Arudra Meet To Chandrababu: తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న తన కుమార్తెను బతికించుకోవడానికి ఆ తల్లి ఎన్నో కష్టాలు పడింది. స్వయంగా ముఖ్యమంత్రి నివాసానికి వస్తే న్యాయం జరగలేదు. తన కుమార్తె వైద్యానికి ఆస్తులు అమ్మి వైద్యం చేయిద్దామనుకుంటే స్థానిక నాయకులు వేధింపులకు పాల్పడడంతో ఆమె రోదన అరణ్య రోదనగా మారింది. కానీ గిర్రున రోజులు తిరిగాయి. ఇప్పుడు గతంలో ఉన్న ప్రభుత్వం లేకపోవడంతో ఆమెకు భరోసా లభిచింది. ఇదంతా చెప్పేది ఆరుద్ర గురించి. ఆమె సీఎం చంద్రబాబును కలవగా.. ఆయన పూర్తి అభయం ఇచ్చి పింఛన్ సదుపాయం కల్పించారు.
Also Read: RK Roja CID: మంత్రిగా ఆర్కే రోజా రూ.100 కోట్ల అవినీతి.. సీఐడీకి ఫిర్యాదుతో ఏపీలో కలకలం
కాకినాడకు చెందిన ఆరుద్ర అనే మహిళకు ఓ కుమార్తె ఉంది. పేరు సాయిలక్ష్మీ చంద్ర. ఆ యువతికి వెన్నులో కణితి ఏర్పడటంతో తీవ్ర అనారోగ్యం పాలైంది. ఈ విషయాన్ని గతంలో సీఎంగా ఉన్న వైఎస్ జగన్ దృష్టికి తీసుకొచ్చారు. అయితే వైద్య ఖర్చుల కోసం తన ఆస్తులు అమ్ముకోవడానికి కూడా ప్రయత్నాలు చేయగా తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి. బిడ్డతోపాటు తాను చనిపోయే వరకు చేరినా కూడా నాటి ప్రభుత్వం స్పందించలేదు. ఈ వ్యవహారం నాటి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు వచ్చాయి.
Also Read: AP Portfolios: ఏపీ శాఖల కేటాయింపు: లోకేశ్‌కు ఐటీ, అనితకు హోం, పయ్యావులకు ఆర్థికం.. పవన్‌కు ఏ శాఖలు?
తాజాగా కూటమి ప్రభుత్వం ఏర్పడడం.. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ఎన్నికవడంతో ఆరుద్ర తన బాధలన్నింటిని చెపి ఆవేదనకు లోనైంది. వెలగపూడి సచివాలయంలో శుక్రవారం సీఎం చంద్రబాబును తన కుమార్తె సాయిలక్ష్మీ చంద్రతో వచ్చి కలిశారు. గత ప్రభుత్వంలో ఎదుర్కొన్న సమస్యలు, వేధింపులను ముఖ్యమంత్రికి వివరించారు. అమలాపురంలో తన స్థలం విక్రయంలో ఇప్పటికీ ఇబ్బందులకు గురి చేసి కోర్టుల చుట్టూ తిప్పుతున్నారని వాపోయారు.
ఆమె సమస్యలు సావధానంగా విన్న ముఖ్యమంత్రి కుమార్తె సాయిలక్ష్మీ చంద్రకు రూ.5 లక్షల ఆర్థిక సాయం ప్రకటించారు. దీంతోపాటు ప్రతి నెలా రూ.10 వేల పింఛన్ అందిస్తామని హామీ ఇచ్చారు. కోర్టులో ఉన్న స్థల వివాదంపై ప్రభుత్వపరంగా సాయం చేస్తామని భరోసా ఇచ్చారు. ముఖ్యమంత్రి తమకు అండగా నిలబడడంపై ఆరుద్ర భావోద్వేగానికి గురయ్యారు. ఇక తమ కష్టాలు తీరాయని.. తమ కుమార్తె విషయంలో బెంగ పడనవసరం లేదని ఆరుద్ర పేర్కొన్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter