ఇళ్లకే పరిమితం కావాలని ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. ఎవరికి తోచిన విధంగా వారు స్టే ఎట్ హోమ్ గురించి ప్రచారం చేస్తున్నారు. దీనిలో ఓ సామాన్యుడు కూడా రంగంలోకి దిగాడు. 

హైదరాబాద్‌లో నివసిస్తున్న దినేష్ గుప్తా అనే వ్యక్తి.. సైకిల్‌పై తిరుగుతూ ప్రచారం చేస్తున్నాడు. అతని వయసు 47 ఏళ్లు.. అయినా ఇంట్లో కూర్చోకుండా.. కరోనా మహమ్మారిని పారదోలే క్రమంలో తాను సైతం అంటూ రోడ్డుపైకి ఎక్కాడు. రోజుకు సిటీలో దాదాపు 30 కిలోమీటర్లు సైకిల్ తొక్కుతూ .. ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావద్దు.. అంటూ ప్రచారం చేస్తున్నాడు. చేతులు శుభ్రంగా  కడుక్కోవాలని సూచిస్తున్నాడు. ప్రభుత్వం చెప్పిన విధంగా సామాజిక దూరం పాటించాలని కోరుతున్నాడు. 

కరోనా మహమ్మారిని గట్టిగా ఎదుర్కునేందుకు వైద్యులకు, పారామెడికల్ సిబ్బంది, పారిశుద్ధ్య సిబ్బందికి సహకరించాలని కోరుతున్నాడు దినేష్ గుప్తా. ఇళ్లల్లో ఉన్న వారికి ఒకవేళ కరోనా వైరస్‌ కు సంబంధించిన ఎలాంటి  లక్షణాలు  కనిపించినా వైద్యులను సంప్రదించాలని ప్రచారం చేస్తున్నాడు. ఓ వైపు వైరస్ వేగంగా విస్తరిస్తున్నా .. ఆయన నిబ్బరంగా సైకిల్‌పై ప్రచారం నిర్వహించడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. దినేష్ గుప్తాపై అంతా ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఆయన ధైర్యానికి మెచ్చుకుంటున్నారు.జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here.. 

Trending News