8th Pay Commission: ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్‌తో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల వేతనం లక్షల్లో పెరగనుందా.. 8th పే కమిషన్ తాజా అప్‌డేట్..

Central Government Employees Salary Hike: ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ 8వ వేతన కమిషన్ ఏర్పాటుకి ఆమోదం తెలిపారు. దీని వల్ల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు పెద్ద ఎత్తున వేతన పెంపు పెరనున్నాయి. ప్రస్తుతం 7వ వేతన కమిషన్ ప్రకారం వేతనాలు అందుకుంటున్నవారు.. కొత్తగా ఏర్పడబోయే  8వ వేతన కమిషన్ సిఫార్సుల ప్రకారం కొత్త వేతనాలతో భారీగా లాభపడునున్నారు. 

1 /5

Fitment Factor in Pay Commission: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆధ్వర్యంలోని కేంద్ర క్యాబినేట్  కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కోసం 8వ పే కమిషన్‌ కు ఆమోదం తెలిపారు.  ఈ ప్రకటనను సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ మీడియాు వెల్లడించారు. ఈ కమిషన్ ఏర్పాటు వార్త, కేంద్రీయ ఉద్యోగుల డియర్‌నెస్ అలవెన్స్ (DA) 50 శాతాన్ని మించి పెరగడం వలన వచ్చింది. దీని ప్రకారం  కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు  2024 జులై 1 నుంచి 53% డియర్‌నెస్ అలవెన్స్ పొందుతున్నారు. త్వరలో ఏర్పాటు కానున్న 8వ పే కమిషన్ ను  2025 జనవరి నెల నుంచి పెరుగుదల ఉండబోతుంది. పూర్తి స్థాయిల్లో అమల్లోకి వచ్చిన తర్వాత పాత బాకీలన్ని కలిపి ఉద్యోగులకు వేతనం ఇవ్వనున్నారు.

2 /5

Dearness Allowance Hike: ప్రస్తుతం ఉద్యోగులు 7వ పే కమిషన్ సిఫార్సుల మేరకు జీతాలు పొందుతున్నారు. 2016 జనవరి 1న ఆమోదించిన 7వ పే కమిషన్, కనీస జీతాన్ని రూ.7,000 నుంచి రూ.18,000కి పెంచింది. ఇప్పుడు, 8వ పే కమిషన్ సూచనలు వచ్చిన తర్వాత జీతాల్లో భారీ పెరుగుదల ఉండే అవకాశం ఉంది. కేంద్ర ప్రభుత్వ వర్గాల  ప్రకారం, కనీస వేతనం రూ.51,480కి చేరుకునే అవకాశం ఉంది.

3 /5

Fitment Factor in 8th Pay Commission: ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ అనేది ఉద్యోగుల జీతాల మార్పుకి సంబంధించనది. 7వ పే కమిషన్ 2.57 గా ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్‌ను నిర్ధారించింది. ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ ఆధారంగా, ఉద్యోగుల కనీస వేతనం మూడు రెట్లు పెరిగే అవకాశం ఉంది. కేంద్ర ప్రభుత్వ వర్గాల ప్రకారం, 8వ పే కమిషన్ 2.5-2.8 మధ్య ఉండచ్చని చెబుతున్నారు.

4 /5

Revised Pay Rules 2025: ఉదాహరణకు, ఒక ఉద్యోగి ప్రస్తుత కనీస వేతనం రూ.40,000గా ఉంటే, 8వ పే కమిషన్ 2.5 ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ ప్రకారం.., కొత్త వేతనం రూ.1,00,000కు పెరుగుతుంది. మొదట, డియర్‌నెస్ అలవెన్స్ ఉండదు కానీ, పే కమిషన్ సిఫార్సుల ప్రకారం తదుపరి సంవత్సరాల్లో అదనపు అలవెన్స్‌లు దీనికి జోడించనున్నారు.

5 /5

Benefits for Government Employees: 8వ పే కమిషన్ వల్ల ఉద్యోగుల జీతాలు మాత్రమే కాకుండా, పెన్షన్, గ్రాట్యుటీ వంటి రిటైర్‌మెంట్ ప్రయోజనాలు కూడా పెరుగుతాయి. కొత్త "సెంట్రల్ సివిల్ సర్వీస్ రూల్స్ 2025" ప్రకారం, ఈ మార్పులు అమలు చేయబడతాయి. సానుకూలమైన ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్‌తో ఉద్యోగులు భారీగా లబ్ధి పొందే అవకాశం ఉంది.