Kolkata court on rg kar case: కోల్ కతా ఘటన దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఆర్జీకర్ ఆస్పత్రిలో గతేడాది ఆగస్టు 9న జరిగిన జూనియర్ వైద్యురాలిని అత్యంత దారుణంగా అత్యాచారం చేసి, హతమార్చిన ఘటన యావత్ దేశంలో కన్నీళ్లను తెప్పించేదిగా మారింది.
దీనిపై జూనియర్ డాక్టర్లు నెలల తరబడి తమ నిరసనలు వ్యక్తం చేశారు. అంతే కాకుండా.. దేశ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సైతం.. ఈ ఘటనపై స్పందించారు. ఇదిలా ఉండగా.. దీనిపై కోల్ కతా సర్కారు.. హైకోర్టు ఆదేశాల మేరకు సీబీఐకి కేసును బదిలీ చేసింది. అంతే కాకుండా.. సీబీఐ రంగంలోకి దిగి మమతా సర్కారు అనేక ఆరోపణలు చేసింది.
ఘటన జరిగాక... క్రైమ్ జరిగిన ప్రదేశంలో ఎవిడెన్స్ లను పొకుండా.. చూడటంతో స్థానిక పోలీసులు విఫలమయ్యారని పలు విషయాల్ని బైటపెట్టింది. ఈ నేపథ్యంలో దీనిపై విచారణన చేపట్టిన సీబీఐ.. అక్టోబరు 7న ఛార్జీషిట్ ను వేసింది. ఈ క్రమంలో దీనిపై విచారణ జరిపిన కోర్టు.. ఈ రోజు ఈ ఘటనలో సంజయ్ రాయ్ దోషి అంటూ తెల్చింది. అదే విధంగా తదుపరి శిక్ష ఖరారును సోమవారానికి కోర్టు వాయిదా వేసినట్లు కోల్ కతా కోర్టు వెల్లడించింది.
ఇదిలా ఉండగా.. ఆగస్టు 9 న సెమినార్ హల్ లో జూనియర్ డాక్టర్ రక్తపు మడుగులో ఉండటంను ఆస్పత్రి వర్గాలు గుర్తించాయి. మొదట ఇంట్లో వాళ్లకు ఫోన్ చేసి, ఆరోగ్యం బాగాలేదని, ఆ తర్వాత మీ అమ్మాయి చనిపోయిందని చెప్పారు. ఆమెకు పోస్ట్ మార్టం చేసిన వైద్యులు.. అత్యాచారం జరిగిందని పోస్ట్ మార్టం రిపోర్టు ఇచ్చారు. ఘటన జరిగిన రోజు రాత్రి సంజయ్ రాయ్ వైద్యురాలినే ఫాలో అయిన వీడియోలు బైటపడ్డాయి.
ఘటన స్థలంలో సంజయ్ రాయ్ ఇయర్ బడ్ దొరకడంతో పోలీసులు ఆగస్ట్ 10 న ఇతడ్ని అరెస్ట్ చేశారు. ఆతర్వాత ఆర్జీకర్ ప్రిన్స్ పాల్ సందీప్ ఘోష్, తాలా పోలీసు అధికారి అభిజిత్ మండల్ ను పోలీసులు అరెస్ట్ చేశారు . ఈ ఘటనపై దేశ వ్యాప్తుంగా ఐఎండీ తమ నిరసనలు వ్యక్తం చేసింది.
ఈ నేపథ్యంలో దీనిపై సుదీర్ఘంగా విచారణ అనంతరం ఈరోజు కోర్టు.. సంజయ్ రాయ్ ను దోషిగా తెలుస్తు తీర్పు వెలువరించింది. దీంతో బాధిత కుటుంబ సభ్యులు చాలా ఎమోషనల్ అవుతున్నారు. మరోవైపు నిందితుడు సంజయ్ రాయ్ ను బహిరంగంగా ఉరితీయాలని అక్కడి వాళ్లు డిమాండ్ చేస్తున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Facebook, Twitter