రెండో దశలో 'కరోనా వైరస్'.. వేగంగా వ్యాప్తి చెందుతోంది. ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలను గడగడా వణికిస్తున్న మహమ్మారి వైరస్
కారణంగా పాజిటివ్ కేసులు 20 లక్షలు దాటిపోయాయి.
తొలి 10 లక్షల కేసులు నమోదు కావడానికి 90 రోజులు అంటే మూడు నెలలు పట్టింది. కానీ నానాటికీ వైరస్ మరింత మహమ్మారిగా తయారైంది. ఈ కారణంగా రెండో 10 లక్షల కేసులు నమోదు కావడానికి కేవలం 13 రోజులే పట్టింది. అంటే వైరస్ ఎంత దారుణంగా వ్యాప్తి చెందుతుందో అర్ధం చేసుకోవచ్చు. చైనాలోని వుహాన్ లో ప్రారంభమైన కరోనా వైరస్.. క్రమక్రమంగా అన్ని దేశాలకు విస్తరించింది. దాదాపు 200 దేశాలు ఈ మహమ్మారి బారిన పడ్డాయి.
అన్ని దేశాల కంటే ఎక్కువగా కరోనా బారిన పడ్డ దేశ అమెరికా. జాన్ హాప్కిన్స్ యూనివర్శిటీ గణాంకాల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా బుధవారం వరకు 20 లక్షల 16 వేల 20 కేసులు నమోదయ్యాయి. అందులో లక్షా 30 వేల 528 మంది చనిపోయారు. అమెరికాలో 6 లక్షల 13 వేల 187 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు అగ్రరాజ్యం అమెరికాలో 26 వేల 950 మంది చనిపోయారు. నిన్న ఒక్క రోజే 2 వేల 600 మంది మృతి చెందారు.
అటు స్పెయిన్ రెండో స్థానంలో నిలిచింది. ఆ దేశంలో లక్షా 77 వేల 633 మంది కరోనా బారిన పడ్డారు. మూడో స్థానంలో నిలిచిన ఇటలీలో లక్షా 65 వేల 155 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇటలీలో నిన్న ఒక్క రోజే 578 మంది మృతి చెందారు. అంతకు ముందు రోజు మృతుల సంఖ్య 602గా ఉంది. మార్చి 13 నుంచి ఇప్పటి వరకు కొత్త కేసులు తగ్గినప్పటికీ మృతుల సంఖ్య పెరగడం ఆ దేశంలో గుబులు పుట్టిస్తోంది. మొత్తంగా ఇటలీలో ఇప్పటి వరకు 21 వేల 645 మంది మృతి చెందారు.
మరోవైపు జర్మనీలో లక్షా 33 వేల 154 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనా వైరస్ పాజిటివ్ కేసుల్లో ఈ దేశం నాలుగో స్థానంలో నిలిచింది. ఇప్పటికే కరోనా వైరస్ దెబ్బకు ప్రపంచ ఆర్ధిక వ్యవస్థ కుదేలైంది. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..