గ్యాంగ్‌స్టర్, కాన్పూర్ ఎన్‌కౌంటర్ కేసు (Kanpur encounter case)లో ప్రధాన నిందితుడు వికాస్ దుబేను అరెస్ట్ చేసేందుకు పోలీసు బలగాలు దర్యాప్తు ముమ్మరం చేశాయి. ఈ క్రమంలో పోలీసులు వికాస్ దుబే అనుచరులు ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. మరో అనుచరుడు అమర్ దుబే బుధవారం ఉదయం జరిగిన ఎన్‌కౌంటర్‌లో హతమయ్యాడు. రూ.50 వేల ప్రభాత్ మిశ్రాను పోలీసులు కాన్పూర్‌కు తరలిస్తుండగా పారిపోయే యత్నం చేశాడు. పోలీసుల కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన బువా దుబే అనంతరం మరణించాడని పోలీసులు వెల్లడించారు. కాన్పూర్ ఎన్‌కౌంటర్ కేసులో కీలక పరిణామం
పోలీసులు తమ వాహనంలో నిందితులను కాన్పూర్ తరలిస్తుండగా గురువారం వేకువజామున నిందితుడు ప్రభాత్ మిశ్రా తప్పించుకునే యత్నం చేశాడు. ఈ క్రమంలో పారిపోతున్న ప్రభాత్ మిశ్రాపై పోలీసులు కాల్పులు జరపగా బుల్లెట్ గాయాలతో పట్టుబడినట్లు యూపీ అదనపు డీజీపీ (శాంతి భద్రతలు) ప్రశాంత్ కుమార్ తెలిపారు. చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించగా అప్పటికే తీవ్ర రక్తస్రావమైన నిందితుడు ప్రభాత్ మిశ్రా చనిపోయాడని వివరించారు. వికాస్ దుబేపై రివార్డు 5 లక్షలకు పెంపు.. పలు రాష్ట్రాల్లో అలర్ట్
మరో నిందితుడు హతం
రూ.50 వేల రివార్డు ఉన్న బహువా దుబే పోలీసుల ఎన్‌కౌంటర్‌లో హతమయ్యాడు. అతడి వాహనాలు, ఆయుధాలు పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్ఎస్‌పీ ఇతావా ఆకాశ్ తోమర్ తెలిపారు. కాన్పూర్‌లో పోలీసులపై కాల్పులు జరిపి 8 మందిని పొట్టనపెట్టుకున్న సమయంలో గ్యాంగ్‌స్టర్ వికాస్ దుబేతో పాటు బహువా దుబే ఉన్నట్లు సమాచారం. జీ హిందుస్తాన్ టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan live here..
RGV ‘నగ్నం’ హీరోయిన్ స్వీటీ Hot Photos