KTR Tour In London: తెలంగాణ తల్లి రుణం తీర్చుకోవడానికి, రాష్ట్ర అభివృద్ధిలో ప్రభుత్వంతో కలసిరావాలని ఎన్నారైలకు పిలుపునిచ్చారు మంత్రి కేటీఆర్. పెట్టుబడుల సాధనే లక్ష్యంగా లండన్‌లో పర్యటిస్తున్న కేటీఆర్... ప్రవాస తెలంగాణ సంఘాలు ఏర్పాటుచేసిన మీట్ అండ్ గ్రీట్ లో పాల్గొన్నారు. తెలంగాణలో విరివిగా పెట్టుబడులు పెట్టాలని విజ్ఞప్తిచేశారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఎలాంటి స్ఫూర్తిని చూపారో... అభివృద్ధిలోనూ అలా కలసిరావాలన్నారు. ప్రపంచంలో ఎక్కడకు వెళ్లినా తెలంగాణాన్నే వినిపిస్తున్న ఎన్నారైలను ఆయన ప్రశంసించారు. రాష్ట్రంలో కంపెనీలు స్థాపించి సంపద సృష్టించాలని కోరారు. హైదరాబాద్ తో పాటు ఇతర నగరాలు, పట్టణాల్లోనూ పెట్టుబడులు పెట్టి యువతకు ఉపాధి కల్పించాలన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక అభివృద్ధి వికేంద్రీకరణ జరిగిందని... అందులో భాగంగానే వరంగల్‌లో ఐటీతో పాటు ఇతర పరిశ్రమలు విజయవంతంగా కొనసాగుతున్నట్లు చెప్పారు. ఖమ్మం, కరీంనగర్ లో ఐటీ టవర్స్ స్థాపించామన్నారు. త్వరలోనే మహబూబ్‌నగర్ లోనూ ఐటీ పరిశ్రమలు ప్రారంభంకాబోతున్నట్లు తెలిపారు కేటీఆర్.
స్వరాష్ట్రం ఏర్పాటయ్యాక తెలంగాణ ఎన్నో విజయాలు సాధించిందన్నారు మంత్రి కేటీఆర్. సీఎం కేసీఆర్ ముందుచూపుతో కరెంటు కొరత లేకుండా పోయిందన్నారు. స్టార్టప్‌గా మొదలైన తెలంగాణ ఇప్పుడు విజయపథంలో కొనసాగుతోందన్నారు. రాష్ట్రం ఏర్పాటైనప్పుడు 5 లక్షల 60 వేలు ఉన్న జీడీపీ.... ఇప్పుడు 11 లక్షల 54 వేలకు చేరిందన్నారు. జనాభాలో 12వ స్థానంలో ఉన్న తెలంగాణ....ఆర్బీఐ నివేదిక ప్రకారం భారత ఆర్థిక వ్యవస్థలో 4వ స్థానంలో ఉందన్నారు. సుస్థిరపాలన, శాంతియుత వాతావరణం వల్ల పెద్ద ఎత్తున పెట్టుబడులు తరలివస్తున్నాయన్నారు కేటీఆర్. గూగుల్, అమేజాన్, ఫేస్‌బుక్ వంటి అతిపెద్ద కంపెనీలు హైదరాబాద్‌లో తమ క్యాంపస్‌లను స్థాపించాయన్నారు. లండన్ పర్యటనలో పారిశ్రామికవేత్తలతో తాను జరిపిన సమావేశాలు సంతృప్తిగా జరిగాయని.. త్వరలోనే వాటి ఫలితాలు కనిపిస్తాయని తెలిపారు కేటీఆర్. రానున్న కాలంలో యూకేతో తెలంగాణ సంబంధాలు మరింత బలోపేతమవుతాయన్న నమ్మకం ఉందన్నారు.
లండన్ పర్యటనలో భాగంగా టీఆర్ఎస్ ఎన్‌ఆర్‌ఐ యూకే అధ్యక్షులు అనిల్ కూర్మాచలం ఇంటికి వెళ్లారు కేటీఆర్. దశాబ్దకాలంగా లండన్ కేంద్రంగా టీఆర్ఎస్ పార్టీ కోసం పనిచేస్తున్న ఆయన్ని అభినందించారు. ఈ సందర్భంగా కేటీఆర్ కు అనిల్ కూర్మాచలం కుటుంబసభ్యులు సాదర ఆహ్వానం పలికారు. తెలంగాణ ఉద్యమం, టీఆర్ఎస్ పార్టీ కోసం ఎన్నారై శాఖ చేపట్టిన కార్యక్రమాలను కేటీఆర్ కు వివరించారు. బతుకమ్మ విశేషాలను వివరిస్తూ అనిల్ కూర్మాచలం కూతురు నిత్య క్వీన్ ఎలిజబెత్ కు లేఖ రాసిందని.. క్వీన్ నుంచి ప్రశంసలు అందుకుందని తెలిసి నిత్యను ప్రత్యేకంగా అభినందించారు కేటీఆర్. విదేశాల్లో ఉంటూ తెలంగాణ గడ్డ పై చూపిస్తున్న ప్రేమను అభినందించారు.
also read: Revanth Reddy: కొత్త నియోజకవర్గంపై రేవంత్ రెడ్డి ఫోకస్.. పోటీ అక్కడి నుంచేనా?
also read: Pawan Kalyan: బీజేపీతో పొత్తు లేనట్టేనా! జనసేన గెలిచే సీట్లు ఇవేనా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.