Hathras Case: బాధితురాలి కుటుంబసభ్యులకు మూడంచెల భద్రత: యూపీ ప్రభుత్వం

ఉత్తరప్రదేశ్‌ హత్రాస్‌ (Hathras) లో జరిగిన దారుణ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అయితే ఈ కేసును యూపీ ప్రభుత్వం.. ఇప్పటికే సిట్ (SIT) కు అప్పగించగా.. ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వ (Central Govt) ఆదేశాలతో ఈ సంఘటనపై కేసు నమోదుచేసిన సీబీఐ (CBI) ముమ్మరంగా దర్యాప్తు చేస్తోంది. ఈ క్రమంలో బుధవారం ఈ సంఘటనపై సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు విచారణ, బాధితురాలి కుటుంబసభ్యులు, సాక్షుల రక్షణపై సర్వోన్నత న్యాయస్థానంలో అఫిడవిట్‌ను సమర్పించింది.

Last Updated : Oct 15, 2020, 09:55 AM IST
Hathras Case: బాధితురాలి కుటుంబసభ్యులకు మూడంచెల భద్రత: యూపీ ప్రభుత్వం

Three-fold security for Hathras victim's family members: UP tells SC: న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్‌ హత్రాస్‌ (Hathras) లో జరిగిన దారుణ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అయితే ఈ కేసును యూపీ ప్రభుత్వం.. ఇప్పటికే సిట్ (SIT) కు అప్పగించగా.. ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వ (Central Govt) ఆదేశాలతో ఈ సంఘటనపై కేసు నమోదుచేసిన సీబీఐ (CBI) ముమ్మరంగా దర్యాప్తు చేస్తోంది. ఈ క్రమంలో బుధవారం ఈ సంఘటనపై సుప్రీంకోర్టు (Supreme Court) ఆదేశాల మేరకు.. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం (UP Govt) విచారణ, బాధితురాలి కుటుంబసభ్యులు, సాక్షుల రక్షణపై సర్వోన్నత న్యాయస్థానంలో అఫిడవిట్‌ను సమర్పించింది. అయితే బాధితురాలి కుటుంబ సభ్యులకు, సాక్షులకు మూడంచెల రక్షణ వ్యవస్థను ఏర్పాటు చేసినట్లు ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలియజేసింది. దీంతోపాటు ఈ దారుణ ఘటనపై సీబీఐ నిర్దిష్ట కాల పరిమితితో విచారణ నిర్వహించేలా, ప్రతి పదిహేను రోజులకు ఒకసారి విచారణ తీరుపై రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పించేలా సీబీఐకి ఆదేశించాలని రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును కోరింది. అలా సమర్పించిన నివేదికను డీజీపీ సుప్రీంకోర్టుకి సమర్పిస్తారని ప్రభుత్వం సర్వోన్నత న్యాయస్థానానికి వెల్లడించింది. Also read: Heavy Rains: ముంబైలో రెడ్ అలెర్ట్

అయితే.. కుటుంబ సభ్యులు, సాక్షుల రక్షణ కోసం.. బాధితురాలి ఇంటి చుట్టూ 8 సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి 16 మంది పోలీసులను వారి చూట్టూ మోహరించినట్లు ప్రభుత్వం న్యాయస్థానానికి తెలిపింది. అత్యవసర పరిస్థితి తలెత్తితే ఎదుర్కోవడానికి క్విక్‌ రెస్పాన్స్‌ టీమ్‌ని సైతం గ్రామంలో ఏర్పాటు చేశామని, వారి గోప్యతలో జోక్యం చేసుకోవద్దని పోలీసులకు ఆదేశాలు సైతం ఇచ్చినట్లు ప్రభుత్వం ధర్మాసనానికి తెలిపింది. అంతేకాకుండా బాధిత కుటుంబసభ్యులు, సాక్షులు నచ్చిన వ్యక్తులను కలవడానికి, ఎక్కడికైనా వెళ్ళడానికి అనుమతిచ్చినట్లు యూపీ ప్రభుత్వం సుప్రీం కోర్టుకు సమర్పించిన అఫిడవిట్‌లో పేర్కొంది.  Also read: Hyderabad Rains: నగరంలో ఎటుచూసినా నీరే.. హెల్ప్ లైన్ నెంబర్ల జారీ

ఇదీ కేసు.. 
సెప్టెంబరు 14న పొలం పని చేస్తున్న 19 ఏళ్ల దళిత యువతిపై ఉన్నత వర్గానికి చెందిన నలుగురు వ్యక్తులు అత్యాచారం చేసి, నాలుక కోసి, చిత్రహింసలకు గురిచేశారు. తీవ్రంగా గాయపడిన యువతి రెండు వారాల పాటు మృత్యువుతో పోరాడుతూ.. ఢిల్లీలోని సప్దర్‌జంగ్ ఆసుపత్రిలో సెప్టెంబరు 29న కన్నుమూసింది. అయితే బాధితురాలి మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పజెప్పకుండా, వారిని అనుమతించకుండానే అదేరోజు అర్థరాత్రి 2:30 గంటలకు పోలీసులు దహనం చేశారు. ఆ తరువాత ఈ ఘటనపై దేశవ్యాప్తంగా ఆందోళనలు జరిగాయి. ఈ కేసులో నలుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. దీంతోపాటు విధుల్లో నిర్లక్ష్యం వహించిన హత్రాస్ ఎస్పీతో సహా ఐదుగురు పోలీసు అధికారులను యూపీ ప్రభుత్వం సస్పెండ్ చేసింది. అంతేకాకుండా ఈ కేసుపై సిట్‌ను ఏర్పాటు చేసింది. అయితే సిట్ నివేదికను ఈ నెల 16 న యూపీ ప్రభుత్వానికి సమర్పించనుంది. 

Also read: Hyderabad Rains: 15కు చేరిన మరణాల సంఖ్య.. కొనసాగుతున్న రెస్క్యూ

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

Trending News