AP Portfolios: ఏపీ శాఖల కేటాయింపు: లోకేశ్‌కు ఐటీ, అనితకు హోం, పయ్యావులకు ఆర్థికం.. పవన్‌కు ఏ శాఖలు?

AP Cabinet Minister Portfolios Allocated To Ministers Pawan Kalyan Whate Get Ministry: అత్యంత ఉత్కంఠ కలిగిన ఆంధ్రప్రదేశ్‌ మంత్రుల శాఖ కేటాయింపు ఎట్టకేలకు పూర్తయ్యింది. పవన్‌ కల్యాణ్‌కు కీలక శాఖలు లభించగా మరికొందరికి ఊహించని శాఖలు లభించాయి.

Written by - Ravi Kumar Sargam | Last Updated : Jun 14, 2024, 03:20 PM IST
AP Portfolios: ఏపీ శాఖల కేటాయింపు: లోకేశ్‌కు ఐటీ, అనితకు హోం, పయ్యావులకు ఆర్థికం.. పవన్‌కు ఏ శాఖలు?

AP Portfolios: సుదీర్ఘ కసరత్తు తర్వాత ఆంధ్రప్రదేశ్‌ శాఖల కేటాయింపు పూర్తయ్యింది. అనూహ్యంగా హోం మంత్రిత్వ శాఖను వంగలపూడి అనితకు కేటాయించగా.. ఉప ముఖ్యమంత్రిగా నియమితులవుతారనుకుంటే ఊహించని విధంగా పవన్‌కు శాఖలు కేటాయించారు. గ్రామీణాభివృద్ధి, పంచాయతీ రాజ్‌, గ్రామీణ నీటి సరఫరా, పర్యావరణ, అటవీ, శాస్త్ర, సాంకేతిక శాఖలు పవన్‌కు దక్కాయి. ఊహించినట్టుగానే మరోసారి నారా లోకేశ్‌కు ఐటీ మంత్రిత్వ శాఖ దక్కింది. దాంతోపాటు మానవ వనరుల అభివృద్ధి శాఖ లభించింది. జనసేన నుంచి మంత్రిగా ఎంపికైన నాదెండ్ల మనోహర్‌కు పౌరసఫరాలు, వినియోగదారుల సంబంధాల శాఖ కేటాయించారు.

Also Read: Chandrababu: అధికారులకు చంద్రబాబు ఝలక్‌.. పూల బొకేలు తిరస్కరణ

సుదీర్ఘ కసరత్తు
బ్రహ్మాండమైన మెజార్టీతో కొలువుదీరిన కూటమి ప్రభుత్వం ఇటీవల బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో సహా 24 మంది మంత్రులుగా ప్రమాణస్వీకారం చేసిన విషయం తెలిసిందే. ప్రమాణస్వీకారం చేసిన రెండు రోజుల తర్వాత ఏపీ ప్రభుత్వం శాఖలు కేటాయించింది. అయితే శాఖల కేటాయింపుపై చంద్రబాబు నాయుడు ప్రత్యేక కసరత్తు చేశారు. రెండు రోజుల పాటు సుదీర్ఘ మంతనాల తర్వాత శుక్రవారం ప్రకటించారు. అయితే అనూహ్యంగా ప్రధాన శాఖలు ఊహించని వ్యక్తులకు కేటాయించారు.

Also Read: Amaravati Movement: బాబు ప్రమాణంతో 1,631 రోజుల ఉద్యమానికి బ్రేక్‌.. ఊపిరి పోసుకున్న అమరావతి

శాఖలు ఇలా..

  • నారా చంద్రబాబు నాయుడు                       ముఖ్యమంత్రి, సాధారణ పరిపాలన, శాంతి భద్రతలు, కేటాయించని శాఖలు.
  • పవన్‌ కల్యాణ్‌                                             గ్రామీణాభివృద్ధి, పంచాయతీ రాజ్‌, గ్రామీణ నీటి సరఫరా, పర్యావరణ, అటవీ, శాస్త్ర, సాంకేతిక శాఖలు
  • నారా లోకేశ్‌                                                ఐటీ, మానవ వనరుల అభివృద్ధి శాఖ
  • కింజరపు అచ్చెన్నాయుడు                        వ్యవసాయ, సహకార, మార్కెటింగ్‌, పశు, పాడి అభివృధ్ది, మత్య్స శాఖ
  • కొల్లు రవీంద్ర                                            గనులు, ఎక్సైజ్‌ శాఖ
  • నాదెండ్ల మనోహర్‌                                    పౌరసఫరాలు, వినియోగదారుల సంబంధాల శాఖ.
  • నారాయణ                                                మున్సిపల్‌ పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖ
  • వంగలపూడి అనిత                                   హోం శాఖ, విపత్తు నిర్వహణ
  • సత్య కుమార్‌                                            వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ
  • నిమ్మల రామనాయుడు                           నీటి వనరుల అభివృద్ధి
  • మహ్మద్‌ ఫరూక్‌                                        మైనార్టీ శాఖ
  • ఆనం రామనారాయణ రెడ్డి                      దేవాదాయ శాఖ
  • పయ్యావుల కేశవ్‌                                      ఆర్థిక, ప్రణాళిక, వాణిజ్య పన్నులు, శాసన శాఖ
  • అనగాని సత్య ప్రసాద్‌                              రెవెన్యూ, రిజిస్ట్రేషన్స్‌, స్టాంపుల శాఖ
  • కొలుసు పార్థసారథి                                  గృహ నిర్మాణ, సమాచార శాఖ
  • దూల బాల వీరాంజనేయ స్వామి             సాంఘిక సంక్షేమ, దివ్యాంగులు, వృద్ధుల సంక్షేమ శాఖ, సచివాలయం, గ్రామ వాలంటీర్‌ శాఖ
  • గొట్టిపాటి రవి కుమార్‌                               ఇంధన శాఖ
  • కందుల దుర్గేశ్‌                                        పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ
  • బీసీ జనార్ధన్‌ రెడ్డి                                    రోడ్లు భవనాలు, మౌలిక, పెట్టుబడుల శాఖ
  • టీజీ భరత్‌                                               పరిశ్రమలు, వాణిజ్య, ఫుడ్‌ ప్రాసెసింగ్‌ శాఖ
  • సవిత                                                      బీసీ సంక్షేమ శాఖ, ఆర్థికంగా వెనుకబడిన సంక్షేమం, చేనేత శాఖ
  • వాసంశెట్టి సుభాష్‌                                    కార్మిక, పరిశ్రమలు, బాయిలర్స్‌, బీమా వైద్య సేవల శాఖ
  • కొండపల్లి శ్రీనివాస్‌                                  సూక్ష్మ చిన్న తరహా శాఖ, ఎన్నారై శాఖ
  • మందిపల్లి రామ్‌ప్రసాద్‌ రెడ్డి                   రవాణా, యువజన క్రీడా శాఖ
  • సంధ్యారాణి                                            స్త్రీ, సంక్షేమ, గిరిజన శాఖ

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News