Nara Lokesh: యాక్షన్‌ మోడ్ ఆన్.. తొలి అడుగులోనే మంత్రి లోకేష్ ఊహించని నిర్ణయం

Nara Lokesh Praja Darbar: నారా లోకేష్‌ సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ప్రజా దర్బార్ పేరుతో నియోజకవర్గ ప్రజా సమస్యలు పరిష్కరించేందుకు ఓ బృందాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. నేడు ప్రజల సమస్యలు విన్న ఆయన.. తక్షణమే యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు.   

Written by - Ashok Krindinti | Last Updated : Jun 15, 2024, 01:36 PM IST
Nara Lokesh: యాక్షన్‌ మోడ్ ఆన్.. తొలి అడుగులోనే మంత్రి లోకేష్ ఊహించని నిర్ణయం

 Nara Lokesh Praja Darbar: ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్‌ యాక్షన్ మోడ్‌లోకి దిగారు. గత ఎన్నికల్లో మంగళగిరి నుంచి ఓడిపోయినా.. ప్రజలకు దగ్గర ఉంటూ సేవా కార్యాక్రమాలు నిర్వహించిన విషయం తెలిసిందే. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో రికార్డుస్థాయి మెజారిటీతో ఘనవిజయం సాధించారు. ఎమ్మెల్యేగా ఎన్నికై.. మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఎన్నికల ప్రచారంలో మంగళగిరి ప్రజల కోసం తమ ఇంటి ద్వారాలు తెరిచే ఉంటాయని చెప్పిన లోకేష్.. చెప్పినట్లే తొలి అడుగులోనే అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. ప్రజా సమస్యలు నేరుగా తెలుసుకునేందుకు ప్రజాదర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించారు. 

Also Read: Viral video: బాప్ రే.. సింహం నాలుకకు యాపిల్ వాచ్.. వైరల్ గా మారిన వీడియో ఇదే..

శనివారం ఉదయం 8 గంటల నుంచి ఉండవల్లిలోని తన నివాసంలో ప్రజలతో మాట్లాడి సమస్యల గురించి తెలుసుకున్నారు. ప్రజా సమస్యలు ఎప్పటికప్పుడు తెలుసుకుని.. వాటిని పరిష్కరించేందుకు ప్రత్యేక యంత్రాంగాన్ని ఆయన ఏర్పాటు చేశారు. నారా లోకేష్ గెలిస్తే.. నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండరని 2019 ఎన్నికల సమయంలో వైసీపీ నేతలు ప్రచారం చేసిన విషయం తెలిసిందే. అయితే వైసీపీ తరుఫున గెలిచిన ఎమ్మెల్యే ఆర్కే పెద్దగా ప్రజలకు అందుబాటులోకి రాకపోగా.. ఓడిపోయినా నారా లోకేష్ ప్రజల్లోనే ఉన్నారు. తన సొంత నిధులతో 29 సంక్షేమ పథకాలను మంగళగిరి ప్రజలకు అందించారు. 

తనపై విమర్శలు గుప్పించిన వైసీపీ నేతలకు తన పనులతోనే నారా లోకేష్ గట్టిగా సమాధానం ఇచ్చారు. ఎన్నికలకు చాలా రోజుల ముందే యువగళం పేరుతో పాదయాత్ర నిర్వహించిన నారా లోకేష్.. రెడ్ బుక్‌ పేరుతో టీడీపీ నాయకులపై దాడులు చేసిన వారందరి పేర్లు నోట్ చేసుకున్నానని చెప్పారు. అధికారంలోకి వచ్చిన తరువాత ఏ ఒక్కరిని వదలమని ముందే హెచ్చరించారు. ఇక ఎన్నికల సమయానికి పూర్తిగా మంగళగిరికే పరిమితమైన నారా లోకేష్.. భారీ మెజార్టీతో విజయం సాధించారు. మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయగా.. గతంలో ఆయన చేపట్టిన ఐటీ శాఖను మళ్లీ చంద్రబాబు అప్పగించారు. మంత్రిగా రాష్ట్రం అంతా అందుబాటులో ఉండాల్సి ఉన్నా.. ఎమ్మెల్యేగా ఎప్పుడు నియోజకవర్గ ప్రజా సమస్యలు పరిష్కరించేందుకు ప్రజాదర్బార్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. 

శనివారం జరిగిన కార్యక్రమంలో మంగళగిరి ప్రజలు పలు సమస్యలు నేరుగా మంత్రి నారా లోకేష్‌కు విన్నవించుకున్నారు. సాధ్యమైనంత త్వరగా వారి సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. సమస్యల పరిష్కారాని యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలని అధికారులను ఆయన ఆదేశించారు. నియోజకవర్గ ప్రజలకు ప్రత్యేక టీమ్‌ను కూడా ఏర్పాటు చేయాలని ప్లాన్ చేశారు. తాను అందుబాటులో ఉన్నా లేకున్నా.. ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసేందుకు ఓ బృందం పనిచేయాలని నిర్ణయించారు.  

Also Read: Vote Percentage: తెలుగుదేశం పార్టీకి భారీ షాక్‌.. వైఎస్సార్‌సీపీకి కలిసొచ్చిన అదృష్టం

 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

Trending News