ఏజ్‌తో పనేంటి ... మ్యాటర్ ఉంటే చాలు..... సై అంటున్న రకుల్ ప్రీత్

మంచి కథ దొరికితే చాలు...హీరోల వయస్సు తో పనేంటి అన్నట్లుగా వ్యహరిస్తోంది రకుల్ ప్రత్ సింగ్. అందుకే 50 ఏళ్ళు నిందిన హీరోలకు సైతం ఓటేస్తోంది రకుల్ ప్రీత్ సింగ్ 

Last Updated : Jun 15, 2019, 05:48 PM IST
ఏజ్‌తో పనేంటి ... మ్యాటర్ ఉంటే చాలు..... సై అంటున్న రకుల్ ప్రీత్

దక్షిణాది సిమినామాల్లో ఆల్మోస్ట్ టాప్ స్టార్స్ హీరోస్ సరసన నటించింది  రకుల్ ప్రీత్ సింగ్.  జస్ట్ సౌత్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకన్న ఈ ముద్దుగుమ్మ ఇటివలే గేర్ మార్చింది . ఇప్పుడు బాలీవుడ్ లో కూడా తన మార్క్ క్రియేట్ చేసుకుంది. 

ఏకంగా స్టార్ అజయ్ దేవ్ గన్ సరసన నటించి మొదటి సినిమాతోనే స్టార్ హీరోయిన్ అనిపించుకుంది. ఈ సినిమాలో  50 ఏళ్ళు పైబడిన వ్యక్తితో ప్రేమలో పడే అమ్మాయిగా నటించింది రకుల్ . ఇప్పుడు తాజాగా టాలీవుడ్ లో ‘మన్మధుడు 2’లో ఏజ్డ్ బ్యాచిలర్ గా కనిపించబోతున్న నాగ్ సరసన నటించేందుకు సై  అనేసింది ఈ ముద్దుగుమ్మ.

ఇదిలా ఉంటే రీసెంట్ గా వెంకటేష్ చేయబోతున్న ‘దేదే ప్యార్ దే’ సినిమాలో కూడా రకుల్ నే హీరోయిన్ గా ప్రిఫర్ చేస్తున్నారని సమాచారం. ఈ సినిమా తెలుగు రీమేక్ లో కూడా హీరో ఏజ్ 50 ప్లస్సే. రకుల్ విషయంలో ఇవి అనుకోకుండానే  ఇది రిపీటెడ్ గా జరుగుతున్నాయట. 

రకుల్ పక్కా ఇలాగే ప్లాన్ చేసుకుంది అని చెప్పలేం కానీ... ఈ రోల్ కి రకుల్ అయితేనే పర్ఫెక్ట్ అనిపించుకుంటుంది. హీరో క్యారెక్టర్ ని బట్టి కాస్త ఏజ్డ్ గా చూపించాలంటే న్యాచురల్ గానే హీరోయిన్ యంగ్ గా ఉండాలి. అందుకే ఇలాంటి క్యారెక్టర్స్ కి రకుల్ నే ప్రిఫర్ చేస్తున్నారు మేకర్స్. ఈ విషయంపై రకుల్ స్పందిస్తూ ఏజ్‌తో పనేంటి ... కథ మంచిగుంటే చాలు అని ఈ ప్రాజెక్టులకు ఓకే చెప్పేందట

Trending News