UK Pharmaceutical Firm: తెలంగాణలో మరో అంతర్జాతీయ ఫార్మా సంస్థ పెట్టుబడులు

UK Firm To Invest In Telangana: తెలంగాణ రాష్ట్రంలో మరో అతిపెద్ద సంస్థ పెట్టుబడులు పెట్టబోతోంది. ఇంగ్లండ్‌కు చెందిన ఫార్మాస్యూటికల్స్‌ సర్ఫేస్‌ మెజర్‌మెంట్‌ సిస్టమ్స్‌ సంస్థ ఓ ల్యాబొరేటరీని ఏర్పాటు చేయనుంది. బ్రిటన్‌లో పర్యటిస్తున్న మంత్రి కేటీఆర్‌ అక్కడి పారిశ్రామికవేత్తలతో వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు.

Written by - ZH Telugu Desk | Last Updated : May 18, 2022, 11:05 PM IST
  • హైదరాబాద్‌కి ఇంగ్లాండ్‌కి చెందిన ఫార్మాస్యూటికల్స్‌ సర్ఫేస్‌ మెజర్‌మెంట్‌ సిస్టమ్స్‌
  • దేశంలో ఎక్కడా లేని విధంగా అత్యంత ఆధునిక పార్టికల్ క్యారెక్టరైజేషన్ లాబొరేటరీ
  • మందుల తయారీకి కీలకమైన ఫార్మాస్యూటికల్ పౌడర్ క్యారెక్టరైజేషన్‌పై పరిశోధనలు
UK Pharmaceutical Firm: తెలంగాణలో మరో అంతర్జాతీయ ఫార్మా సంస్థ పెట్టుబడులు

UK Firm To Invest In Telangana: తెలంగాణ రాష్ట్రంలో మరో అతిపెద్ద సంస్థ పెట్టుబడులు పెట్టబోతోంది. ఇంగ్లండ్‌కు చెందిన ఫార్మాస్యూటికల్స్‌ సర్ఫేస్‌ మెజర్‌మెంట్‌ సిస్టమ్స్‌ సంస్థ ఓ ల్యాబొరేటరీని ఏర్పాటు చేయనుంది. బ్రిటన్‌లో పర్యటిస్తున్న మంత్రి కేటీఆర్‌ అక్కడి పారిశ్రామికవేత్తలతో వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. కేటీఆర్‌తో సమావేశం అనంతరం సర్ఫేస్‌ మెజర్‌మెంట్‌ సిస్టమ్స్‌ సంస్థ ప్రతినిధులు ఈ ప్రకటన చేశారు. దేశంలో ఎక్కడా లేని స్థాయిలో అత్యంత ఆధునిక పార్టికల్ క్యారెక్టరైజేషన్ లాబొరేటరీని హైదరాబాద్‌లో ఏర్పాటు చేసేందుకు సంస్థ ప్రతినిధులు సంసిద్ధత వ్యక్తం చేశారు. 

హైదరాబాద్‌ శివారులో ఏడువేల చదరపు మీటర్ల స్థలంలో ఏర్పాటుచేయబోయే ఈ మెడికల్‌ ల్యాబ్‌లో మందుల తయారీకి కీలకమైన ఫార్మాస్యూటికల్ పౌడర్ క్యారెక్టరైజేషన్‌పై పరిశోధనలు చేపడతారు. జాతీయ, అంతర్జాతీయ ఫార్మా కంపెనీలకు సంబంధించిన ఔషధ ప్రయోగాలకు కూడా ఈ ల్యాబొరేటరీ వేదిక అవుతుందని సంస్థ ప్రతినిధులు వెల్లడించారు. వచ్చే రెండేళ్లలో ఈ పార్టికల్‌ క్యారెక్టరైజేషన్‌ ల్యాబ్‌ను మరింతగా విస్తరిస్తామని సర్ఫేస్ మెజర్‌మెంట్ సిస్టమ్స్ ప్రతినిధులు ప్రకటించారు. 

