#APCoronaVirusUpdates: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు గత రెండు వారాలుగా భారీ సంఖ్యలో నమోదవుతున్నాయి. ఏప్రిల్ 15న ఏకంగా 5 కరోనా మరణాలు నమోదు కావడం కలవరపెడుతోంది. బుధవారం సాయంత్రం 7 నుంచి ఈరోజు ఉదయం 9 వరకు జరిగిన కోవిడ్19 పరీక్షల్లో తొమ్మిది మంది పాజిటివ్‌గా తేలింది. ప్రస్తుతం 500 మంది ఆసుపత్రుల్లో కరోనాకు చికిత్స పొందుతున్నారు. షాకింగ్: ఏపీలో హాట్‌స్పాట్ కేంద్రాలుగా 11 జిల్లాలు
కొత్తగా నమోదైన 9 కేసుల తో కలిపి రాష్ట్రంలో మొత్తం కోవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య 534కి పెరిగింది. కృష్ణాలో 3, కర్నూల్‌లో 3, పశ్చిమ గోదావరిలో 3 కేసులు తాజాగా నమోదయ్యాయి. రాష్ట్రంలో కరోనా బారిన పడి ఇప్పటివరకూ 14 మంది మృతి చెందారు. ఏపీలో నమోదైన మొత్తం 534 పాజిటివ్ కేసులకుగాను చికిత్స అనంతరం 20 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. 500 మంది కరోనాతో పోరాడుతున్నారు. లాక్‌డౌన్ మార్గదర్శకాల పూర్తి జాబితా.. మందుబాబులకు మళ్లీ నిరాశే
కాగా, జిల్లాలవారీగా చూస్తే.. గుంటూరులో అత్యధికంగా 122, కర్నూలులో 113 కరోనా పాటిటివ్ కేసులు నమోదయ్యాయి. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలో ఇప్పటివరకూ ఒక్క కరోనా పాజిటివ్ కేసు కూడా నమోదు కాకపోవడం గమనార్హం. అందుకే మిగతా 11 జిల్లాలను హాట్ స్పాట్, రెడ్ జోన్ ప్రాంతాలుగా కేంద్ర వైద్యశాఖ ప్రకటించింది. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..
బ్రేకింగ్: ఏపీలో మరో 9 కరోనా కేసులు..