UP Car Accident: 5 dead and Several injured in Uttar Pradesh Car Accident. ఉత్తరప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రయాగ్‌రాజ్‌లోని హండియా ప్రాంతంలో హైవేపై కారు విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టింది.
ఉత్తరప్రదేశ్ హత్రాస్ (Hathras) లో జరిగిన దారుణ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అయితే ఈ కేసును యూపీ ప్రభుత్వం.. ఇప్పటికే సిట్ (SIT) కు అప్పగించగా.. ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వ (Central Govt) ఆదేశాలతో ఈ సంఘటనపై కేసు నమోదుచేసిన సీబీఐ (CBI) ముమ్మరంగా దర్యాప్తు చేస్తోంది. ఈ క్రమంలో బుధవారం ఈ సంఘటనపై సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు విచారణ, బాధితురాలి కుటుంబసభ్యులు, సాక్షుల రక్షణపై సర్వోన్నత న్యాయస్థానంలో అఫిడవిట్‌ను సమర్పించింది.
ఉత్తరప్రదేశ్ హత్రాస్ (Harthras) లో జరిగిన దారుణ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అయితే ఈ కేసును యూపీ ప్రభుత్వం.. ఇప్పటికే సిట్ (SIT) కు అప్పగించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో యూపీ ప్రభుత్వం (UP Govt) సిఫారసు మేరకు శనివారం కేంద్ర ప్రభుత్వం (Central Govt).. ఈ కేసు దర్యాప్తును సీబీఐ (CBI) కు అప్పగించింది.
సమాజ్ వాదీ పార్టీ సీనియర్ నేత ములాయం సింగ్ యాదవ్ ( Mulayam Singh Yadav Death) కన్నుమూశారు. గత కొంతకాలం నుంచి అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్న ఆయన శనివారం రాత్రి తుదిశ్వాస విడిచారని సన్నిహితులు తెలిపారు.
మోస్ట్ వాంటెడ్ క్రిమినల్, గ్యాంగ్ స్టర్ వికాస్ దూబే అరెస్టయ్యాడు. కాన్పూర్‌లో జరిగిన ఎన్కౌంటర్ కేసు(KanpurEncounter case)లో 8 మంది పోలీసులను దారుణంగా హత్య చేసిన కేసులో ప్రధాన నిందితుడు వికాస్ దూబేను మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయనిలో పోలీసులు అరెస్ట్ చేశారు.
Kanpur Encounter Case | కాన్పూర్ ఎన్కౌంటర్ కేసులో ఇద్దరు నిందితులు రెండు వేర్వేరు ఘటనల్లో హతమయ్యారు. పోలీసు కస్టడీ నుంచి తప్పించుకునేందుకు ఓ నిందితుడు హతమయ్యాడు. మరో నిందితుడు బహువా దుబేను ఛేజ్ చేయగా పోలీసులపై కాల్పులు జరిపాడు. వెంటనే ఎదురుకాల్పులు చేసి నిందితుడిని పోలీసులు ఎన్ కౌంటర్ చేశారు.
విచక్షణారహితంగా కాల్పులు జరిపి 8 మంది పోలీసులను పొట్టన పెట్టుకున్న కాన్పూర్ ఎన్కౌంటర్ కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. వికాస్ దుబే అనుచరుడు, సన్నిహితుడు అమర్ దుబే (Amar Dubey killed in an encounter) పోలీసుల ఎన్కౌంటర్లో హతమయ్యాడు.
ఫ్యాక్టరీలో సంభవించిన భారీ పేలుడు కార్మికుల జీవితాలను బుగ్గిపాలు చేసింది. కార్మికుల కుటుంబాల్లో పెను విషాదాన్ని నింపింది. ఒక్కసారిగా సంభవించిన పేలుడు (Ghaziabad Factory Explosion)లో ఏడుగురు కార్మికులు చనిపోగా, మరో నలుగురు కార్మికులకు కాలిన గాయాలయ్యాయి.
Bride dies in midst of wedding rituals | అగ్నిసాక్షిగా ఒక్కటైన ఆ జంట ఆనందంగా బరాత్ నడుమ ఇంటికి చేరుకోవాలనుకుంది. అంతలోనే విధి వక్రించింది. పెళ్లితంతు జరుగుతుండగానే వధువు చనిపోవడం రెండు కుటుంబాలలో విషాదాన్ని నింపింది.
ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌కి ప్రాణహాని ఉందని.. మిలిటెంట్లు కొందరు సీఎంను టార్గెట్ చేస్తున్నారని తమకు సమాచారం అందిందని మధ్యప్రదేశ్ పోలీస్ వర్గాలు తెలిపాయి.
ఉత్తరప్రదేశ్‌లో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఓ కార్యక్రమానికి హాజరైన బీజేపీ ఎమ్మెల్యే, పోలీస్ సూపరింటెండెంట్ పై నోరు పారేసుకున్నారు
ఉత్తరప్రదేశ్ లోని హపూర్ జిల్లాలో పిల్ఖువ రైల్వే స్టేషన్ వద్ద రైలు ప్రమాదంలో ఐదుగురు మృతి చెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన పిల్ఖువ క్రాసింగ్ వద్ద నిన్న రాత్రి రైల్వే ట్రాక్ దాటుతున్న సమయంలో జరిగింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.