Telangana Formation Day: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు ఇక్కడే కాదు.. ఖండాంతరాల అవతల కూడా ఘనంగా నిర్వహించారు. కెనడాలోనూ సందడిగా జరుపుకున్నారు. టీఆర్‌ఎస్ ఎన్నారై విభాగం ఆధ్వర్యంలో ఈ ఉత్సవాలు ఘనంగా జరిగాయి. టీఆర్‌ఎస్ ఎన్నారై కెనడా విభాగం అధ్యక్షుడు కృష్ణ కోమండ్ల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు నిర్వహించారు.
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కెనడాలోని పలువురు ఎన్నారైలు టీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. కృష్ణ కోమండ్ల వీరికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా కృష్ణ మాట్లాడుతూ.. పద్నాలుగేళ్లపాటు ప్రాణాలు కూడా లెక్క చేయకుండా పోరాడి అరవై ఏళ్ల స్వరాష్ట్ర ఆకాంక్ష నెరవేర్చిన ఘనత కేసీఆర్‌ది, టీఆర్‌ఎస్ పార్టీది అన్నారు. మఖలో పుట్టి పుబ్బలో పోతోందంటూ టీఆర్‌ఎస్‌పై చాలామంది ఎగతాళి చేసినా, కేసీఆర్ మాత్రం తన చాణక్యనీతితో ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించారన్నారు.
తెలంగాణ రాష్ట్రం కోసం యువకులు చేసిన ప్రాణత్యాగం వెలకట్టలేనిదన్నారు. దాదాపు 1200 మంది విద్యార్థులు, యువకులు బలయ్యారని పోరాటాన్ని గుర్తు చేసుకున్నారు. ఎవరు ఎన్ని ఆటంకాలు సృష్టించినా అదరకుండా, బెదరకుండా టీఆర్‌ఎస్ పార్టీ పోరాడిందన్నారు. మంత్రి కేటీఆర్ చొరవతో అనేక కంపెనీలు తెలంగాణలో పెట్టుబడులు పెట్టాయన్నారు. ఫలితంగా యువతకు వేలాది ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభించాయన్నారు.
Also Read: Revanth reddy in America: డల్లాస్‌లో సందడిగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు,హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook