Telangana Telugu Association: తెలంగాణ తెలుగు అసోసియేషన్ సంబరాల సందడి

Telangana Telugu Association Celebrations: అమెరికాలోని న్యూజెర్సీలో తెలంగాణ తెలుగు అసోసియేషన్‌  సంబరాల సందడి మొదలయ్యింది. మూడు రోజుల పాటు అంగరంగ వైభవంగా ఉత్సవాలు నిర్వహించనున్నారు. ఈ సంబరాల కోసం భారీస్థాయిలో ఏర్పాట్లు చేశారు.

Written by - ZH Telugu Desk | Last Updated : May 27, 2022, 10:39 PM IST
  • న్యూజెర్సీలో తెలంగాణ తెలుగు అసోసియేషన్‌ సంబరాలు
  • ప్రారంభోత్సవ వేడుకల్లో వివిధ రంగాల్లో ప్రతిభావంతులైన వాళ్లకు అవార్డులు
  • ఉత్సవాలకు తెలంగాణ రాష్ట్ర మంత్రులు, ఇతర పార్టీల ప్రముఖ నేతలు
Telangana Telugu Association: తెలంగాణ తెలుగు అసోసియేషన్ సంబరాల సందడి

Telangana Telugu Association Celebrations: అమెరికాలోని న్యూజెర్సీలో తెలంగాణ తెలుగు అసోసియేషన్‌  సంబరాల సందడి మొదలయ్యింది. మూడు రోజుల పాటు అంగరంగ వైభవంగా ఉత్సవాలు నిర్వహించనున్నారు. ఈ సంబరాల కోసం భారీస్థాయిలో ఏర్పాట్లు చేశారు. కాన్ఫరెన్స్‌ కమిటీ కన్వీనర్‌ గనగోని శ్రీనివాస్‌, అధ్యక్షుడు పటోళ్ల మోహన్‌ రెడ్డి పర్యవేక్షణలో కనీవినీ ఎరుగని రీతిలో ఉత్సవాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. న్యూజెర్సీ కన్వెన్షన్‌ సెంటర్‌లో ఈ రాత్రికి బ్యాంక్‌ వెట్‌ కార్యక్రమంతో ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. 

Telangana-Telugu-america-Association-Celebrations-photos-from-new-jersey

ఈ ప్రారంభోత్సవ వేడుకల్లో వివిధ రంగాల్లో ప్రతిభావంతులైన వాళ్లకు అవార్డులు అందజేస్తారు. అనంతరం కోటి బృందంతో మ్యూజికల్‌ నైట్‌ ఏర్పాటు చేశారు. 28వ తేదీ ఉదయం ప్రత్యేక స్వాగత నృత్యం ఉంటుందని, ఆ గాన నృత్యం తెలంగాణ వైభవాన్ని, సంప్రదాయాన్ని ప్రతిబింబించే విధంగా ఉంటుందని ఉత్సవ కమిటీ కన్వీనర్‌ శ్రీనివాస్‌, అధ్యక్షుడు మోహన్‌ రెడ్డి వివరించారు. 

Telangana-Telugu-america-Association-event-Celebrations-photos-from-new-jersey.jpg

ఈ స్వాగత నృత్యాన్ని జొన్నవిత్తుల, వడ్డేపల్లి కృష్ణ కలిసి రూపొందించారని, గీతాన్ని వందేమాతరం శ్రీనివాస్‌ ఆలపించారని వెల్లడించారు. న్యూజెర్సీ గవర్నర్ ఫిల్ మరఫీతోపాటు.. స్థానిక సెనేటర్, మేయర్ ఈ ఉత్సవాలకు ముఖ్య అతిథులుగా హాజరవుతారని వివరించారు. సాంస్కృతిక ప్రదర్శనలు జరిగిన తర్వాత అదే రోజు సాయంత్రం ప్రముఖ సింగర్ సునీత బృందంతో సంగీత విభావరి నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 

Telangana-Telugu-america-Association-Celebrations-pics-from-new-jersey.jpg

అలాగే, రసమయి బాలకిషన్ బృందంతో ప్రత్యేక ప్రదర్శన కూడా రూపొందించినట్లు నిర్వాహకులు చెప్పారు. అంతేకాకుండా.. సినీనటులు, జబర్తస్త్‌ బృందం సభ్యులతో ప్రత్యేక ప్రదర్శనలు ఉంటాయన్నారు. నిఖిల్‌, రితూ వర్మ, అంజలి బృందం ప్రదర్శనలు ఆకట్టుకుంటాయని తెలిపారు.  

Telangana-Telugu-america-Association-Celebrations-in-new-jersey.jpg

ఇక, ఉత్సవాల్లో చివరి రోజైన 29వ తేదీన వేదాద్రి లక్ష్మి నర్సింహ స్వామి కల్యాణం జరుగుతుందన్నారు. స్వామివారి కల్యాణంతో ఆరోజు ఉత్సవాలు ప్రారంభమవుతాయని తెలిపారు. అమెరికాలో తొలిసారి వేదాద్రి లక్ష్మి నర్సింహ స్వామి కల్యాణాన్ని నిర్వహిస్తున్నామని, ఆ అవకాశం తమ వేడుకలకు దక్కడం అదృష్టంగా భావిస్తున్నామన్నారు. 

Telangana-Telugu-america-Association-Celebrations-photos-new-jersey.jpg

ప్రఖ్యాత సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్‌తో అదేరోజు రాత్రి సంగీత విభావరి ఉంటుందని అన్నారు. మూడు రోజుల కార్యక్రమాలకు వ్యాఖ్యాతలుగా ప్రముఖ యాంకర్లు సుమ, రవి వ్యవహరిస్తారని నిర్వాహకులు వివరించారు. 

Telangana-Telugu-america-Association-event-Celebrations-photos-from-new-jersey.jpg

ఈ ఉత్సవాలకు తెలంగాణ రాష్ట్ర మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు (Minister Errabelli Dayakar Rao), తలసాని శ్రీనివాస యాదవ్, జగదీశ్వర్ రెడ్డి, సబితా ఇంద్రారెడ్డిలతో పాటు.. భారతీయ జనతాపార్టీ నేతలు ధర్మపురి అర్వింద్, వివేక్‌ వెంకటస్వామి, డీకె అరుణ, పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి, కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తదితరులు ఉత్సవాలు జరిగిన రోజుల్లో వీలును బట్టి హాజరవుతున్నారని తెలిపారు. ఈ ఉత్సవాల్లో భాగంగా ఐటీ, వాణిజ్యం, మహిళా రాజకీయం, యువత ప్రాధాన్యత, మ్యాట్రిమోనీ తదితర అంశాల్లో సదస్సులు కూడా నిర్వహిస్తున్నామని నిర్వాహకులు శ్రీనివాస్‌, మోహన్‌ రెడ్డి తెలిపారు. ఈ ఉత్సవాల సందర్భంగా తెలంగాణ తెలుగు అసోసియేషన్‌ స్టార్ సింగర్‌ను ప్రకటిస్తామన్నారు.

Also read : KTR Davos Tour: విజయవంతంగా ముగిసిన మంత్రి కేటీఆర్ దావోస్ పర్యటన

Also read : KTR Davos Tour: కేటీఆర్ దావోస్‌ పర్యటన, తెలంగాణకు క్యూ కడుతున్న అంతర్జాతీయ కంపెనీలు

Also read : Hyderabad As Life Sciences Capital: లైఫ్‌ సైన్సెస్‌ క్యాపిటల్‌గా హైదరాబాద్.. దావోస్‌‌లో మంత్రి కేటీఆర్‌

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News