British Airways: హైదరాబాద్-లండన్ విమానాల్లో తెలుగు మాట్లాడే సిబ్బంది నియామకం...

Telugu Speaking Crew in Hyd-London Flights: హైదరాబాద్-లండన్ హీత్రో మధ్య నడిచే బ్రిటీష్ ఎయిర్‌వేస్ విమానాల్లో 20 మంది తెలుగు మాట్లాడే కేబిన్ సిబ్బందిని నియమించినట్లు ఆ సంస్థ శనివారం (మే 21) వెల్లడించింది.   

Written by - ZH Telugu Desk | Last Updated : May 23, 2022, 12:41 AM IST
  • బ్రిటిష్‌ ఎయిర్‌వేస్‌ కీలక నిర్ణయం
  • హైదరాబాద్-లండన్ విమానాల్లో తెలుగు మాట్లాడే సిబ్బంది నియామకం
  • 20 మంది తెలుగు మాట్లాడే సిబ్బందిని నియమించినట్లు వెల్లడి
British Airways: హైదరాబాద్-లండన్ విమానాల్లో తెలుగు మాట్లాడే సిబ్బంది నియామకం...

Telugu Speaking Crew in Hyd-London Flights: హైదరాబాద్-లండన్ హీత్రో మధ్య నడిచే బ్రిటీష్ ఎయిర్‌వేస్ విమానాల్లో 20 మంది తెలుగు మాట్లాడే కేబిన్ సిబ్బందిని నియమించినట్లు ఆ సంస్థ శనివారం (మే 21) వెల్లడించింది. విమానంలో తెలుగు మాట్లాడే సిబ్బందితో హైదరాబాద్-లండన్ మధ్య రాకపోకలు సాగించే ప్రయాణికులు ప్రయాణాన్ని మరింత సౌకర్యవంతంగా ఫీలవుతారని పేర్కొంది. హైదరాబాద్-లండన్ మధ్య రాకపోకలు సాగించే ప్రతీ బ్రిటీష్ ఎయిర్‌వేస్ విమానంలో తెలుగు మాట్లాడే సిబ్బంది తప్పకుండా ఉంటారని తెలిపింది.

కొత్తగా నియమించబడిన 20 మంది తెలుగు సిబ్బంది ఇటీవలే లండన్‌లో ఆరు వారాల శిక్షణ పూర్తి చేసుకున్నట్లు బ్రిటీష్ ఎయిర్‌వేస్ వెల్లడించింది. విమాన భద్రత, ప్రయాణికులకు అందించాల్సిన సేవలపై ఈ 20 మందికి బ్రిటీష్ ఎయిర్‌వేస్ సంస్థనే ట్రైనింగ్‌ ఇచ్చింది. ఈ సిబ్బందితోనే హైదరాబాద్‌ నుంచి లండన్‌కు తొలి విమాన సర్వీసును  శనివారం నడిపింది. 

ప్రస్తుతం హైదరాబాద్‌తో పాటు ఢిల్లీ, ముంబై, బెంగళూరు, చెన్నైల నుంచి లండన్‌లోని హీత్రో ఎయిర్‌పోర్టుకు వారానికి 28 విమాన సర్వీసులను బ్రిటిష్ ఎయిర్‌వేస్‌ సంస్థ నడిపిస్తోంది. ఈ నగరాల్లో స్థానిక భాష మాట్లాడే వాళ్లను క్రూ సిబ్బందిగా నియమించాలని బ్రిటిష్‌ ఎయిర్‌వేస్‌ మూడేళ్లక్రితమే నిర్ణయించింది. అయితే, కరోనా కారణంగా దీన్ని ముందుకు తీసుకెళ్లడంలో జాప్యం జరిగింది. ఎట్టకేలకు హైదరాబాద్‌-లండన్ సర్వీసుకు పూర్తిస్థాయి స్థానిక భాష మాట్లాడే క్రూ సిబ్బందిని నియమించింది. ఇక, మిగతా నగరాల్లోని సర్వీసులకు కూడా స్థానిక భాష మాట్లాడేవారిని బ్రిటీష్ ఎయిర్‌వేస్ త్వరలోనే నియమించవచ్చు. 

 

Also Read: Omicron: దేశంలో ఒమిక్రాన్ కొత్త వేరియంట్స్... తమిళనాడులో బీఏ.4, తెలంగాణలో బీఏ.5 వేరియంట్ గుర్తింపు..   

Also Read: Amazon Offer: అమెజాన్ బంపరాఫర్.. ల్యాప్‌టాప్స్, ట్యాబ్లెట్స్, స్పీకర్స్ ఇంకా మరెన్నో వాటిపై భారీ డిస్కౌంట్ 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook 

Trending News