రోడ్డు ప్రమాదంలో బీజేపీ ఎమ్మెల్యే దుర్మరణం

బీజేపీ ఎమ్మెల్యే లోకేంద్రసింగ్ ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది.

Last Updated : Feb 21, 2018, 09:30 AM IST
రోడ్డు ప్రమాదంలో బీజేపీ ఎమ్మెల్యే దుర్మరణం

ఉత్తరప్రదేశ్‌లోని సితార్‌పూర్‌ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. బీజేపీ ఎమ్మెల్యే లోకేంద్రసింగ్ ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. ఈ దుర్ఘటనలో ఎమ్మెల్యే దుర్మరణం చెందారు. కారు హైవే మీద ట్రక్ ను ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ఎమ్మెల్యేతో పాటు ఇద్దరు గన్‌మెన్లు, ట్రక్ డ్రైవర్ అక్కడికక్కడే మృతిచెందారు.

లోకేంద్రసింగ్ (41), బిజ్నూర్ జిల్లా నూర్పూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. గత ఏడాది మార్చిలో ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో లోకేంద్ర సింగ్ నూర్పూర్ నుండి గెలిచారు.

Trending News