KTR Davos Tour: కేటీఆర్ దావోస్‌ పర్యటన, తెలంగాణకు క్యూ కడుతున్న అంతర్జాతీయ కంపెనీలు

తెలంగాణ ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ దావోస్ పర్యటన విజయవంతంగా కొనసాగుతోంది. వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో రాష్ట్రానికి భారీగా పెట్టుబడులను ఆకర్షిస్తున్నారు మంత్రి కేటీఆర్. ఇప్పటికే పలు అంతర్జాతీయ సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకున్నారు తెలంగాణ అధికారులు . తాజాగా ప్రతిష్టాత్మక సంస్థలు తెలంగాణలో పెట్టుబడులకు ముందుకొచ్చాయి.

Written by - Pradeep | Last Updated : May 27, 2022, 01:47 PM IST
  • తెలంగాణకు భారీగా పెట్టుబడులు
  • క్యూ కడుతున్న అంతర్జాతీయ కంపెనీలు
  • స్టార్టప్‌లకు రాజధానిగా హైదరాబాద్- కేటీఆర్
KTR Davos Tour: కేటీఆర్ దావోస్‌ పర్యటన, తెలంగాణకు క్యూ కడుతున్న అంతర్జాతీయ కంపెనీలు

KTR Davos Tour: తెలంగాణ ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ దావోస్ పర్యటన విజయవంతంగా కొనసాగుతోంది. వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో రాష్ట్రానికి భారీగా పెట్టుబడులను ఆకర్షిస్తున్నారు మంత్రి కేటీఆర్. ఇప్పటికే పలు అంతర్జాతీయ సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకున్నారు తెలంగాణ అధికారులు . తాజాగా ప్రతిష్టాత్మక సంస్థలు తెలంగాణలో పెట్టుబడులకు ముందుకొచ్చాయి.

KTR Davos Tour: దావోస్‌లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సు వేదికగా మరికొన్ని ప్రతిష్టాత్మక సంస్థలు తెలంగాణలో పెట్టబడులకు రెడీ అయ్యాయి. దావోస్‌లో మంత్రి కేటీఆర్ తో సమావేశమయ్యారు హ్యుండై గ్రూప్ సీఐవో యాంగ్చో చి. తెలంగాణలో రూ. 1400 కోట్ల పెట్టుబడులు పెడుతున్నట్లు ప్రకటించారు. తెలంగాణ ఏర్పాటుచేస్తున్న మొబిలిటీ క్లస్టర్‌లో హ్యుండై ఈ పెట్టుబడి పెట్టనుంది. మొబిలిటీ వ్యాలీలో భాగస్వామిగా ఉండేందుకు కూడా హ్యుండై అంగీకరించింది. హ్యుండై ని రాష్ట్రానికి సాదరంగా ఆహ్వానించిన మంత్రి కేటీఆర్... ఇది రాష్ట్ర మొబిలిటీ రంగానికి గొప్ప బలాన్నిస్తుందన్నారు. హ్యుండై రాక మరిన్ని కంపెనీలను ఆకర్షిస్తుందన్నారు.

ఫార్మా కంపెనీలకు అవసరమయ్యే గ్లాస్ రియాక్టర్లు, ఇతర పరికరాలను తయారుచేసే జీఎంఎం ఫాడులర్ సంస్థ కూడా హైదరాబాద్‌లో తన తయారీ కేంద్రాన్ని భారీగా విస్తరించడానికి రెడీ అయ్యింది. హైదరాబాద్ లో ఉన్న తన తయారీ కేంద్రంపై 3.7 మిలియన్ డాలర్ల అదనపు పెట్టుబడి పెట్టబోతోంది. సంస్థ బిజినెస్ సీఈవో థామస్ కేహ్ల్ మంత్రి కేటీఆర్‌తో సమావేశమయ్యారు. తమ విస్తరణ ప్రణాళికను వివరించారు. హైదరాబాద్‌కే తాము మొదటి ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలిపారు. ఫార్మా సిటీ ప్రాజెక్టులో భాగస్వామిగా ఉండటానికి కూడా ఆసక్తి వ్యక్తంచేశారు. తాజా పెట్టుబడితో హైదరాబాద్‌లో కంపెనీ ఉద్యోగుల సంఖ్య 300 కు చేరనుంది. జీఎంఎం ఫాడులర్ సంస్థ నిర్ణయం తనకెంతో సంతోషం కలిగించినట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు. ఫార్మీ పరికరాల తయారీలో నెంబర్‌ వన్‌ గా ఎదగాలనుకున్న సంస్థ లక్ష్యం నెరవేరుతుందని ఆకాంక్షించారు.

