Woman raped in Hyderabad: హైదరాబాద్ లో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. సినిమా అవకాశాలు ఇప్పిస్తానని చెప్పి.. ఒక డైరెక్టర్ మహిళకు మాయ మాటలు చెప్పారు. ఆమెను నమ్మించి హోటల్ కు రప్పించి.. అత్యాచారం చేశారు. ఈ ఘటన దుమారంగా మారింది.
ఆంధ్ర ప్రదేశ్ కు చెందిన సదరు.. మహిళ భర్తతో విడిపోయి ఉంటుంది. ఆమె తొలుత మణి కొండలో హౌస్ కీపింగ్ పనిచేసేంది. సినిమాల మీద ఆసక్తి ఉండటంతో.. ఆ తర్వాత 15 రోజుల క్రితం అమీర్ పేట సమీపంలోని కృష్ణానగర్ కు మారింది.
అక్కడ కాటేకొండ రాజుతో పరిచయం ఏర్పడింది. అతగాడు.. అవకాశం ఇప్పిస్తానని, ఫోటోషూట్ ఉందని చెప్పి... రెస్టారెంట్ కు రమ్మన్నాడు. సదరు మహిళ ఇటీవల వెళ్లింది. మొదటి రోజు ఫోటో షూట్ తీయించాడు. ఆతర్వాత మాయ మాటలు చెప్పాడు. మంచిగా ఉన్నట్లు నమ్మించి.. మరల రెండో రోజు కూడా రమ్మన్నాడు. దీంతో అతగాడి మాటలు నమ్మి వెళ్లిన సదరు మహిళను గదిలో వేధించాడు.
అంతే కాకుండా.. అత్యాచారానిసైతం పాల్పడ్డాడు. దీంతో బాధితురాలు జూబ్లిహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. ఈ ఘటన ప్రస్తుతం సంచలనంగా మారింది. దీంతో సినిమా ఇండస్ట్రీలో ఈ ఘటన.. మరోమారు మహిళల వేధింపులు, అత్యాచారాల ఘటనపై తీవ్ర చర్చనీయంశంగా మారింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Facebook, Twitter