Most Profitable Small Business Idea: స్టార్ట్‌ చేసిన వెంటనే లాభాలు వచ్చే క్రేజీ బిజినెస్‌ ఐడియా.. కేవలం రూ. 50,000 పెట్టుబడితో నెలకు రూ. లక్షల ఆదాయం..

Homemade Soap Business Idea: బిజినెస్‌ అనేది ఇప్పుడు చాలా మందికి ఆకర్షణీయమైన ఎంపికగా మారింది. దీని కారణం సొంత బాస్‌లుగా ఉండే అవకాశం ఉంటుంది. అలాగే తమ సమయాన్ని, పనిని, నిర్ణయాలను స్వయంగా నిర్వహించుకోవచ్చు. ముఖ్యంగా బిజినెస్‌ ద్వారా ఆర్థిక స్థితిని మెరుగుపరచుకోవచ్చు. ఆదాయాన్ని పెంచుకోవడానిక,  భవిష్యత్తు కోసం ఆదా చేయడానికి మంచి అవకాశాలు కూడా పొందవచ్చు. అయితే వ్యాపారం ప్రారంభించడం అనేది సులభమైన పని కాదు. లాభాలను, నష్టాలను ఒకేలా అర్థం చేసుకోవడం వల్ల ఏ బిజినెస్ అయిన సాఫీగా సాగుతుంది. అయితే మీరు కూడా ఏదైనా బిజినెస్‌ను ప్రారంభించాలని ఆలోచిస్తున్నారా? మీరు తెలుసుకొనే వ్యాపారంతో నెలకు రూ.  లక్షలు సంపాదించవచ్చు. ఈ బిజినెస్‌ ఎలా ప్రారంభించాలి అనే వివరాలు ఇక్కడ తెలుసుకోండి. 

1 /12

నేటి యుగంలో చిన్న వ్యాపారాలు ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకున్నాయి. ఇంట్లోనే ఉన్న వస్తువులతో కూడా కొత్త ఆలోచనలతో వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు. ఇది కేవలం ఆర్థికంగా మాత్రమే కాకుండా సృజనాత్మకతను పెంపొందించడానికి కూడా ఉపయోగపడుతుంది.  

2 /12

  ఈరోజు మీరు తెలుసుకొనే బిజినెస్ కేవలం ఆర్థికంగా మెరుగుపరచడమే కాకుండా సృజనాత్మకతను పెంపొందించడానికి కూడా సహాయపడుతుంది. ఈ వ్యాపారం ప్రారంభించడానికి అధిక పెట్టుబడి అవసరం లేదు కేవలం తక్కువ పెట్టుబడితో కూడా వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు.  

3 /12

ఇంట్లో తయారు చేసిన సబ్బులు ప్రస్తుతం ఎంతో ప్రజాదరణ పొందుతున్నాయి. ప్రకృతిసిద్ధమైన పదార్థాలతో, వ్యక్తిగతీకరించిన సువాసనలతో తయారు చేయబడిన ఈ సబ్బులు చర్మ సంరక్షణకు మంచి ఎంపికగా మారుతున్నాయి. 

4 /12

 ఈ వ్యాపారాన్ని ఇంటి నుంచి కూడా స్టార్ట్ చేయవచ్చు లేదా పెద్ద వ్యాపారంగా కూడా ప్రారంభించవచ్చు. మీరు ఈ వ్యాపారాన్ని ప్రారంభించాలని అనుకుంటే కొన్ని అంశాలపైన అవగాహన పెంచుకోవాల్సి ఉంటుంది. 

5 /12

 సబ్బు తయారీ ప్రక్రియ గురించి పూర్తిగా తెలుసుకోవడం చాలా ముఖ్యం. దీని కోసం మీరు ఆన్‌లైన్ కోర్సులు చేయవచ్చు, వీడియోలు చూడవచ్చు లేదా వర్క్‌షాప్‌లలో పాల్గొనవచ్చు. వివిధ రకాల సబ్బులు తయారు చేయడానికి కావలసిన పదార్థాలు, వాటి నిష్పత్తి, ఉష్ణోగ్రత మొదలైన వాటి గురించి తెలుసుకోవాలి.  

6 /12

ముఖ్యంగా సబ్బు తయారీలో భద్రతా చర్యలు గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం. సహజ పదార్థాలను ఉపయోగించి సబ్బులు తయారు చేయడం వల్ల మీ ఉత్పత్తులకు మంచి డిమాండ్ ఉంటుంది.  

7 /12

వేప నూనె, ఆలివ్ ఆయిల్, కొబ్బరి నూనె, గోధుమ రవ్వ, పసుపు, నిమ్మ రసం మొదలైన సహజ పదార్థాలను ఉపయోగించి వివిధ రకాల సబ్బులు తయారు చేయవచ్చు. అధిక నాణ్యత గల పదార్థాలను ఎంచుకోవడం చాలా ముఖ్యం.

8 /12

ప్రస్తుతం మార్కెట్‌లో వివిధ రకాల సబ్బు మోల్డ్‌లు అందుబాటులో ఉన్నాయి. మీరు మీకు నచ్చిన రకాల మోల్డ్‌లను ఎంచుకోవచ్చు. సబ్బులను ఆకర్షణీయంగా ప్యాక్ చేయడం వల్ల అమ్మకాలు పెరుగుతాయి.

9 /12

సహజ పదార్థాలతో తయారు చేసిన సబ్బు అని కస్టమర్‌కు తెలిసేలా ప్యాకేజింగ్‌పై లేబుల్స్ అతికించాలి. సోషల్ మీడియా, వెబ్‌సైట్, స్థానిక మార్కెట్లు, బ్యూటీ పార్లర్లు మొదలైన వాటి ద్వారా మీ ఉత్పత్తులను ప్రచారం చేయవచ్చు.  

10 /12

మీరు సబ్బు తయారీ వ్యాపారాన్ని ప్రారంభించే ముందు అవసరమైన అన్ని లైసెన్స్‌లు తీసుకోవాలి. ముఖ్యంగా తీసుకోవాల్సిన లైసెన్స్‌లు, రిజిస్ట్రేషన్‌లు: ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏ లైసెన్స్: ఆహార భద్రతా ప్రమాణాలను పాటించడానికి ఈ లైసెన్స్ అవసరం. MSME రిజిస్ట్రేషన్: చిన్న వ్యాపారాలకు అనేక ప్రయోజనాలు ఉంటాయి. GST నమోదు: సరుకుల అమ్మకంపై GST చెల్లించడానికి చాలా అవసరం.  

11 /12

సబ్బుల బిజినెస్‌ స్టార్ట్ చేయడానికి మీకు రూ. 50 వేల నుంచి లక్ష రూపాయిలు అవుతుంది. మీ వద్ద సరిపడ డబ్బు లేకపోతే ప్రధాన మంత్రి ముద్ర యోజన పథకం కింద కావాల్సినంత లోన్‌ను పొందవచ్చు.   

12 /12

సబ్బుల వ్యాపారంతో మీరు నెలకు రూ. 90,000 సంపాదించ్చుకోవచ్చు. రోజుకు రూ. 3,000 ఆదాయం వస్తుంది. ఈ విధంగా మీరు సులభంగా ఇంటి నుంచే డబ్బులు సంపాదించుకోవచ్చు. మీకు ఈ ఐడియా నచ్చితే మీరు కూడా ఒకసారి ప్రయత్నిచండి.