Srinivasa Kalyanam in USA: అమెరికాలో శ్రీనివాస కల్యాణం అంగరంగవైభవంగా జరిగింది. ప్రవాసాంధ్ర తెలుగు సొసైటీ, టీటీడీ సంయుక్తంగా యూఎస్‌లోని శాన్ఫ్రాన్సిస్కో బే ఏరియాలో శ్రీవారి కల్యాణాన్ని కన్నుల పండువగా నిర్వహించారు.
US Shooting: అగ్రరాజ్యం అమెరికాలో మరోసారి కాల్పుల మోత మోగింది. టెక్సాస్ స్కూల్ ఘటన మరవకముందే పశ్చిమ మేరీ ల్యాండ్ లో మరో ఘటన జరిగింది. స్మిత్‌బర్గ్‌లో అగంతకుడు కాల్పులు జరిపాడు. కొలంబియా మెషిన్ ఫ్యాక్టరీలోకి చొరబడ్డ దుండగుడు.. తన దగ్గర ఉన్న గన్ తో విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు.
Telangana Formation Day: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు ఇక్కడే కాదు.. ఖండాంతరాల అవతల కూడా ఘనంగా నిర్వహించారు. కెనడాలోనూ సందడిగా జరుపుకున్నారు. టీఆర్ఎస్ ఎన్నారై విభాగం ఆధ్వర్యంలో ఈ ఉత్సవాలు ఘనంగా జరిగాయి.
Revanth reddy in America: అమెరికాలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు సందడిగా సాగాయి. డల్లాస్‌లో జరిగిన ఉత్సవాలకు పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా రేవంత్‌కు అక్కడి నిర్వాహకులు, అభిమానులు ఘనంగా స్వాగతం పలికారు.
Revanth Reddy: అమెరికా పర్యటనలో బిజీబిజీగా ఉన్నారు తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ రేవంత్ రెడ్డి. ప్రవాస తెలంగాణవాదులతో కీలక సమావేశాలు నిర్వహిస్తున్నారు. డల్లాస్ లో నిర్వహించిన తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. టీఆర్ఎస్ ప్రభుత్వం, సీఎం కేసీఆర్ తీరుపై తీవ్రమైన ఆరోపణలు చేశారు.
Telugu Student Died In US: అమెరికాలో ఓ తెలుగు విద్యార్థి చనిపోవడం కలకలం రేపింది. ఫ్లోరిడాలో ఉన్నత చదువులు చదువుతున్న కంటె యశ్వంత్ అనే యువకుడు విహార యాత్రకు వెళ్లి అలల తాకిడికి సముద్రంలో మునిగి చనిపోయాడు.
Telangana Telugu Association Celebrations: అమెరికాలోని న్యూజెర్సీలో తెలంగాణ తెలుగు అసోసియేషన్ సంబరాల సందడి మొదలయ్యింది. మూడు రోజుల పాటు అంగరంగ వైభవంగా ఉత్సవాలు నిర్వహించనున్నారు. ఈ సంబరాల కోసం భారీస్థాయిలో ఏర్పాట్లు చేశారు.
KTR Davos Tour: తెలంగాణ మంత్రి కేటీఆర్ దావోస్ పర్యటన విజయవంతమైంది. భారీగా పెట్టుబడుల సాధనే లక్ష్యంగా దావోస్‌కు వెళ్లిన కేటీఆర్.. లక్ష్యసాధనలో విజయవంతమయ్యారు. పలు అంతర్జాతీయ సంస్థలు తెలంగాణలో పెట్టుబడులకు ఒప్పందాలు కుదుర్చుకున్నాయి.
తెలంగాణ ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ దావోస్ పర్యటన విజయవంతంగా కొనసాగుతోంది. వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో రాష్ట్రానికి భారీగా పెట్టుబడులను ఆకర్షిస్తున్నారు మంత్రి కేటీఆర్. ఇప్పటికే పలు అంతర్జాతీయ సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకున్నారు తెలంగాణ అధికారులు . తాజాగా ప్రతిష్టాత్మక సంస్థలు తెలంగాణలో పెట్టుబడులకు ముందుకొచ్చాయి.
Schneider Electric In TS : ఎలక్ట్రానిక్ పరికరాల తయారీ సంస్థ సెనెజర్ ఎలక్ట్రిక్ సంస్థ తెలంగాణలో మరో యూనిట్‌ను ప్రారంభించనుంది. ఇప్పటికే హైదరాబాద్‌లో ఆ సంస్థకు సంబంధించిన యూనిట్ పురోగతిలో ఉండగా.. అదే ఊపుతో అదనంగా మరో కొత్త యూనిట్ ప్రారంభించనున్నట్లు సంస్థ ప్రతినిధులు ప్రకటించారు.
Flight With Female Crew: గల్ఫ్ దేశాల్లో మహిళలపై అత్యంత కఠిన ఆంక్షలు అమలవుతాయి. వీటిగురించి ప్రపంచమంతా కథలు కథలుగా చెప్పుకుంటుంది. అయితే, మారుతున్న కాలానికి అనుగుణంగా సౌదీ అరేబియా ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. సంప్రదాయాలను పక్కనబెట్టింది.
KTR, Aditya Thackeray meeting: ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సు జరుగుతున్న దావోస్‌లో తెలంగాణ ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్, మహారాష్ట్ర పర్యాటక మంత్రి ఆదిత్య థాకరే భేటీ అయ్యారు. దావోస్‌లో తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన పెవిలియన్‌లో ఆదిత్యథాకరే కాసేపు కేటీఆర్‌తో ముచ్చటించారు.
KTR speech at Davos WEF: హైదరాబాద్ నగరం లైఫ్ సైన్సెస్‌కు క్యాపిటల్‌గా ఉందని, ఈ రంగాన్ని మరింత బలోపేతం చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తోందని ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ చెప్పారు. ఈ క్రమంలోనే హైదరాబాద్ ఫార్మాసిటీ పేరుతోప్రపంచంలోనే అతిపెద్ద ఫార్మా క్లస్టర్ని హైదరాబాద్ శివారుల్లో ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు.
Telugu Speaking Crew in Hyd-London Flights: హైదరాబాద్-లండన్ హీత్రో మధ్య నడిచే బ్రిటీష్ ఎయిర్వేస్ విమానాల్లో 20 మంది తెలుగు మాట్లాడే కేబిన్ సిబ్బందిని నియమించినట్లు ఆ సంస్థ శనివారం (మే 21) వెల్లడించింది.
UK Southwark Mayor Sunil Chopra: యూకెలోని భారత సంతతికి చెందిన వ్యాపారవేత్త సునీల్ చోప్రా లండన్ బరో ఆఫ్ సౌత్‌వార్క్ మేయర్‌గా ఎన్నికయ్యారు. ఆయన మేయర్‌గా ఎన్నికవడం ఇది రెండోసారి.
KTR Tour In London: తెలంగాణకు పెట్టుబడుల సాధనే లక్ష్యంగా లండన్‌లో పర్యటిస్తున్న మంత్రి కేటీఆర్ బిజీబిజీగా గడుపుతున్నారు. పలువరు పారిశ్రామికవేత్తలతో వరుసగా సమావేశమవుతున్నారు. లండన్‌లో ప్రవాస తెలంగాణ సంఘాలు ఏర్పాటుచేసిన మీట్ అండ్ గ్రీట్‌లో కేటీఆర్ పాల్గొన్నారు.
KTR In London Trip: బ్రిటన్ పర్యటనలో ఉన్న తెలంగాణ ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ మూడో రోజు కూడా బిజీ బిజీగా గడిపారు. పారిశ్రామిక వేత్తలతో వరుస భేటీలు నిర్వహించారు. పలు సమావేశాల్లో పాల్గొన్నారు. లండన్‌లోని రాయబార కార్యాలయంలో జరిగిన ప్రత్యేక సమావేశంలో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు.
YS Jagan to World Economic Forum: దావోస్‌లో జరగనున్న ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సుకు ఏపీ సీఎం వైఎస్ జగన్ హాజరు కానున్నారు. నాలుగో పారిశ్రామిక విప్లవం దిశగా వేయాల్సిన అడుగులపైనా దావోస్ వేదికగా ఏపీ ప్రభుత్వ యంత్రాంగం కీలక చర్చలు చేపట్టనుంది.
Aeronautical University in Telangana: తెలంగాణ ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ బ్రిటన్‌లో బిజీ బిజీగా గడుపుతున్నారు. వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. పరిశ్రమలను ఆకర్షించడమే లక్ష్యంగా పారిశ్రామికవేత్తలతో భేటీ అవుతున్నారు.
UK Firm To Invest In Telangana: తెలంగాణ రాష్ట్రంలో మరో అతిపెద్ద సంస్థ పెట్టుబడులు పెట్టబోతోంది. ఇంగ్లండ్‌కు చెందిన ఫార్మాస్యూటికల్స్ సర్ఫేస్ మెజర్మెంట్ సిస్టమ్స్ సంస్థ ఓ ల్యాబొరేటరీని ఏర్పాటు చేయనుంది. బ్రిటన్‌లో పర్యటిస్తున్న మంత్రి కేటీఆర్ అక్కడి పారిశ్రామికవేత్తలతో వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.