Pavithra Gowda: హీరో దర్శన్ ను క్రిమినల్ గా చేసిన పవిత్ర గౌడ ఎవరు.. ? ఆమె బ్యాక్ గ్రౌండ్ ఇదే..

Pavithra Gowda: పవిత్ర గౌడ ప్రస్తుతం దేశ వ్యాప్తంగా మారు మోగుతోన్న పేరు. ఈమెతో సహ జీవనం కారణంగా దర్శన్ క్రిమినల్ అయ్యాడు. అంతేకాదు రేణుకా స్వామి హత్యపై ఆరోపణలతో అరెస్ట్ అయ్యాడు. ఈ సమయంలో పవిత్ర గౌడ ఎవరనేది ఇపుడు చర్చనీయాంశంగా మారింది.

1 /7

పవిత్ర గౌడ.. గత కొన్నేళ్లుగా హీరో దర్శన్ కు పెళ్లైన విషయం తెలిసినా.. సహ జీవనం చేస్తోంది. అది కూడా గత పదేళ్లగా హీరో దర్శన్ తో ఉంటున్న వీడియో ఒకటి షేర్ చేసింది. అందులో తమ బంధానికి పదేళ్లు అంటూ పోస్ట్ చేసిన వీడియో కన్నడ సినీ ఇండస్ట్రీలో కలకలం రేపింది.

2 /7

అందులో హీరో దర్శన్ తో సన్నిహితంగా ఉన్న ఫోటోలను పంచుకుంది. ఇక దర్శన్ కు విజయ లక్ష్మీని దాదాపు 20 యేళ్ల క్రితమే పెళ్లి చేసుకున్నాడు. వీరికో అబ్బాయి ఉన్నాడు.  

3 /7

దర్శన్ కొన్నేళ్లుగా పవిత్ర గౌడతో సహ జీవనం చేస్తున్నాడు. దర్శన్ మొదటి భార్యకు పవిత్ర గౌడ వల్ల అన్యాయం జరుగుతుందనే ఉద్దేశ్యంతో దర్శన్ ను విడిచిపెట్టాలని కోరుతూ..దర్శన్ కు  వీరాభిమాని అయిన  రేణుకా స్వామి అనే యువకుడు తన సామాజిక మాధ్యమం వేదికగా పవిత్రను టార్గెట్ చేస్తూ పోస్టులు పెట్టడం మొదలు పెట్టాడు. ఈ నేపథ్యంలో కొన్ని అసభ్యకర సందేశాలను పంపాడు.

4 /7

అంతేకాదు దర్శన్ ను  విడిచిపెట్టకపోతే.. తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించాడు రేణుకా స్వామి. అదే అతని హత్యకు దారి తీసిందంటున్నారు. ఈ విషయమై అతని శవాన్ని మాయం చేసేందకు తమకు రూ. 30 లక్షలను దర్శన్ ఆఫర్ చేసాడని.. ఈ కేసులో చిక్కిన ముగ్గురు నిందితులు పోలీసులకు వాంగ్మూలం ఇచ్చారు.

5 /7

దీంతో పోలీసులు దర్శన్ పై హత్య కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న ఆయన అభిమానులు పోలీస్ స్టేషన్ ను ముట్టడించారు.

6 /7

పవిత్ర గౌడ.. టీవీ నటిగా తన ప్రస్థానం మొదలు పెట్టి కొన్ని సినిమాల్లో నటించింది. 2016లో 54321 సినిమాతో కథానాయికగా ఎంట్రీ ఇచ్చింది. ఛత్రిగాలు సార్ ఛత్రిగాలు, అగమ్య, ప్రీతి కితాబు వంటి సినిమాల్లో నటించింది.

7 /7

నటి కాకముందు మోడల్ గా పనిచేసిన పవిత్ర గౌడ.. ‘రెడ్ కార్పెట్ స్టూడియో  777’ పేరిట ఓ బొటిక్ నిర్వహిస్తోంది. తాజాగా తనను ఇన్ స్టాగ్రామ్ లో బెదిరించిన దర్శన్ అభిమాని హత్య కేసులో ఈమె కూడా నిందితురాలిగా ఉంది.