AP CM To Davos: దావోస్‌కి ఏపీ సీఎం వైఎస్ జగన్.. ఇండస్ట్రియలైజేషన్‌ 4.0పై ఫోకస్

YS Jagan to World Economic Forum: దావోస్‌లో జరగనున్న ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సుకు ఏపీ సీఎం వైఎస్ జగన్ హాజరు కానున్నారు. నాలుగో పారిశ్రామిక విప్లవం దిశగా వేయాల్సిన అడుగులపైనా దావోస్‌ వేదికగా ఏపీ ప్రభుత్వ యంత్రాంగం కీలక చర్చలు చేపట్టనుంది.

Written by - ZH Telugu Desk | Last Updated : May 19, 2022, 10:47 PM IST
  • దావోస్‌కు జగన్‌ సహా అధికారుల బృందం
    రాష్ట్రంలో పారిశ్రామిక ప్రగతిని వివరించే యత్నం
    వరల్డ్‌ ఎకనమిక్‌ ఫోరం సదస్సులో ఏపీ పెవిలియన్‌
    పీపుల్‌ – ప్రోగ్రెస్‌ – పాజిబిలిటీస్‌ నినాదంతో పెవిలియన్‌
    నాలుగో పారిశ్రామిక విప్లవం దిశగా అడుగులు
AP CM To Davos: దావోస్‌కి ఏపీ సీఎం వైఎస్ జగన్.. ఇండస్ట్రియలైజేషన్‌ 4.0పై ఫోకస్

YS Jagan to attend World Economic Forum: స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో జరగనున్న ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సుకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ యంత్రాంగం సన్నద్ధమవుతోంది. ఇండస్ట్రియలైజేషన్‌ 4.0కు సరైన వేదికగా నిలిచే దిశగా రాష్ట్రంలోని వనరులు, ఇక్కడున్న అవకాశాలను కూడా వరల్డ్‌ ఎకనమిక్‌ ఫోరం సదస్సులో సీఎం జగన్‌తో పాటు.. పారిశ్రామిక విభాగం అధికారులు వివరించనున్నారు. ఏపీలో ఏర్పాటవుతున్న పరిశ్రమలకు కల్పిస్తున్న మౌలిక సదుపాయాల గురించి దావోస్‌ సదస్సు చర్చల్లో వివరించేందుకు సమాయత్తమయ్యారు. విశాఖ, కాకినాడ, కృష్ణపట్నం పోర్టులకుతోడు.. రామాయపట్నం, మచిలీపట్నం, కాకినాడ, భావనపాడులలో ఎస్‌ఈజెడ్‌ పోర్టుల నిర్మాణం, అలాగే, కొత్తగా మరో మూడు విమానాశ్రయాల అభివృద్ధి వంటి పరిణామాలు ఇండస్ట్రియలైజేషన్‌ 4.0 (నాలుగో పారిశ్రామిక విప్లవం)కు ఏ రకంగా దోహదపడతాయో అంతర్జాతీయ పారిశ్రామిక వేత్తలకు వివరించనున్నారు. సుశిక్షితులైన మానవ వనరుల కారణంగా నైపుణ్యాలను అభివృద్ధి చేస్తున్న తీరును కూడా దావోస్‌ సదస్సులో వివరిస్తారు.

దావోస్ వేదికపై ఏపీ సర్కారు ప్రణాళికలు, లక్ష్యాలు..
రాష్ట్రంలో అమలవుతున్న పారిశ్రామిక వ్యూహాల్లో తేవాల్సిన మార్పులపై దావోస్‌ వేదికగా ఏపీ సర్కారు దృష్టి సారించే అవకాశం ఉంది. నేరుగా ప్రజలకు ఇంటి గుమ్మం వద్దకే ఉత్పత్తులు చేరవేసే విధానాన్ని మరింత బలోపేతం చేయడం, డిజిటలైజేషన్‌తో వాటిని అనుసంధానించడం, ఏపీలో ఉత్పత్తి రంగాన్ని మరింత అభివృద్ధి చేయడం, ఎగుమతులకు అవసరమైన నాణ్యతతో కూడిన ఉత్పత్తులు తయారుచేసేందుకు అవసరమైన నైపుణ్యాలను వృద్ధి చేయడం వంటి అంశాలపై అత్యుత్తమ సంస్థల భాగస్వామ్యంపైనా ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో ఏపీ ప్రభుత్వం దృష్టిపెట్టనుంది. ఈ ప్రతిపాదనలను ప్రపంచస్థాయి పారిశ్రామిక వేత్తల దృష్టికి తీసుకెళ్లే లక్ష్యంతో, ఏపీ సర్కారు ప్రణాళికలు, లక్ష్యాలను వివరిస్తూ దావోస్‌లో ప్రత్యేక పెవిలియన్‌ను ఏపీ సర్కారు ఏర్పాటు చేసింది. 

పీపుల్‌ – ప్రోగ్రెస్‌ – పాజిబిలిటీస్‌...
పీపుల్‌ – ప్రోగ్రెస్‌ – పాజిబిలిటీస్‌ అనే నినాదంతో ఈ పెవిలియన్‌ను నిర్వహిస్తోంది. రెండేళ్ల కోవిడ్‌ విపత్తు తర్వాత ప్రత్యక్షంగా జరుగుతోన్న వరల్డ్‌ఎకనామిక్‌ ఫోరం సదస్సులో పాల్గొనేందుకు ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌తో పాటు మంత్రులు, అధికారుల బృందం దావోస్‌కు వెళ్తున్నారు. 

దావోస్‌ వేదికగా ఏపీ ప్రభుత్వ యంత్రాంగం కీలక చర్చలు
ఈనెల 22 నుంచి 26వ తేదీ వరకు ఈ సదస్సు జరుగుతుంది. కొవిడ్‌ వంటి విపత్తులు ఎదురైనప్పటికీ.. ఆయా రంగాల్లో ఏపీలో సాధించిన ప్రగతిని దావోస్‌ వేదికగా వినిపించనున్నారు. నాలుగో పారిశ్రామిక విప్లవం దిశగా వేయాల్సిన అడుగులపైనా దావోస్‌ వేదికగా ఏపీ ప్రభుత్వ యంత్రాంగం కీలక చర్చలు చేపట్టనుంది. కొవిడ్‌ నియంత్రణ కోసం ఏపీలో అమలు చేసిన ట్రేసింగ్, టెస్టింగ్, ట్రీట్‌మెంట్‌ విధానాన్ని కూడా ఏపీ అధికారుల బృందం ప్రత్యేకంగా ప్రస్తావించనున్నారు. సీఎం వైఎస్ జగన్ (AP CM YS Jagan) పరిపాలనలో తెచ్చిన విప్లవాత్మక మార్పులను వెల్లడించనున్నారు.

Also read : KTR in London Tour: బ్రిటన్‌లో కేటీఆర్‌ వరుస భేటీలు.. ఏరోనాటికల్ యూనివర్సిటీ ఏర్పాటు దిశగా చర్చలు

Also read : UK Pharmaceutical Firm: తెలంగాణలో మరో అంతర్జాతీయ ఫార్మా సంస్థ పెట్టుబడులు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News