స్వీడన్‌కు చెందిన ప్రసిద్ధ EMPE డయాగ్నొస్టిక్స్.... హైదరాబాద్‌లో  క్షయ వ్యాధి (TB) టెస్ట్ కిట్‌లను తయారుచేసే గ్లోబల్ ప్రొడక్షన్ ఫెసిలిటీని ఏర్పాటుచేస్తున్నట్లు ప్రకటించింది. రూ. 25 కోట్ల పెట్టుబడితో జీనోమ్‌ వ్యాలీలో ఈ కేంద్రాన్ని ఏర్పాటుచేయనుంది. దీనిద్వారా నెలకు 20 లక్షల టిబీ టెస్ట్ కిట్‌లను తయారుచేయనుంది సంస్థ. ఈ కిట్‌లను ప్రపంచవ్యాప్తంగా విక్రయించనుంది. అదనంగా మరో యాభైకోట్ల పెట్టుబడితో.. 150 మందికి ప్రత్యక్ష ఉపాధి అవకాశాన్ని కల్పించనుంది. రాబోయే కాలంలో హైదరాబాద్‌ కేంద్రంపై 25 మిలియన్ యూరోలను పెట్టుబడిగా పెట్టాలని EMPE డయాగ్నొస్టిక్స్ ఆలోచిస్తున్నట్లు కంపెనీ వ్యవస్థాపకుడు, సీఈవో డాక్టర్ పవన్ అసలాపురం తెలిపారు. కొవిడ్‌ ప్రభావంతో టీబీ చికిత్స, నివారణలో ప్రపంచం పదేళ్లు వెనక్కి వెళ్లిందన్న డాక్టర్‌ పవన్.. యూరప్‌లో ఈ వ్యాధి చికిత్సకు లొంగని విధంగా తయారవుతోందన్నారు. మానవాళి ఎదుర్కొంటున్న ముప్పును తప్పించేందుకు తమ సంస్థ పనిచేస్తోందన్నారు. సంస్థ చేస్తున్న కృషికి తమ సహకారం ఉంటుందన్నారు కేటీఆర్. 

దావోస్‌లో భారతదేశ ఇన్నొవేషన్ రంగంపై జరిగిన చర్చాగోష్టిలో కేటీఆర్ పాల్గొన్నారు. దేశంలో స్టార్టప్ ఈకో సిస్టం బలోపేతానికి తన అభిప్రాయాలను పంచుకున్నారు. దేశం అత్యంతవేగంగా అభివృద్ధి సాధించాలంటే... ఇన్నొవేషన్ కల్చర్ పెరగాల్సిన అవసరం ఉందన్నారు కేటీఆర్. ప్రతి సమస్యకు పరిష్కారాలు ఇచ్చే శక్తి ఉండాలన్నారు. హైదరాబాద్‌లో ఇన్నొవేషన్ మరింతగా పెంచేందుకు తాము ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాల వల్ల భవిష్యత్తులో హైదరాబాద్ స్టార్టప్‌లకు రాజధానిగా మారుతుందన్న ఆశాభావాన్ని వ్యక్తంచేశారు.

Also read : Minister Ktr Tour: తెలంగాణకు స్టాడ్లర్ రైలు ఫ్యాక్టరీ..కేటీఆర్ సమక్షంలో ఒప్పందాలు..!

Also read : CM Jagan tour: దావోస్‌లో సీఎం జగన్‌ వరుస భేటీలు..పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానం..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News