గత రెండు రోజులుగా దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు తగ్గుముఖం పట్టాయి, కానీ కోవిడ్19 మరణాలు మాత్రం ఆందోళన రేకెత్తిస్తున్నాయి. కరోనా కేసులు తగ్గుతున్నా, ప్రతిరోజూ 4 వేలకు పైగా కరోనా మరణాలు నమోదవుతున్నాయి. తమిళనాడులోనూ కరోనా తీవ్రత అధికంగా ఉంది. అయితే ఇటీవల ఏర్పడిన కొత్త ప్రభుత్వానికి కోలీవుడ్ నుంచి మద్దతు పెరుగుతోంది. నటీనటులు ఒక్కొక్కరుగా విరాళాలు అందిస్తూ కరోనాపై పోరాటంలో తమవంతు విరాళాలు అందజేస్తున్నారు.
ఇటీవల సూర్య, కార్తీ బ్రదర్స్ కరోనాపై పోరాటానికిగానూ తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ను కలుసుకుని విరాళం చెక్కును అందించారు. ఆపై శివకార్తికేయన్ సైతం రూ.25 లక్షల మేర భారీగా విరాళం ప్రకటించారు. తాజాగా ఈ జాబితాలో కోలీవుడ్ సూపర్‌స్టార్ రజనీకాంత్(Rajinikanth), చియాన్ విక్రమ్ చేరిపోయారు. ఇటీవల రజనీ కూతురు సౌందర్య రజనీకాంత్, ఆమె భర్త సీఎం స్టాలిన్‌ను కలిసి రూ.1 కోటి రూపాయాలు సీఎం రిలీఫ్ ఫండ్‌కు అందించారు. తాజాగా రజనీకాంత్ సీఎం స్టాలిన్‌ను కలిసి సీఎం రిలీఫ్ ఫండ్‌కు తన వంతుగా రూ.50 లక్షలు విరాళంగా ఇచ్చారు.
Superstar @rajinikanth met Hon’ble Chief Minister of TN, @mkstalin and handed over a cheque of Rs 50 Lakhs#TNCMPublicRelieffund #CoronaRelieffund pic.twitter.com/bXjpoqj8v3
— BARaju (@baraju_SuperHit) May 17, 2021
తమిళనాడులో నూతన ప్రభుత్వ ఏర్పాటైన తరువాత మార్పులు కనిపిస్తున్నాయి. నటీనటుల విరాళాలతో కోవిడ్19 కిట్లు, ఆక్సిజన్ సిలిండర్ల కొనుగోలులో తమ వంతుగా ఆర్థిక చేయూత అందిస్తూ భాగస్వాములు అవుతున్నారు. మరో సీనియర్ నటుడు విక్రమ్ కరోనాపై పోరాటంలో భాగంగా సీఎం రిలీఫ్ ఫండ్‌కు తనవంతు సాయం అందించారు. ఆన్లైన్ ద్వారా రూ.30లక్షలు తమిళనాడు సీఎం రిలీఫ్ ఫండ్‌కు ఆన్లైన్లో ట్రాన్స్ఫర్ చేశారు. ఈ విషయాన్ని టాలీవుడ్ ప్రముఖ పీఆర్వో బీఏ రాజు సైతం స్పష్టం చేస్తూ ట్వీట్ చేశారు.