భారత్‌లో కరోనా వైరస్ క్రమక్రమంగా విస్తరిస్తోంది. వేగంగా పాజిటివ్ కేసులు నమోదు కావడం అంతటా గుబులు పుట్టిస్తోంది. ఇప్పటి వరకు మొత్తంగా 12 వేల 380 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇందులో 10వేల 477 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి.
ఇప్పటి వరకు 14 వందల 88 మంది 'కరోనా వైరస్'కు చికిత్స తీసుకుని నయం చేసుకుని ఇంటికి వెళ్లారు. ఐతే కరోనా బారిన పడి మొత్తంగా ఇప్పటి వరకు 414 మృతి చెందారు.
దేశ రాజధాని ఢిల్లీలో కరోనా కల్లోలం ఆగడం లేదు. దక్షిణ ఢిల్లీలో 70 మందిని క్వారంటైన్‌కు తరలించారు. పిజ్జా డెలివరీ బాయ్‌కి కరోనా వైరస్ పరీక్షలు చేయగా అతనికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో అతనితో కాంటాక్టులో ఉన్న 70 మందిని వివిధ క్వారంటైన్లకు తరలించారు. వారిలో వైరస్ లక్షణాలు ఉన్న వారికి పరీక్షలు నిర్వహించనున్నారు.
మరోవైపు ఢిల్లీలోని చాందినీ మహల్ పోలీస్ స్టేషన్‌లో ఇద్దరు కానిస్టేబుళ్లకు కరోనా పాజిటివ్ లక్షణాలు కనిపించాయి. వారిద్దరినీ ఆస్పత్రికి తరలించారు. కరోనా వైరస్ కారణంగా లాక్ డౌన్ విధించడంతో వారు రోడ్లపై పికెట్ డ్యూటీ చేస్తున్నారు. చాందినీ మహల్ ప్రాంతంలో 52 మందికి కరోనా వైరస్ పాజిటివ్ లక్షణాలు ఉన్నాయి. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..