రైలు ఢీకొని ఐదుగురు మృతి

ఉత్తరప్రదేశ్ లోని హపూర్ జిల్లాలో పిల్ఖువ రైల్వే స్టేషన్ వద్ద రైలు ప్రమాదంలో ఐదుగురు మృతి చెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన పిల్ఖువ క్రాసింగ్ వద్ద నిన్న రాత్రి రైల్వే ట్రాక్ దాటుతున్న సమయంలో జరిగింది.

Last Updated : Feb 26, 2018, 11:35 AM IST
రైలు ఢీకొని ఐదుగురు మృతి

లక్నో: ఉత్తరప్రదేశ్ లోని హపూర్ జిల్లాలో పిల్ఖువ రైల్వే స్టేషన్ వద్ద రైలు ప్రమాదంలో ఐదుగురు మృతి చెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన పిల్ఖువ క్రాసింగ్ వద్ద నిన్న రాత్రి రైల్వే ట్రాక్ దాటుతున్న సమయంలో జరిగింది. లోకోమోటివ్ రైలు వారిని ఢీకొట్టింది.  రైల్వే ట్రాక్ పై కూర్చుని ఉన్నప్పుడన్నా లేదా  రైల్వే ట్రాక్ దాటడానికి ప్రయత్నిస్తున్నప్పుడన్నా వాళ్లు చనిపోయి ఉంటారని పోలీసులు చెప్పారు.

"చనిపోయిన ఐదుగురి కుటుంబాలకు కబురు పంపాము. గాయపడ్డవారిని ఆసుపత్రికి తరలించాము. ఒకవైపు నుండి గూడ్స్ రైలు వస్తున్నప్పుడు వాళ్లు రైల్వే ట్రాక్ పై ఉన్నారు. ఆ రైలును ప్రమాదం నుండి తప్పించుకోవటానికి, వారు ఇంకొక ట్రాక్ పైకి వెళ్లినప్పుడు అక్కడ వేగంగా వచ్చిన ఒక లోకోమోటివ్ రైలు ఢీకొట్టింది" అని సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (జీఆర్పీ మొరదాబాద్) ఎస్.సీ దుబే అన్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని అన్నారు.

Trending News