CHIRANJEEVI: మెగాస్టార్ చిరంజీవి పొలిటికల్ రీ ఎంట్రీకి సిద్దమవుతున్నట్టు తెలుస్తోంది. ఆయన త్వరలోనే కషాయ కండువా కప్పుకునేందుకు రెడీ అవుతున్నట్టు సమాచారం. ఇప్పటికే ఓ దఫా చర్చలు కూడా పూర్తయినట్టు ఢిల్లీలో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఈ చర్చలను పూర్తి చేసినట్టు తెలుస్తోంది. ఇక మెగాస్టార్ చిరంజీవి కమలం కండువా కప్పుకోగానే ఆయన కేంద్రంలో ఓ కీలక పదవి కూడా దక్కబోతున్నట్టు సమాచారం. మెగాస్టార్‌ను రాజ్యసభకు పంపించి పొలిటికల్‌గా మరోసారి యాక్టివ్ చేయాలని కాషాయ పెద్దలు లెక్కలు వేసుకుంటున్నట్టు ప్రచారం జరుగుతోంది..
వాస్తవానికి మెగాస్టార్ చిరంజీవికి రాజకీయాలు కొత్తేం కాదు. గతంలో ఆయన ప్రజారాజ్యం పార్టీని స్థాపించారు. 2009 అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి రాష్ట్రంలో ప్రజారాజ్యం పార్టీ ప్రభంజనం సృష్టించింది. ఆ ఎన్నికల్లో 18 చోట్ల విజయం సాధించింది. కానీ ముఖ్యమంత్రి అవుదామని పాలిటిక్స్‌లోకి వచ్చిన చిరంజీవి కల మాత్రం నెరవేరలేదు. ఆ తర్వాత ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశారు చిరంజీవి.. ఆ విలీనం తర్వాత ఆయనకు కేంద్రమంత్రి పదవినిచ్చి గౌరవించుకుంది కాంగ్రెస్ పార్టీ. ఆ తర్వాత దేశంలో కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడం కేంద్రంలో కమలం పార్టీ అధికారంలోకి రావడం చకచక జరిగిపోయింది. అయితే కేంద్రమంత్రి పదవి కోల్పోయాక రాజకీయాల్ని పక్కన పెట్టేసినా మెగాస్టార్.. తిరిగి సినిమాల్లో బిజిబిజి అయిపోయారు..
ఇటీవల ఆంధ్రప్రదేశ్‌లో కూటమి సర్కార్ అధికారంలోకి రావడంతో మెగాస్టార్ పొలిటికల్ రీ ఎంట్రీపై రకరకాల ఊహగానాలు వినిపిస్తున్నాయి. అందుకు కారణం పవర్ స్టార్ పవన్ కల్యాణే.. ప్రస్తుతం ఏపీలో డిప్యూటీ సీఎంగా పవన్ కల్యాణ్ కొనసాగుతున్నారు. ఆయన ఇటు రాష్ట్రంలో కీలకంగా ఉంటూ.. కేంద్రంతోనూ చాలా క్లోజ్‌గా మూవ్ అవుతున్నారు. అటు ప్రధాని మోడీ కూడా పవన్ కల్యాణ్ అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారు. పవన్ ఢిల్లీ వెళితే కేంద్ర మంత్రులు కూడా రాచమర్యదలు పలుకుతున్నారు. దాంతో పవన్‌ను తమ ఫ్యూచర్ స్టార్ కొందరు బీజేపీ నేతలు చెప్పుకుంటున్నారు. అంతేకాదు పవన్‌కల్యాణ్‌తో పాటు.. మెగాస్టార్ చిరంజీవికి కూడా పొలిటికల్‌గా యాక్టివ్ చేయించాలని కమలం పెద్దలు భావిస్తున్నారట. అందుకే పవన్‌తో పాటు చిరంజీవికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారని టాక్..
తాజాగా కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఢిల్లీ అధికారిక నివాసంలో సంక్రాంతి వేడుకలు గ్రాండ్‌గా జరిగాయి. ఈ వేడుకలకు మెగాస్టార్ చిరంజీవిని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ప్రత్యేకంగా ఆహ్వానించినట్టు తెలుస్తోంది. ఈ వేడుకలకు ముఖ్య అథితిగా హాజరైన ప్రధాని మోడీకి కిషన్ రెడ్డితో పాటు.. మెగాస్టార్ చిరంజీవి దగ్గరుండి మరి ఆహ్వానం పలికారు. ఈ వేడుకల్లో ప్రధాని మోడీ చిరంజీవితో సంభాషిస్తున్న దృష్యాలు హైలెట్‌గా నిలిచాయి. ప్రధాని మోడీ చిరంజీవితో ఏం మాట్లాడినట్టు పొలిటికల్ రీ ఎంట్రీపైన ఏమైనా చర్చించారా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ ఏడాది ఆంధ్రప్రదేశ్‌లో సీఎం చంద్రబాబు, పవన్ కల్యాణ్ ప్రమాణ స్వీకారోత్సవం రోజున చిరంజీవి, పవన్ కల్యాణ్‌తో మోడీ అత్యంత సన్నిహితంగా మెలిగారు. అప్పుడే చిరంజీవికి గ్రీన్ సిగ్నల్ వచ్చిందనే ప్రచారం సాగింది. ఇప్పుడయితే ఏకంగా చిరంజీవి ఢిల్లీకి వెళ్లడం.. ప్రధాని మోడీని కలవడంతో.. పార్టీలో చేరికపై ఫుల్ క్లారిటీ వచ్చేసినట్టేనని పొలిటికల్ సర్కిల్స్‌లో జోరుగా ప్రచారం సాగుతోంది..
Also Read: Chandrababu Tour: వైఎస్ జగన్ అడ్డాలో సీఎం చంద్రబాబు.. రేపు ఏం జరగనుంది?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.