Success Story of jyothi labs head: కొంతమంది ఉద్యోగాలు చేయడానికి ఇష్టపడతారు. మరికొంతమందికి వ్యాపారం చేయడం ఇష్టం ఎందుకంటే వ్యాపారంలో స్థిరమైన లాభాలు ఉండవు. అలా అని స్థిరమైన నష్టాలు కూడా ఉండవు. అందుకే చిన్ని వ్యాపారంతో ప్రారంభించి కొంతమంది అరుదైన వ్యక్తులు కోట్లకు పడగలెత్తుతారు. ఆ కోవాకు చెందిన వారే కేరళకు చెందిన మూతేదత్ పంజన్ రామచంద్రన్. ప్రస్తుతం మన ఇళ్లలో వినియోగిస్తున్న ఉజాలా బ్రాండ్ అధినేత. కేవలం రూ. 5 వేలతో ప్రారంభమైన ఈయన వ్యాపారం రూ. 16,900 కోట్లకు ఎలా అధిపతి అయ్యారో తెలుసుకుందాం. ఇలాంటి వ్యక్తులను మనం చాలా అరుదుగా చూసి ఉంటాం. ఆయన ఎన్నో రోజులపాటు చేసిన కృషికి నేడు తగిన గుర్తింపు లభించింది.
ఉద్యోగంలో అయితే, కేవలం స్థిరమైన ఆదాయం మాత్రమే వస్తుందని వ్యాపారాలు పెట్టి డబ్బు నష్టపోయినవారిని చూశాం. ఎంపీ రామచంద్రన్ కూడా బీకామ్ పూర్తి చేయగానే అకౌంటెంట్‌గా జాబ్ చేశారు. కానీ, ఆయనకు అందులో సంతృప్తి కలగలేదు. ఏదైనా చేయాలనే తపన ఆయనలో మొదలైంది. స్వంత వ్యాపారం పెట్టి తనదైన మార్క్‌ను చూపించుకోవాలని తహతహలాడేవాడట. ఈ నేపథ్యంలోనే ఆయన తెల్ల బట్టలకు మరింత మెరుపును అందించే ఫ్యాబ్రిక్ వైటెనర్ ఉజాలాను ఈ లోకానికి పరిచయం చేశారు. మొదటగా ఆయన ఏ వ్యాపారం పెట్టాలనే సందిగ్ధంలో ఉండేవారట. ఒకానొక యాడ్‌లో పర్పుల్ రంగు తెల్లని వస్త్రాలను మరింత తెలుపు చేసే గుణం కలిగి ఉంటుందనే యాడ్ చూశారట. దీంతో కొన్ని రోజులపాటు ప్రయత్నం చేశాడు అయినా ఫలించలేదు. ఇలా దాదాపు ఏడాది పాటు రామచంద్రన్ చేసిన కృషి ఎట్టకేలకు ఫలించింది. ఉజాలా చకాచకా మెరుపులా మన ముందుకు వచ్చింది.
ఇదీ చదవండి: పాలను ఇలా వాడితే మీ ముఖం మిలమిలా మెరిసిపోతుంది..
రూ. 5 వేలు కూడా లేవు..
అయితే, అప్పుడు అసలు కథ మొదలైంది. ఎంపీ రామచంద్రన్ పుట్టింది కేరళలోని త్రిస్సూర్‌లో విద్యాభ్యాసం కూడా అక్కడే థామస్ కాలేజీలో పూర్తిచేశాడు. ఇదంతా జరిగింది 1983 సమయంలో అయితే, వ్యాపారం ప్రారంభించడానికి అన్ని ఉన్నా దానికి సరిపడా నిధులు రామచంద్రన్ దగ్గరలేవు. దీంతో ఏం చేయలేని పరిస్థితిలో ఉన్న సమయంలో ఆయన సోదరుడు వద్ద నుంచి రామచంద్రన్‌కు రూ. 5000 అప్పు పుట్టింది. దీంతో వెంటనే తన కూతురు పేరుపై జ్యోతి ల్యాబ్స్‌ను ప్రారంభించాడు రామచంద్రన్. అక్కడి నుంచి మొదలైన ఆయన ప్రస్థానం నేటికి కోట్లకు పడగలెత్తి భారతదేశంలో ఓ ప్రముఖ కంపెనీగా ఎదిగింది. ఈయన తయారు చేసిన ఉజాలా బ్రాండ్ దేశంలోని ప్రతి గడపగడపకు చేరింది. ఆయన ప్రస్తుతం రూ. 16,900 కోట్లకు అధిపతిగా మారారు. ప్రస్తుతం జ్యోతి ల్యాబ్స్ మన దేశంలోని అగ్ర సంస్థల్లో ఒకటిగా మారింది.
ఇదీ చదవండి: రోజూరాత్రి పడుకునేముందు ఈ ఒక్క ఆయిల్‌తో మీ ముఖం మసాజ్ చేయండి.. హిరోయిన్ వంటి అందం మీదే..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter