Vizag Steel Plant: ఆంధ్ర ప్రదేశ్ కు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. విశాఖ స్టీల్ ప్లాంట్ కి ఏకంగా రూ. 11,500 కోట్లు ఆర్థిక ప్యాకేజీని కేంద్ర ప్రభుత్వం ప్రకటించనుంది. దీనిని అధికారికంగా అతి త్వరలో ప్రకటించనున్నారు. తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉన్న ఉక్కు కర్మాగారాన్ని ఆదుకునే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఇందుకోసం రూ.11,500 కోట్ల ఆర్థిక ప్యాకేజీ సమకూర్చడానికి నిర్ణయించినట్లు తెలిసింది. ఈ నిర్ణయానికి గురువారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో జరిగిన ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ సమావేశం ఆమోదముద్ర వేసినట్లు తెలుస్తోంది.
కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ మంత్రి హెచ్‌డీ కుమారస్వామి, పౌరవిమానయానశాఖ మంత్రి రామ్మోహన్‌నాయుడు దీనిపై అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఎన్నికల సందర్భంగా విశాఖ ఉక్కుపరిశ్రమ ప్రైవేటీకరణను అడ్డుకుంటామని కూటమి పార్టీలు హామీ ఇచ్చాయి. ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ డిల్లీ వెళ్లి నప్పుడల్లా దీనిపై కేంద్ర పెద్దలతో చర్చించారు. చివరికి కేంద్రం పరిశ్రమ ప్రైవేటీకరించేందుకు బదులు ఆదుకునేందుకు ప్యాకేజీ ప్రకటించనుంది. విభిన్న కోణాల్లో చర్చించిన అనంతరం కేంద్ర ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ ఈ ప్యాకేజీకి ఆమోదం తెలిపినట్లు తెలుస్తోంది.
ఏటా 7.3 మిలియన్ టన్నుల ఉక్కు ఉత్పత్తి సామర్థ్యమున్న విశాఖ ఉక్కు కర్మాగారం 2023-24లో 4 వేల 848.86 కోట్ల నష్టాన్ని మూటగట్టుకొంది. వర్కింగ్ క్యాపిటల్ కోసం చేసిన అప్పులు పెరగడం దీనికి ప్రధాన కారణం. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఎన్డీయే కూటమి అధికారంలోకి రావడంతో స్టీల్ ప్లాంట్‌పై ప్రత్యేక దృష్టి సారించారు. కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి ప్లాంటును సందర్శించారు. ప్లాంటు నిలదొక్కుకోవడానికి రూ.18 వేల కోట్లు అవసరమని కేంద్రానికి కార్మికులు తెలిపారు. ఆ తర్వాత కొన్ని రోజులకే కేంద్ర ఉక్కుశాఖ ఎమర్జెన్సీ అడ్వాన్స్ ఫండ్ కింద.. జీఎస్టీ చెల్లింపులకు రూ.500 కోట్లు, ముడిసరకుకు సంబంధించి బ్యాంకు అప్పుల చెల్లింపులకు రూ.1,150 కోట్ల చొప్పున రెండు విడతల్లో కేంద్రం సాయం చేసింది.
వర్కింగ్ క్యాపిటల్ కోసం చేసిన అప్పుల భారం, తగినంత ముడిసరకు లేకపోవడం, కోర్టు ఎటాచ్‌మెంట్లు, ఇన్‌సాల్వెన్సీ ప్రొసీడింగ్స్‌తో విశాఖ ఉక్కు కర్మాగారం తీవ్ర ఇబ్బందుల్లో ఉంది. వీటిని తీర్చడంతోపాటు భవిష్యత్తులో తలెత్తే కష్టాల నుంచి తప్పించడానికి ఒక సమగ్ర ప్రణాళికను తయారు చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ఇదివరకే పార్లమెంటు స్థాయీసంఘానికి చెప్పింది. దానిపై త్వరగా నిర్ణయం తీసుకోవాలని ఆ సంఘం పార్లమెంటుకు సమర్పించిన నివేదికలో సిఫార్సు చేసింది. దాని ప్రకారమే కేంద్ర ప్రభుత్వం ఈ ఆర్థిక ప్యాకేజీకి ఆమోదముద్ర వేసినట్లు తెలుస్తోంది. మొత్తం ప్యాకేజీ విధివిధానాలు ఎలా ఉంటాయన్నది కేంద్ర మంత్రి అధికారిక ప్రకటనలో తేలనుంది.
ఇదీ చదవండి : చిరంజీవి, కీర్తి సురేష్ తల్లితో రొమాన్స్ చేసిన ఈ సినిమా తెలుసా..! అందులో మెగాస్టార్ విలన్..
ఇదీ చదవండి : ప్రస్తుత మార్కెట్ వాల్యూ ప్రకారం నాగార్జున ‘అన్నపూర్ణ స్టూడియో’ మార్కెట్ విలువ ఎంతో తెలుసా..?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.