పారిశ్రామిక పెట్టుబడులే లక్ష్యంగా లండన్‌ వెళ్లిన రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌.. బుధవారం సర్ఫేస్ మెజర్‌మెంట్ సిస్టమ్స్ ఎండీ ప్రొఫెసర్ డారిల్ విలియమ్స్, గ్లోబల్ ఛానల్ మేనేజ్‌మెంట్, ఇంటర్నేషనల్ సేల్స్ మేనేజర్ డానియల్ విల్లాలోబోస్, లండన్‌లోని ఇండియా ఆపరేషన్స్ డైరెక్టర్ సయ్యద్ కుతుబుద్దీన్‌లతో భేటీ అయ్యారు. హైదరాబాద్‌లో ఏర్పాటు చేయబోయే అత్యాధునిక ల్యాబ్‌లో తమ కంపెనీ చేపట్టబోయే ప్రతిపాదనలు, ప్రణాళికలు, పరిశోధనల గురించి మంత్రి కేటీఆర్‌కు వాళ్లు వివరించారు. 

తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం అనుసరిస్తున్న పారిశ్రామిక అనుకూల విధానాల వల్లే హైదరాబాద్‌లో తాము అత్యాధునిక పార్టికల్ క్యారెక్టరైజేషన్ లాబొరేటరీని ఏర్పాటుచేయడానికి కారణమని ఆ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రొఫెసర్ డారిల్ విలియమ్స్ తెలిపారు. హైదరాబాద్‌లో ఏర్పాటు చేయబోతున్న పార్టికల్ క్యారెక్టరైజేషన్ ల్యాబొరేటరీ.. మన దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని ప్రముఖ ఫార్మాస్యూటికల్ కంపెనీలతో కలిసి పనిచేస్తుందని విలియమ్స్‌ చెప్పారు. తమలాంటి కంపెనీల పెట్టుబడులకు భారత్‌  ఆకర్షణీయ గమ్యస్థానంగా మారుతోందన్నారు. 

ఈ ల్యాబ్ ఏర్పాటు తర్వాత తెలంగాణ ఫార్మా రంగం ప్రతిష్ట అంతర్జాతీయ స్థాయిలో మరింతగా పెరుగుతుందని చెప్పారు. సర్ఫేస్ మెజర్‌మెంట్ సిస్టమ్స్ సంస్థకు ఇంగ్లండ్‌లోనే కాకుండా జర్మనీ, చైనా, అమెరికా, భారత్‌లో కూడా ఇప్పటికే యూనిట్లు ఉన్నాయన్నారు. తమతో కలిసి అపార నైపుణ్యం ఉన్న శాస్త్రవేత్తలు పనిచేయడమే తమ విజయాలకు కారణమన్నారు. 

ఇక, హైదరాబాద్‌లో తమ ల్యాబొరేటరీ ఏర్పాటు ద్వారా తెలంగాణ ఫార్మారంగంలోకి ప్రవేశించబోతున్న సర్ఫేస్ మెజర్‌మెంట్ సిస్టమ్స్‌ యాజమాన్యానికి మంత్రి కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు. ఫార్మా రంగంలో భారతదేశంలోనే ఏ రాష్ట్రానికి లేని సదుపాయాలు, అనుకూలతలు, ప్రత్యేకతలు హైదరాబాద్‌కు ఉన్నాయని గుర్తు చేశారు. సర్ఫేస్ మెజర్‌మెంట్ సిస్టమ్స్‌కు అవసరమైన సహాయ సహకారాలను తెలంగాణ ప్రభుత్వం తరపున పూర్తి స్థాయిలో అందించేందుకు సిద్ధంగా ఉన్నామని కేటీఆర్‌ ప్రకటించారు. మంత్రి కేటీఆర్‌ (Minister KTR) సర్ఫేస్‌ మెజర్‌మెంట్‌ సిస్టమ్స్‌ ప్రతినిధులతో సమావేశమైన సమయంలో ఆయన వెంట రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్ రంజన్, తెలంగాణ ప్రభుత్వ లైఫ్ సైన్సెస్ డైరెక్టర్ శక్తి ఎం నాగప్పన్ ఉన్నారు.

Also read : KTR Meets Ranil Jayawardena: బ్రిటన్‌ ట్రేడ్‌ మినిస్టర్‌తో మంత్రి కేటీఆర్‌ భేటీ 

Also read : Minister KTR In London: లండన్‌లో బిజీ బిజీగా కేటీఆర్‌..!!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News