Shubman Gill Sara Tendulkar: సారా టెండూల్కర్‌తో శుభ్‌మన్ గిల్ మళ్లీ చెట్టాపట్టాల్.. కుంభమేళాలో ప్రత్యక్షం..?

1 /7

తమ ప్రేమ వ్యవహారంపై శుభ్‌మన్ గిల్-సారా టెండూల్కర్ ఎప్పుడు అధికారికంగా ప్రకటించలేదు. గిల్ సోదరితో కలిసి సారా నైట్ పార్టీలకు అటెండ్ కావడంతో రూమర్స్‌కు మరింత బలం చేకూరింది.   

2 /7

అయితే ఇద్దరి మధ్య గొడవ జరిగి బ్రేకప్ చెప్పేసుకున్నారని.. గిల్ మరోకరితో డేటింగ్ మొదలెట్టేశాడని కొత్త వార్తలు కూడా చక్కర్లు కొట్టాయి.  

3 /7

ఈ డేటింగ్, బ్రేకప్ ప్రచారం మధ్య మరోసారి గిల్-సారా కుంభమేళాకు హాజరైనట్లు పిక్స్ వైరల్ కావడంతో అభిమానులు షాక్‌కు గురయ్యారు.  

4 /7

అయితే ఈ పిక్స్‌ నిజం కాదని ఫ్యాక్ట్‌ చెక్‌లో తేలిపోయింది. ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ (ఏఐ) సాయంతో క్రియేట్ చేసి వైరల్ చేశారు.  

5 /7

ఏఐ అందుబాటులోకి వచ్చిన తరువాత ఫేక్ పిక్స్‌ వ్యాప్తి ఎక్కువగా పెరిగిపోయింది. ముఖ్యంగా సెలబ్రిటీల పిక్స్‌ను తప్పుగా క్రియేట్ చేస్తూ కొత్త రూమర్లు సృష్టిస్తున్నారు.  

6 /7

ఇలాంటి ఫేక్స్ పిక్స్ వైరల్ చేస్తుండడంపై ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. సాంకేతికతను కెరీర్‌ను డెవలప్ చేసుకునేందుకు వాడుకోవాలని.. ఇలా తప్పుడు ప్రచారానికి వాడుకోవద్దని హితవు పలుకుతున్నారు.  

7 /7

ఇటీవల బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో ఆడిన శుభ్‌మన్ గిల్ ప్రస్తుతం ఫ్యామిలితో గడుపుతున్నాడు. లోహ్రీ ఫెస్టివల్ పిక్స్‌ను సోషల్ మీడియాలో షేర్ చేశాడు.