Telangana BJP New Chief: తెలంగాణతో పాటు దేశంలోని వివిధ రాష్ట్రాల్లో కేంద్ర మంత్రి పదవుల్లో ఆర్ఆర్ఎస్ (రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్) బ్యాక్ గ్రౌండ్ అవసరం లేదన్నారు. బీజేపీ క్రియా శీలక సభ్యత్వం ఉంటే చాలు అని కిషన్‌రెడ్డి తెలిపారు. రెండు సార్లు బీజేపీ గుర్తు పై పోటీ చేసినా సరిపోతుందని అన్నారు. మల్కాజ్ గిరి ఎంపీ ఈటల రాజేందర్ కూడా బీజేపీ అధ్యక్ష రేసులో ఉంటారని కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన గత ప్రభుత్వం హయాంలో బీఆర్ఎస్ కు రాజీనామా చేసి బీజేపీ గుర్తుపై హుజురాబాద్ నుంచి పోటీ గెలిచారు. ఆ తర్వాత తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో హుజురాబాద్, గజ్వేల్ నియోజకవర్గాల నుంచి ఎమ్మెల్యేగా పోటీ ఓటమి పాలయ్యారు.
ఆ తర్వాత ఆరు నెలలకు జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో మల్కాజ్ గిరి పార్లమెంట్ నియోజకవర్గం నుంచి ఎంపీగా పోటీ చేసి మంచి మెజారిటీలో గెలిచి పార్లమెంట్ లో అడుగుపెట్టారు. అయితే.. కేంద్రంలో ఏర్పడిన నరేంద్ర మోడీ 3వ మంత్రి వర్గంలో ఈటలకు ఛాన్స్ దక్కుతుందని అందరు భావించారు. కానీ అనూహ్యంగా తెలంగాణ మాజీ పార్టీ అధ్యక్షుడు.. రెండు సార్లు కరీంనగర్ నుంచి ఎంపీగా గెలిచిన బండి సంజయ్ కు కేంద్ర మంత్రివర్గంలో స్థానం దక్కింది. ఆయనకు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి పదవి దక్కింది. ఈ నేపథ్యంలో బీజేపీ అధ్యక్షుడిగా ఈటల పేరు వినిపిస్తోంది. ఆయనతో పాటు డీకే అరుణ్, రఘునందన్ రావు, ధర్మపురి అరవింద్ పేర్లు పరిశీలనలో ఉన్నాయి. ఫైనల్ గా బీఆర్ఎస్ నుంచి బిజెపిలోకి వచ్చిన ఈటెలకు తెలంగాణ బిజెపి పదవి దక్కుతుందని ప్రచారం జరుగుతుంది. కానీ అనూహ్యంగా మరో పేరు తెరపైకి వచ్చింది. ప్రస్తుతం కిషన్ రెడ్డి కేంద్ర మంత్రిగా.. రాష్ట్ర మంత్రిగా జోడు గుర్రాల స్వారీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈటల పేరును ఈ నెలాఖారు వరకు ప్రకటించే అవకాశాలున్నాయి.
ఇదీ చదవండి : చిరంజీవి, కీర్తి సురేష్ తల్లితో రొమాన్స్ చేసిన ఈ సినిమా తెలుసా..! అందులో మెగాస్టార్ విలన్..
మరోవైపు కేంద్ర మాజీ మంత్రి సినీ నటుడు చిరంజీవి కూడా బీజేపీకి సన్నిహితంగా మెలుగుతున్నారు. ఇక ప్రధాని మోడీ కూడా పవన్ కళ్యాణ్ తో పాటు ఆయన అన్నయ్య చిరంజీవికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో మెజారిటీగా ఉన్న కాపులను ఆకట్టుకునే క్రమంలో చిరంజీవిని దగ్గర తీసినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఏపీలో వైసీపీకి రెడ్డి సామాజిక వర్గం, టీడీపికి కమ్మ సామాజిక వర్గం అండగా ఉంటూ వస్తున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర పెద్దలు ఇప్పటి వరకు రాష్ట్రంలో అధికార పీఠం దక్కించుకోని కాపులను చేరదీసే క్రమంలో జనసేన ఛీఫ్ తో పవన్ కళ్యాణ్ తో పాటు ఆయన అన్న చిరంజీవికి మంచి ప్రాధాన్యత ఇస్తున్నాయి. ఇక చిరుకు బీజేపీ తరుపున కాకుండా రాష్ట్రపతి కోటాలో రాజ్యసభకు నామినేట్ చేయనున్నట్టు ప్రచారం జరుగుతోంది.
ఇదీ చదవండి: గడ్డకట్టే చలిలో నాగ సాదువులు నగ్నంగానే ఎందుకు ఉంటారు.. అసలు రహస్యం అదేనా..!
ఇదీ చదవండి : ప్రస్తుత మార్కెట్ వాల్యూ ప్రకారం నాగార్జున ‘అన్నపూర్ణ స్టూడియో’ మార్కెట్ విలువ ఎంతో తెలుసా..?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.